రంగారెడ్డి

నిజాంపేట్ మేయర్‌గా కొలను నీలా రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 27: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ నగర పాలక సంస్థ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ప్రగతినగర్‌లో ఉదయం 11 గంటలకు 33 మంది కార్పొరేటర్‌ల ప్రమాణ స్వీకారం జరిగింది.
స్పెషల్ అధికారి, ఆర్‌డీఓ మల్లయ్య నేతృత్వంలో కార్పొరేషన్ కమిషనర్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. 1వ వార్డు కార్పొరేటర్ విజయలక్ష్మీ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక విప్‌ను జారీచేశారు. అనంతరం ఆర్‌డీఓ మల్లయ్య మేయర్ అభ్యర్థి పేరును ప్రకటించారు. 12వ వార్డు కార్పొరేటర్ అయిన కొలను నీలా గోపాల్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం కార్పొరేటర్ సభ్యులు చేతులెత్తి మద్దతును తెలిపారు. ఆ తరువాత డిప్యూటీ మేయర్‌గా దన్‌రాజ్ యాదవ్‌ను ప్రకటించగా సభ్యులంతా ఆమోదించారు.
బాచుపల్లికి దక్కకపోవడంపై సభ్యుల అసంతృప్తి
నిజాంపేట్ నగర పాలక సంస్థ మేయర్‌గా కొలను నీలా రెడ్డి, డిప్యూటీ మేయర్‌గా నిజాంపేట్‌కు చెందిన ధన్‌రాజ్ యాదవ్‌ను ఎన్నుకొని బాచుపల్లికి ఒక్క హోదా అయినా ఇవ్వకపోవడంతో సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీసం డిప్యూటీ మేయర్ అయినా బాచుపల్లికి కేటాయించకపోవడంపై కార్పొరేటర్‌లు ఆగం పాండు, ఆగం రాజు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
హాల్‌లో సొమ్మసిల్లిన కార్పొరేటర్ కొలను తేజ
ప్రగతినగర్‌లోని సమావేశ హాల్‌లో జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు కార్పొరేటర్‌ల ప్రమాణ స్వీకారం జరిగింది. వరుస క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించగా 33వ డివిజన్ కార్పొరేటర్ కొలను తేజ శ్రీనివాస్ రెడ్డిని అధికారులు ప్రమాణ స్వీకారం చేయించేందుకు వేదికపైకి పిలువగా తేజ శ్రీనివాస్ రెడ్డి వేదిక పైకి వస్తూ ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. అనంతరం వైద్య పరీక్షలను చేయించారు. తరువాత మళ్లీ వేదికపై ప్రమాణ స్వీకారం చేస్తూ కంటతడి పెట్టడం గమనార్హం.