రంగారెడ్డి

నేతాజీ 123వ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్: సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురవారం పట్టణంలోని నేతాజి చౌరస్తాలరో సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు వన్నాడ వెంకటేష్, సర్వర్ పాషా, అగ్గనూరు రాజు, నందు, శివకుమార్, రాజేష్, సురేష్, అనీఫ్‌బాయ్, వేణుగౌడ్, రాజు, మహేష్, చెక్క లక్ష్మణ్, గొల్ల రాజు, గణేష్, మధు, ఈశ్వర్, గోపాల్, శ్రీను పాల్గొన్నారు.
అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అలర్పించారు. గురువారం షాద్‌నగర్ నేతాజీ చౌరస్తాలో సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ నేతలు పూలమాల వేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుట్నాల సాయికుమార్, ఏబీవీపీ నాయకులు విజయ్, భాను, చరణ్, మహేందర్, సందీప్, శ్రీకాంత్, శ్రీనాథ్, శ్రావణ్ పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: స్వాతంత్య్ర సంగ్రామంలో తన పోరాట పటిమతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహానీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సులిగె వెంకటేష్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు రావుల జంగయ్య, సుభాష్‌రెడ్డి, ఎన్.మల్లారెడ్డి, ఎం.రామేశ్వర్ రావు, ఎం.కొమరయ్య, వై.శ్రీ్ధర్, ఎన్.రాజేందర్, ఎస్.్ధనుంజయ, శ్రీశైలం, రమేష్, చిన్న, రాచూరి రాజశేఖర్, నల్లింగ్ రమేష్, కే.సుధాకర్, ఎస్.విజయ్ కుమార్, బీ.హరినాధ్, ఎస్.రవీందర్, బీ.సిద్ధేశ్వర్, కిరణ్‌చారి, గౌతమ్, ఎం.శ్రీను, ఎస్.జయానంద్ రెడ్డి, సీ.చిన్న, ఆర్.జగన్, కే.జితేందర్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ కోరని దయానంద్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించుకున్నారు. అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య హాజరై నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళి అర్పించారు.
ఉప్పల్: భారత జాతి ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి వేడుకలను గురువారం చిల్కానగర్‌లో ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.