రంగారెడ్డి

ప్రపంచంలోనే భారీ ధ్యాన నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జనవరి 26: తాబేలు ఆకారాన్ని తలపించే రీతిలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ధ్యాన సంస్థ నిర్మాణం పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో..ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి సిద్దమైంది. ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన సంస్థ, హార్ట్‌పుల్ నెల్ సంస్థ 75వ వార్షికోత్సవంలో భాగంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనం గ్రామపంచాయతీలో నిర్మించింది. అంతర్జాతీయ నగరంగా మారుతున్న మహా నగరానికి చేరువలో ఈధ్యాన నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటైన కన్హా శాంతి వనంలో 30ఎకరాల విస్తీర్ణంలో ధ్యాన మందిరం ఏర్పాటైంది. ఈధ్యాన మందిరంలో ఒకే సారి లక్ష మంది ధ్యానం చేసుకునే విధంగా తీర్చిదిద్దారు. ప్రపంచంలో అతి పెద్దదిగా చెప్పబడుతూ..తాబేలు ఆకారంలో నిర్మితమైన ఈధ్యాన మందిరాన్ని హార్ట్‌పుల్ నెస్ సంస్థ మొదటి గురువు లాల్జీకి అంకితమివ్వనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే పెద్దదిగా భావిస్తున్న ఈధ్యాన మందిరాన్ని ఈనెల 28వ తేదీ రోజు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, ధ్యాన సంస్థ గురూజీ కమ్లేశ్ డీ పటేల్ (దాదాజీ) చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 28వ తేదీ నుండి 30వరకు, ఫిబ్రవరి 2నుంచి 4వరకు, ఫిబ్రవరి 7నుంచి 9వరకు ధ్యాన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 28వ తేదీ ధ్యాన కేంద్రాన్ని ప్రారభించిన తరువాత రాందేవ్ బాబా సుమారు 40వేల యోగా నిపుణుల నుద్దేశించి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. 2వ తేదీ ధ్యాన కేంద్రాన్ని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ సందర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆతరువాత అన్నా హాజారే సైతం ధ్యాన మందిర నిర్మాణాన్ని పరిశీలిస్తారని తెలిపారు. మూడు దఫాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలలో లక్షకు పైగా మహాధ్యాన ప్రక్రియలో పాల్గొంటారని చెబుతున్నారు. ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవానికి వ్యవధి లేకపోవడంతో మిగిలిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రాష్టప్రతి రాకను పురస్కరించుకుని ధ్యాన సంస్థ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
సిడ్నీ హార్బర్‌లా ధ్యాన కేంద్రం
కన్హాశాంతి వనంలో ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రం రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో సిడ్నీ హార్బర్‌ను తలపించేలా ఏర్పాట్లు చేశారు. ముంబైలో రెండు వేల మందికి సరిపోయే ధ్యాన కేంద్రం ఉండగా హైదరాబాద్ సమీపంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకునే విధంగా ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. 40వేల మందికి అతిథ్యమిచ్చే క్యాంపస్‌లో రోజుకు లక్ష మందికి భోజనాన్ని పెట్టే వంట గదులు, 350పడకల సామర్ధ్యం కలిగిన ఆయూష్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ధ్యాన కేంద్రం అవరణలో ఆరు లక్షల మొక్కలతో కూడిన నర్సరీలు ఉన్నాయి. నాలుగు సంవత్సరాల్లో లక్ష మొక్కలు నాటగా, మలిదశ జీవితాన్ని ప్రశాంతంగా గడిపే వారికి ఈ ధ్యాన కేంద్రం అనువుగా నిలుస్తుంది. ధ్యాన కేంద్రానికి ప్రముఖుల రాక సందర్భంగా నిర్వాహకులు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నారు.