రంగారెడ్డి

షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌గా నరేందర్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, జనవరి 26: మున్సిపల్ చైర్మన్ పదవీ కొందూటి నరేందర్‌కు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి విజయం సాధించిన కొందూటి నరేందర్‌కు చైర్మన్ పదవీ ఇచ్చేందుకు అధిష్టానం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ పదవి రేసులో 16వ వార్డు అభ్యర్థి ఎంఎస్ నటరాజ్, 23వ వార్డు అభ్యర్థి అగ్గనూరి విశాల విశ్వం పేర్లు ఉన్నట్లు సమాచారం. ముందుగా చైర్మన్ పదవీకి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైస్ చైర్మన్ పదవి కోసం ఇద్దరే కాకుండా మరికొంతమంది పేర్లు వినిపిస్తుండటంతో ఎవరిని వైస్ చైర్మన్ పదవి వరిస్తోందని పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పీర్జాదిగూడ మేయర్ పీఠంపై జక్క వెంకట్ రెడ్డి
* నేడే నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం
ఉప్పల్, జనవరి 26: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా రావడంతో మేయర్ పీఠం జక్క వెంకట్‌రెడ్డికే వరిస్తుంది. ఇక డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పట్టణంలో మొత్తం 26 డివిజన్లలో 16 డివిజన్లు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా కాంగ్రెస్-3, బీజేపీ-1, స్వతంత్రులు 6గురు కార్పొరేటర్లయ్యారు. మేయర్ పదవి ప్రముఖ బిల్డర్ జక్క వెంకట్ రెడ్డి పేరు ఖరారైంది. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన విద్యావంతుడైన జక్క వెంకట్ రెడ్డిని అధిష్ఠానం ఇప్పటికే ఆమోదించింది. ఇక డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి వరిస్తుందోనని పలువురు ఎదురుచూస్తున్నారు. పదవిని దక్కించుకోవడానికి ఒకే ఇంట్లో గెలిచిన ఇద్దరిలో కుర్ర శివకుమార్ గౌడ్, మహిళల్లో బండి రమ్య సతీష్ గౌడ్, పర్వతాపూర్ నుంచి యాసారం మహేశ్వరి, పాశం శశిరేఖ బుచ్చియాదవ్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మేయర్ పీఠంను జనరల్‌కు కేటాయిస్తే డిప్యూటీ మేయర్ పదవిని రిజర్వేషన్‌లో యాభై శాతం ఉన్న మహిళల్లో ఒకరికి ఇవ్వాల్సిందేనని గెలిచిన మహిళా కార్పొరేటర్లు కోరుతున్నారు.