రంగారెడ్డి

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 23: విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని విద్యార్థి దశ నుంచే తాము ఎంచుకున్న లక్ష్యాల కోసం ఆసక్తిని చూపాలని బచ్‌పన్ స్కూల్ డైరెక్టర్ కే.శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మన్సూరాబాద్ డివిజన్ రాగాల ఎన్‌క్లేవ్‌లోని బచ్‌పన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులకు మెడల్స్, సర్ట్ఫికెట్లను అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల అకడామిక్స్ డైరెక్టర్ కే.రూపారెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీవాణి, ఇన్‌చార్జి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు మమతా రెడ్డి, లత పాల్గొన్నారు.

శివపార్వతుల కల్యాణం
కేశంపేట, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని కాకునూర్ గ్రామశివారులో వెలసిన స్వయంభు శ్రీమహలింగేశ్వర స్వామి బ్రమ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పార్వతి పరమేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగ జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులకు తాళ్ల భాగ్యలక్ష్మి శ్రీ్ధర్ గౌడ్ అన్నదానం చేశారు.