రంగారెడ్డి

అఖండ జ్యోతి యాత్రకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 22: శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి 26వ అఖండ జ్యోతి యాత్రకు భక్తులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన శకటంపై 12 అడుగుల ఎత్తుగల స్వామి వారి, అమ్మవార్ల విగ్రహాలతో దేదీప్యమానంగా వెలిగే అఖండ జ్యోతి యాత్రకు బస్తీలలో అడుగడుగునా మహిళలు నైవేద్యాలు, మంగళ హారతులతో హారతి పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని హైదరాబాద్ బర్కత్‌పురా చౌరస్తాలోని యాదగిరి భవన్ నుంచి డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాలు, వేద పండితుల మంత్రోశ్ఛరణల మధ్య ప్రారంభమైన జ్యోతియాత్ర శుక్రవారం రాత్రికి ఉప్పల్‌కు చేరుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మేకల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రాత్రి విడిది చేసి తిరిగి శనివారం ఉదయం యాదగిరి గుట్టకు బయలుదేరింది. మార్గమధ్యలో పీర్జాదిగూడ బస్‌డిపో, మేడిపల్లిలోని ప్రధాన రహదార్లలో అడుగడుగునా భక్తులు ప్రత్యేక పూజలతో ఘన స్వాగతం పలికారు. 24వ తేదీన యాదగిరిగుట్టకు చేరుకుని రాత్రి స్వామి వారి బ్రహ్మోత్సవాల అంకురార్పన సమయానికి పాదయాత్ర బృంద నిర్వాహకులు అఖండ జ్యోతిని దేవస్థానం అధికారులకు సమర్పరణతో ముగుస్తుంది. ధార్మికవేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు స్వాగత ఏర్పాట్లతో సత్కారాలు, వేడుకోలు, వీడ్కోలు కార్యక్రమాలతో ఆకర్షణీయంగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు.