రంగారెడ్డి

కలుషితాహారంతో గురుకుల విద్యార్థుల అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, ఫిబ్రవరి 16: కలుషిత అహారం తిని మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మండల పరిధిలోని చిల్‌ముల్ మైలారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆదివారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించక పోతే చర్యలు తప్పవని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మహబూబ్ పాషాను హెచ్చరించారు. భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాఠశాలలోని బియ్యం, పప్పు, నూనె, చింతపండు వంటి నిత్యావసర వస్తువులను పరిశీలించారు. సరుకుల శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. రెండు రోజుల పాటు పాఠశాలలో ఉండి విద్యార్థులను పరిక్షించి తనకు రిపోర్ట్ పంపాలని డాక్టర్ రవీంద్ర యాదవ్‌ను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లడుతూ అనారోగ్యాల బారిన పడటానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం కారణమని, విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, బోజనానికి ముందు, వాష్‌రూమ్‌లను వాడిన తర్వాత పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలని, ప్రతినిత్యం స్నానం చేయాలని సూచించారు. కాగా పాఠశాలలో వంటచేసే వ్యక్తి పనిమీద వెళ్తు రాత్రికి వండాల్సిన అహారం మధ్యాహ్నం తర్వాత చేసిపెట్టి వెళ్లడంతోనే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మహబూబ్ పాషాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జేసీ మోతిలాల్, జిల్లా వైద్యాధికారి దశరథ్, కొడంగల్ తహశీల్దార్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
పాఠశాలను సందర్శించిన జడ్పీటీసీ
భోజనం వికటించి అస్వత్థతకు గురైన విద్యార్థులను బొంరాస్‌పేట జడ్పీటీసీ అరుణ, టీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు నెహ్రూ నాయక్ పరామర్శించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.