రంగారెడ్డి

గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 16: లంబాడాల ఆత్మగౌరవానికి ప్రతీకగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడిపల్లిలో సద్గురు సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్‌తో కలిసి సేవాలాల్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ లంబాడ గిరిజనుల్లో చైతన్యం నింపుతూ వారి ఆలోచనలు, జీవన శైలిలో వినూత్న మార్పులకు ఎంతో కృషి చేశారని తెలిపారు. సేవాలాల్ జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, తహశీల్దార్ ఎస్తర్ అనిత, ధన్‌రాజ్ నాయక్, సకృనాయక్ పాల్గొన్నారు.

ఇరువర్గాల మోహరింపు..నందిగామలో ఉద్రిక్తత
కొత్తూరు, ఫిబ్రవరి 16: సింగిల్ విండో చైర్మను ఎన్నిక సందర్భంగా ఇరువర్గాలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు అలుముకున్నాయి. ఆదివారం నందిగామ సహకార సంఘం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. షాద్‌నగర్ డివిజను పరిధిలో ఒకే ఒక్క నందిగామ సహకార సంఘం పరిధిలో మాత్రమే కాంగ్రెస్ చైర్మన్ పదవికి చేజిక్కించుకునేందుకు అవసరమైన డైరెక్టర్లు గెలిచారు. అయతే కాంగ్రెస్ డైరెక్టర్లను తమ వైపు లాగేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ మద్దతు దారులు పెద్ద ఎత్తున ఎన్నికల కేంద్రం వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఒక డైరెక్టరు టిఆర్‌ఎస్ శిబిరంలోకి జంప్ కావడంతో కాంగ్రెస్ నాయకులు అప్రమత్తమయ్యారు. పోలీసులు మాత్రం డైరెక్టర్లను మాత్రమే లోనకు పంపించి మీడియాను సైతం అనుమతించలేదు. కేంద్రం చుట్టు పక్కల ఉద్రిక్తత నెలకొన్నాయి.