రంగారెడ్డి

గుర్రంపల్లి జాతరకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జనవరి 23: గుర్రంపల్లి జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర ఉత్సవాల్లో మొదటి రోజు గంధంతో అలంకరణ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. జనవరి 24 నుంచి 27వ వరకు నాలుగు రోజుల పాటు గుర్రంపల్లి జాతర ఉర్సు ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 24వ తేది శుక్రవారం గంధం అలంకరణ, 25వ తేది శనివారం దీపధూప అలంకారణ, 26వ తేది ఆదివారం కందూరు, 27వ తేది సోమవారం ఖవాలితో గుర్రంపల్లి జాతర ఉర్సు ఉత్సవాలు ముగియనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామంలో నిర్వహించే జాతరకు మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. మహిమలు కలిగిన అశ్వముకు వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. మహిమలు కలిగిన అశ్వము ద్వారా గ్రహబాధ, పిల్లల సోమిడి, కడుపునొప్పి, మానసిక, శారీరక రుగ్మతలు, భూత సంబంధమైన అనేక రోగాలు అశ్వము మొక్క దీవెనలతో తొలగిపోతాయని భక్తుల ఫ్రగాడ నమ్మకం. గుర్రంపల్లి జాతర ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే అనేక గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు ట్లు పూర్తి చేశారు.
ప్రశాతంగా ఉత్సవాలు : ఏసీపీ సురేందర్
జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని గుర్రంపల్లి గ్రామంలో నిర్వహించే గుర్రం (అశ్వము) ఉర్సు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ సూచించారు. బుధవారం గుర్రంపల్లి గ్రామంలో అశ్వము (గుర్రం) వద్ద నిర్వహించే ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉర్సు ఉత్సవాల నేపధ్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిరంతరం నిఘా పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఉర్సు ఉత్సవాలకు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు.