రంగారెడ్డి

షికారు నుంచి రాని కౌన్సిలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 27: మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి కౌన్సిలర్‌ల రాక కోసం ఎదురుచూశారు. మేడ్చల్ మున్సిపల్‌లో 23 మంది కౌన్సిలర్‌లు ఉండగా 14 టీఆర్‌ఎస్, నాలుగురు కాంగ్రెస్, నలుగురు స్వతంత్రులు, ఒకరు బీజేపీ నుంచి గెలిచారు. టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ కౌన్సిలర్‌లు క్యాంపు నుంచి ప్రమాణస్వీకార కార్యక్రమానికి తరలిరాలేదు. తొలుత బీజేపీ కౌన్సిలర్ మాత్రమే రాగా తర్వాత స్వతంత్ర, కాంగ్రెస్ కౌన్సిలర్‌లు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు కార్యాలయానికి చేరుకోకపోవడంతో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల అధికారిగా జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఎంఏ సత్తార్ వ్యవహరించారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

మీర్‌పేట్ మేయర్‌గా దుర్గా దీప్‌లాల్ చౌహన్
* డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి ఎన్నిక
బాలాపూర్, డిసెంబర్ 27: మీర్‌పేట్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠాన్ని గిరిజన మహిళ ముడవత్ దుర్గా దీప్‌లాల్ చౌహన్ అధిరోహించారు. డిప్యూటీ మేయర్‌గా సరూర్‌నగర్ మాజీ ఎంపీపీ తీగల విక్రం రెడ్డి ఎన్నికయ్యారు. ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మీర్‌పేట్ నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కందుకూర్ ఆర్‌టీఓ రవీందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రకటించారు. 15వ వార్డు టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దుర్గా, 29వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఆర్.నీలా రవి నాయక్ మేయర్ బరిలో ఉన్నట్లు ప్రకటించారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముడవత్ దుర్గాను టీఆర్‌ఎస్ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ ప్రతిపాదించగా, మరో కార్పొరేటర్ గజ్జెల రాంచందర్ బలపరిచారు. దుర్గాకు టీఆర్‌ఎస్‌కు చెందిన 19 మందితో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిద మంది మద్దతు ఇస్తూ చేతులుపైకి ఎత్తారు. 46 మంది కార్పొరేటర్లు ఉన్న నగర పాలక సంస్థలో 27 ఓట్ల మెజారిటీతో దుర్గా మేయర్‌గా ఎన్నికయ్యారు.
నాటకీయ పరిణామాల మధ్య
నాటకీయ పరిణామాల మధ్య డిప్యూటీ మేయర్‌గా సరూర్‌నగర్ మాజీ ఎంపీపీ తీగల విక్రం రెడ్డి ఎన్నికైనారు. డిప్యూటి మేయర్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన తీగల విక్రం రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి అక్కి మాధవి, బీజేపీ నుంచి కిసర గోవర్దన్ పోటీకి దిగారు. మాధవికి అధికార పార్టీ టీఆర్‌ఎస్ బీఫాం ఇచ్చినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
ఎన్నికల అధికారి అర్కల భూపాల్ రెడ్డిని బలపర్చుతూ, చేతులుపైకి ఎత్తాలని సూచించగా భూపాల్ రెడ్డిని బలపర్చుతూ ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం మాధివని అడుగగా ఆమెను కూడా ఎవరూ బలపర్చలేదు. డిప్యూటీ మేయర్‌గా పోటి చేసిన బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి. విక్రం రెడ్డిని బలపర్చుతూ చేతులుపైకి ఎత్తాలని ఎన్నికల అధికారి కోరగా కార్పొరేటర్ ముద్ద పవన్ కుమర్ ప్రతిపాదించగా, మరో కార్పొరేటర్ సిద్ధాల బీరప్ప బలపరిచారు. తీగల విక్రం రెడ్డికి అనుకూలంగా 22 మంది కార్పొరేటర్లు చేతులు ఎత్తడంతో డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు.

బండ్లగూడ కార్పొరేషన్ మేయర్
బుర్ర మహేందర్ గౌడ్
* డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డిఎన్నిక
నార్సింగి, జనవరి 27: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మే యర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పూరె్తైంది. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు 14 మంది, కా ంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ప్రమాణ స్వీకారం చేయించారు. 22వ డివిజన్ కార్పొరేటర్ బుర్ర మహేందర్ గౌడ్ మేయర్‌గా, 15వ డివిజన్ కార్పొరేటర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జవహర్‌నగర్ మేయర్‌గా
కావ్య ఏకగ్రీవం
1*డిప్యూటీ మేయర్‌గా రెడ్డిశెట్టి శ్రీనివాస్
శామీర్‌పేట, జనవరి 27: జవహర్‌నగర్ మున్సిపాలిటీ మేయర్‌గా 15వ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మేకల కావ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. జవహర్‌నగర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన వార్డు సభ్యుల ప్రమాణోత్సవ కార్యక్రమానికి కీసర ఆర్డీఓ రవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం మేయర్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా మేకల కావ్యను ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అరుణ కుమారీ, తహశీల్దార్ నాగమణి పాల్గొన్నారు.

బడంగ్‌పేట్ మేయర్‌గా
చిగిరింత పారిజాత

* డిప్యూటీ మేయర్‌గా ఇబ్రాం శేఖర్
బాలాపూర్, జనవరి 27: బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్‌గా చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, డిప్యూటీ మేయర్‌గా ఇబ్రాం శేఖర్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లతో పాటు ఇద్దరు స్వతంత్రులు కార్పొరేషన్ కార్యాలయానికి ఉదయం 10:30 వరకు చేరుకున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్‌గా పారిజాతను టీఆర్‌ఎస్ సభ్యులు యాతం పవన్ కుమార్ యాదవ్ ప్రతిపాదించగా, పెద్దబావి శ్రీనువాస్ రెడ్డి బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా పోటి చేసిన స్వతంత్ర అభ్యర్థి ఇబ్రాం శేఖర్‌ను టీఆర్‌ఎస్ సభ్యులు భీమిడి స్వప్న జంగారెడ్డి ప్రతిపాదించగా, సూర్ణగంటి అర్జున్ బలపరిచారు. మేయర్, డిప్యూటీ మేయర్‌గా చిగిరింత పారిజాత, ఇబ్రాం శేఖర్ ఇద్దరు మాత్రమే పోటీలో ఉండటంతో, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
పార్టీ మారి మేయర్
బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన ఇద్దరు ఒకరు కాంగ్రెస్ నుంచి గెలుపొందగా, మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినవారే. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో మొత్తం 32 వార్డులకు టీఆర్‌ఎస్ 13, బీజేపీ 10, కాంగ్రెస్ ఏడు స్థానాలలో విజయం సాధించగా, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. మేయర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 17 కావాల్సి ఉండగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు కేవలం 13 స్థానాలకే పరిమితం అయింది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కాంగ్రెస్, బీజేపీలతో బేరా సారాలకు దిగింది. మేయర్ పదవి ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తానని 31వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన చిగిరింత పారిజాత డిమాండ్‌ను తేరపైకి తీసుకువచ్చారు. డిప్యూటీ మేయర్ ఇస్తే మద్దతు ఇస్తానని స్వతంత్ర అభ్యర్థిగా ఇబ్రాం శేఖర్ డిమాండ్ చేశారు.
ఎలాగైన మేయర్, డిప్యూటీ మేయర్లను టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యూహంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిగిరింత పారిజాతకు మేయర్, ఇబ్రాం శేఖర్‌కు డిప్యూటి మేయర్ పదవులను కట్టాబెట్టి టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకున్నారు.