రంగారెడ్డి

మున్సిపల్ ఎన్నికలకు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జనవరి 21: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈనెల 22 బుధవారం జరిగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 17 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగుతుండగా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు సీపీ తెలిపారు. 22 మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలకు 470 వార్డులు ఉండగా ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనున్నారని పేర్కొన్నారు. 470 వార్డులలో ఇప్పటికే ఏడు ఏకగ్రీవంగా ఎన్నుకొగా 463 వార్డులకు 1874 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అన్నారు. 428 పోలింగ్ ప్రాంతాలలో 92 సమస్యత్మాక ప్రాంతాలని గుర్తించినట్టు సీపీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో 23 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 24 స్ట్రైకింగ్ ఫోర్స్, 21 స్పెషల్ ఫోర్స్, 23 సర్వేలైన్స్ టీమ్స్, 24 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు సీపీ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా 216 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేసి, లైసెన్స్ రివాల్వర్‌లు ఉన్న 598 మంది వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4107 మంది సిబ్బందిలో ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇప్పటి వరకు రూ.80వేల నగదు, 843 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు.