రంగారెడ్డి

పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 22: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో పురపాలికలు అభివృద్ధి బాట పట్టనున్నాయని ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని వీకె కనె్వన్షన్‌లో పట్టణ ప్రగతి ప్రణాళికపై నియోజకవర్గ స్థాయిలో ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల పాలకవర్గాలు, కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రభుత్వం పట్టణ ప్రగతి ప్రణాళిక నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. గతంలో పల్లె ప్రగతి ప్రణాళిక మాదిరిగానే పట్టణ ప్రగతిని కూడా విజయవంతం చేయాలని కోరారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకోని వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకే పట్టణ ప్రణాళిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజులకు ఒక్కో సమస్య చొప్పున వార్డుల పరిధిలో తెలుసుకోని వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని పాలకవర్గాలు, ప్రత్యేకాధికారులకు సూచించారు. వౌలిక సదుపాయాల కల్పన, హరితహారం, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు పట్టణ ప్రగతిలో చేర్చామని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అధికారులతో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సమన్వయంతో మెలిగి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇప్పటికే నిధులపై మంత్రులకు నివేధిక అందించామని, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు విడుదలైన నిధులు వెచ్చించి ప్రధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే విధిగా పాలకవర్గాలు పనిచేయాలని కోరారు. అనంతరం కౌన్సిలర్ల నుండి తమ వార్డుల పరిధిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆర్డీఓ అమరేందర్, చైర్ పర్సన్‌లు కప్పరి స్రవంతి, కొత్త హార్ధిక, చెవుల స్వప్న, కమిషనర్ ఇస్సాక్ అబ్‌ఖాన్, సరస్వతి, రవీందర్ రావు, ప్రత్యేకాధికారులు రాజేశ్వర్ రెడ్డి, సునంద, రాజేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్‌లు ఆకుల యాదగిరి, కోరె కళమ్మ పాల్గొన్నారు.