రంగారెడ్డి

బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, జనవరి 23: సమయానుగుణంగా బస్సులు నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్నిమార్లు అధికారులకు విన్నవించినా స్పందన కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో కలిసి రోడ్డెక్కారు. తమ సమస్యను పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా, వినతులు అందించినా స్పందించడం లేదని తమకు బస్సులు కేటాయించే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. బస్సులను అడ్డుకొని గురువారం రహదారిపై ధర్నాకు దిగారు.
విద్యార్థులు మాట్లాడుతూ యాచారం మండల పరిధిలోని మల్కీజ్‌గూడ, మేడిపల్లి, నానక్‌నగర్, పిల్లిపల్లి, తాడిపర్తి గ్రామాలకు గతంలో ఇబ్రహీంపట్నం డిపో నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు నడిచేవని వాటిని అధికారులు అర్థాంతరంగా తొలగించారని దీంతో సహనం నశించి రోడ్డెక్కాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోతున్నారు. యాచారం సీఐ మధుకుమార్ మాట్లాడి బస్సులు యధావిధిగా నడిపించే విధంగా మాట్లాడతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. విద్యార్థులకు మద్దతుగా సీపీఎం నాయకులు అలంపల్లి నర్సింహ, టీఆర్‌ఎస్ నాయకులు శంకర్, నాయకులు చీర శేఖర్, మల్లేశ్, రవీందర్ ఉన్నారు.