రంగారెడ్డి

సహకారంలోనూ టీఆర్‌ఎస్‌దే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 16: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. మండలంలోని నాలుగు సహకార సంఘాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. రాచకొండ మైలారం (దండుమైలారం) సహకార సంఘం చైర్మన్‌గా టీఆర్‌ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు బిట్ల వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా కాంటెకార్ ఈశ్వర్‌లు ఎన్నికయ్యారు. ఎంపీ పటేల్‌గూడ సహకార సంఘం చైర్మన్‌గా మంచిరెడ్డి మహేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా రవీందర్ రెడ్డి (టీఆర్‌ఎస్) ఎన్నికయ్యారు. తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి (టీఆర్‌ఎస్), వైస్ చైర్మన్‌గా క్యామ శంకర్ (టీఆర్‌ఎస్) ఎన్నికయ్యారు. ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఇక్కడ మరోసారి బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ నిర్వహించి చైర్మన్ అభ్యర్థిని నిర్ణయించారు. చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభినందించారు.
పొల్కంపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదా
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పొల్కంపల్లి సహకార సంఘం చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సమావేశానికి సంబంధించి కోరం (సభ్యులెవరు హాజరుకాకపోవడంతో) లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను సోమవారానికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ 13 స్థానాలకు కాంగ్రెస్ 4, బీజేపీ 4, టీఆర్‌ఎస్ 3, సీపీఎం 2 స్థానాల్లో మద్దతుదారులు గెలిచారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లి సహకార సంఘం చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన గరిశె నరేందర్ ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం దూలపల్లిలోని సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. గరిశె నరేందర్ చైర్మన్‌గా, రవీందర్ రెడ్డి వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అనంతరం అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. గరిశె నరేందర్ మాట్లాడుతూ దూలపల్లి సహకార సంఘాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని అన్నారు. బౌరంపేట్ సింగిల్ విండో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఆదివారం బౌరంపేట్‌య సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్‌కు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. కానీ కోరం రాకపోవడంతో అధికారులు సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిపారు..
కొత్తపేట చైర్మన్‌గా జగదీశ్వర్
కేశంపేట,: కేశంపేట మండలం కోత్తపేట సహకార సంఘం చైర్మన్ ను అదివారం కొత్తపేట సహకార సంఘం కార్యాలయంలో కాకునూర్ గ్రామానికి చేందిన టీఅర్‌ఎస్ అభ్యర్థి జీ.జగదీశ్వర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, వైస్ చైర్మన్‌గా లేమామిడి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పామ్ అంజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబల్ నాయక్, కేశంపేట ఎంపీపీ వై.రవిందర్ యాదవ్, ఎన్నికల అదికారి అనిల్ కుమార్, తహశీల్దార్ మురళీ కృష్ణ, సర్పంచ్ నవీన్ కుమార్, టీఅర్ స్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, శ్రవన్ కుమార్, కోఆప్షన్ సభ్యుడు జమాల్ ఖాన్ పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లాలో టీఆర్‌ఎస్ కైవసం
కీసర: మేడ్చల్ జిల్లాలో పీఏసీఎస్ చైర్మన్‌లుగా టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. జిల్లాలో తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. తొమ్మిదికి తొమ్మది స్థానాల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కీసర పీఏసీఎస్ చైర్మన్‌గా రామిడి ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా పన్నాల బుచ్చిరెడ్డి, ఘట్‌కేసర్ పీఏసీఎస్ చైర్మన్‌గా సింగిరెడ్డి రామిరెడ్డి, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అల్వాల్ పీఏసీఎస్ చైర్మన్‌గా టీ.గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎం.బాల్‌రాజ్ ముదిరాజ్, దూలపల్లి పీఏసీఏస్ చైర్మన్‌గా జీ.నరేందర్, వైస్ చైర్మన్‌గా ఏ.రవీందర్ రెడ్డి, డబిల్‌పూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎస్.సురేశ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా జీ.వెంకటేశ్, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్‌గా సింగిరెడ్డి రణదీప్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా డీ.నరహరి, పూడూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్.సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎల్.శ్యామ్‌లాల్, శామీర్‌పేట్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఆర్.మధుకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎం.ఐలయ్య గెలుపొందారు. బౌరంపేట్‌లో సభ్యులు ఎవరూ హాజరు కాకపోవటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.