రంగారెడ్డి

పీర్జాదిగూడ మేయర్‌గా జక్క వెంకట్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 27: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ నూతన పాలక మండలి సభ్యులు సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్ నుంచి భారీ మెజార్టీతో కార్పొరేటర్‌గా గెలుపొందిన జక్క వెంకట్ రెడ్డిని 14వ డివిజన్ కార్పొరేటర్ పాశం శశిరేఖ ప్రతిపాదించగా 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి బలపర్చారు. డిప్యూటీ మేయర్‌గా 17వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయఢంకా మోగించిన కుర్ర శివ కుమార్ గౌడ్ పేరును 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య ప్రతిపాదించగా 22వ డివిజన్ కార్పొరేటర్ భీంరెడ్డి నవీన్ రెడ్డి ప్రతిపాదించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌కు పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎన్.శ్రీనివాస రావు పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేడ్చల్ జిల్లాపరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్, ఉద్యోగులు నూతన పాలక మండలి సభ్యులను పూల మొక్కలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
బిల్డర్ నుంచి మేయర్ వరకు
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ తొలి మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. బిల్డర్‌గా పరిచయమై మేయర్‌గా తనదైన శైలిలో ప్రజల గుండెల్లో చెదరని ముద్ర సంపాదించుకున్నారు. యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం పరిధిలోని చాడ గ్రామానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు జక్క బుచ్చమ్మ-యాదిరెడ్డి ముద్దుల కుమారుడు వెంకట్ రెడ్డి. ఇతనికి ఇద్దరు సోదరులు జక్క దేవేందర్ రెడ్డి, జక్క రాంరెడ్డి, భార్య క్రాంతి, ఇద్దరు ఇద్దరు ఆడ పిల్లలు విశిష్ట, వినూత్న ఉన్నారు. 1976 డిసెంబర్ 5న జన్మించిన వెంకట్ రెడ్డిని మోత్కూరుకు చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ బద్దం సుజాత - యాదిరెడ్డి దత్తత తీసుకున్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జక్క పాలడుగులో ప్రాథమిక, ఎస్‌ఎస్‌సీ నవోదయ, ఏవీ కళాశాల హైదరాబాద్‌లో బీకాం చదువుకున్నారు. 2003లో ఏవీ కన్‌స్ట్రక్షన్‌లో అడుగుపెట్టి బిల్డర్‌గా అవతారమెత్తారు. ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పదవులు సమర్ధవంతంగా నిర్వహించి నిర్మాణ రంగంలో చెరుగని ముద్ర వేసుకున్నారు.2018లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కారెక్కారు.
నిరంతరం పని చేస్తా..
పీర్జాదిగూడ పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మున్సిపల్ నూతన చట్టంతో పారదర్శక పాలన అందిస్తానని నూతన మేయర్‌గా ఎన్నికైన జక్క వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు పార్టీ శ్రేణులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి బండి గార్డెన్ వరకు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభలో జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పీర్జాదిగూడ అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు.