రంగారెడ్డి

ఏకపక్షంగా ‘పంచాయతీ సమ్మేళనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 20: పారదర్శకంగా నిర్వహించాల్సిన ‘పంచాయతీ సమ్మేళనా’న్ని ఏకపక్షంగా.. నిర్వహిస్తూ అధికార పార్టీ ప్రతినిధులకే మాట్లాడటానికి అవకాశం కల్పిస్తున్నారని ఎంపీపీలు, జడ్పీటీసీలు పలువురు మండిపడ్డారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘పంచాయతీ సమ్మేళనం’ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డి, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు వై.అంజయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు హాజరయ్యారు. తలకొండపల్లి ఎంపీపీ నిర్మల మాట్లాడబోతున్న సమయంలో ఏర్పడిన గందరగోళం ఉద్రిక్తతకు దారి తీసింది. కేవలం అధికార పార్టీ ప్రతినిధులకే మాట్లాడానికి అవకాశం కల్పిస్తున్నారని తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్, యాచారం ఎంపీపీ సుకన్య, ఎంపీపీలు ప్రభాకర్ రెడ్డి, కమిలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి వేదికగా నిలువాల్సిన సమావేశం కాస్తా అధికార పార్టీ కార్యక్రమంగా మారిందని.. ఇదేమని ప్రశ్నిస్తే బయటకు పంపుతున్నారని, తాము బాయ్‌కాట్ చేస్తున్నామని పలువురు ఎంపిపిలు, జడ్పీటీసీ సభ్యులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం అంటూ వారు నినాదాలు చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ఇలా వ్యవహరించడం సమంజసంగా లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.