రంగారెడ్డి

కన్నుల పండువగా అన్నాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 22: మహాశివరాత్రి మరునాడైన శనివావారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామికి వేద పండితులు అన్నాభిషేకం, విమాన రధోత్సవ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీస్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కల్యాణ మంటపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకార హోమం, ప్రదోశకాలపూజ, హారతి, మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు గ్రామీణ ప్రాంత ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి కీసరగుట్టకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను భక్తి తన్మయత్వంలోకి తీసుకెళ్లాయి. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అంగడిలో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసారు.
మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. నాలుగు రోజులుగా వంశీరాజ్ సంఘం విద్యార్ధులకు, భక్తులకు, పోలీస్ సిబ్బందికి అన్నదానం చేసారు. భక్తులతో కీసరగుట్ట పరిసర ప్రాంతాలు కిటకిట లాడాయి. జిల్లా యంత్రాగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.