రంగారెడ్డి

సైబర్ నేరాలపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 23: సైబర్ నేరాలపై ప్రజలను చైతన్య వంతం చేయాల్సిన అవసరం ఉందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఐటీ ఉద్యోగుల సమయంతో పాఠశాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించన్నుట్లు సీపీ వివరించారు. సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో సైబర్ సైక్యూరిటీ కాన్‌క్లేవ్ నెక్స్ జెన్‌థ్రెట్స్ అండ్ సోల్యూషన్ అంశంపై నిర్వహించిన సదస్సు నిర్వహించారు. ప్రజల అవగాహనతోనే సైబర్ నేరాలను అదుపు చేయవచ్చని అన్నారు. సులువుగా డబ్బు సంపాదించ వచ్చని నమ్మించి అమాయకులను ఎక్కడో కూర్చొని మోసాలు చేస్తున్నారని చెప్పారు. స్మార్ట్ఫోన్ల వినియోగం వలనే నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా మోస పోతున్నారని తెలిపారు. ఐటీ ఉద్యోగులు సమాజానికి సేవ చేయాడానికి ముందుకు వస్తున్నారని సీపీ చెప్పారు. ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేస్తు పోలీసులకు చాల సహయం చేస్తున్నారని తెలిపారు. అదే మాదిరిగా ఐటీ ఉద్యోగులు సహాయంతో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయన్నుట్లు సీపీ వివరించారు. చిన్నతనం నుంచే సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం వలన భవిష్యత్తులో క్రైంను తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల నుంచి ఐపీఎస్ అధికారులతో పాటు ఐటీ నిపుణులు 600 మంది సదస్సుకు హాజరైనట్లు సీపీ వివరించారు. నేరాల అదుపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి సూచనలు సలహాలు ఇస్తారని సజ్జనార్ చెప్పారు.