రంగారెడ్డి

బోడుప్పల్ మేయర్‌గా బుచ్చిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 27: బోడుప్పల్ నగర పాలక సంస్థ నూతన పాలక మండలి సభ్యులు కొలువుదీరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో మొదటి అక్షర క్రమంలో తోటకూర అజయ్ కుమార్ (కాంగ్రెస్)తో ప్రారంభమై చివరగా భూక్యా సుమన్ నాయక్ (టీఆర్‌ఎస్) గెలిచిన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, మిగితా స్వతంత్రంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రత్యేక అధికారిణి సౌమ్య ప్రమాణం చేయించారు. అనంతరం మేయర్ పదవి కోసం ఇద్దరిలో 16వ డివిజన్ టీఆర్‌ఎస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన సామల బుచ్చిరెడ్డి, 17వ డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్ పోగుల నర్సింహా రెడ్డి పోటీ పడ్డారు. ఇందులో సామల బుచ్చిరెడ్డి పేరును 8వ డివిజన్ కార్పొరేటర్ సీస వెంకటేశ్ ప్రతిపాదించగా 11వ డివిజన్ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య బలపరిచారు.
పోగుల నర్సింహా రెడ్డికి 6వ డివిజన్ కార్పొరేటర్ తోటకూర అజయ్ ప్రతిపాదించగా 12వ డివిజన్ కార్పొరేటర్ బొమ్మక్ కల్యాణ్ బలపర్చారు. పోగులకు ఏగుగురు మద్దతు తెలుపగా సామల బుచ్చిరెడ్డికి ఎక్స్ అఫిషియో తరపున మంత్రి మల్లారెడ్డితో పాటు 18 మంది కార్పొరేటర్లు మద్దతు ప్రకటించడంతో సామల బుచ్చిరెడ్డి మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రత్యేకాధికారి సౌమ్య ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌గా చెంగిచర్లకు చెందిన 2వ డివిజన్ కార్పొరేటర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ పేరును ఒకటో డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య ప్రతిపాదించగా 3వ డివిజన్ కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ బలపరచగా డిప్యూటీ మేయర్‌గా కొత్త లక్ష్మి రవి గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సౌమ్య పేర్కొన్నారు. మేయర్ పీఠం కోసం రాసాల వెంకటేశ్ యాదవ్, కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి పోటీ పడినప్పటికీ మాజీ జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి అనుచరుడైన సామల బుచ్చిరెడ్డికే మేయర్ పదవి వరించడం గమనార్హం. రైటప్
వ్యవసాయ కుటుంబం నుంచి మేయర్ వరకు..
బోడుప్పల్ వాస్తవ్యులైన సామల మల్లారెడ్డి-సాయమ్మల కుమారుడైన సామల బుచ్చిరెడ్డి భూస్వామిగా సుపరిచుతులు. వ్యవసాయం చేస్తూనే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోయిన బుచ్చిరెడ్డి రాజకీయ అనుభవం తక్కువే. ప్రాథమిక విద్యాభ్యాసం. 1972లో జన్మించారు. భార్య లలిత, ముగ్గురు పిల్లలలో ఇద్దరు కుమార్తెలు ప్రియాంక, కీర్తి, కుమారుడు మనోహర్ రెడ్డి ఉన్నారు. మాజీ జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి చొరవతో 16వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.