రంగారెడ్డి

ఆమనగల్లు బీజేపీ కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, జనవరి 27: ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఎన్నికల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చెర్మెన్, వైస్ చెర్మెన్ ఎన్నికలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ తరపున 3వ వార్డు నుంచి విజయం సాధించిన నేనవత్ రాంపాల్‌ను మున్సిపల్ చైర్మన్‌గా, 4వ వార్డు నుంచి విజయం సాధించిన దుడ్డు కృష్ణయ్య ప్రతిపాదించగా,7వ వార్డు నుంచి విజయం సాధించిన తల్లోజు విజయకృష్ణ బలపరిచారు. అనంతరం వైస్ చెర్మెన్‌గా బీమనపల్లి దుర్గయ్యను 15వ వార్డు నుంచి విజయం సాధించిన చెక్కల లక్ష్మణ్ ప్రతిపాదించగా, 14వ వార్డు నుంచి విజయం సాధించిన చింతమల్ల చెన్నకేశవులు బలపరిచారని ఎన్నికల ప్రత్యేక అధికారి డిప్యూటీ సీఈఓ కే.జానకిరెడ్డి తెలిపారు. ఆమనగల్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ఆమనగల్లు ఎస్సై ధర్మేష్, తలకొండపల్లి ఎస్సై సురేష్ యాదవ్, కడ్తాల్ ఎస్సై సుందరయ్య బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రాములు, తహశీల్దార్ చందర్ రావు పాల్గొన్నారు.