రంగారెడ్డి

గీత కార్మికుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, ఫిబ్రవరి 23: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆబ్కారీ, క్రీడ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాడ్గుల మండల కేంద్రంలో ఆదివారం గీత కార్మికులకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషషనర్ సురేష్‌తో కలిసి మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలకు చెందిన గీతకార్మికులకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ చెట్టును నమ్ముకొని జీవించే కార్మికులకు గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి లైసెన్స్‌లు ఇవ్వలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత గుర్తింపుకార్డులతో పాటు లైసెన్స్‌లను మంజూరు చేశామని చెప్పారు. ఎమ్మెల్యే జైపాల్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తాగునీరు, సాగునీరు అందించారని, త్వరలో మాడ్గుల మండల కేంద్రంలో గీత కార్మికులకు నీరా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో డీసీ ఖురేషి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురాం, మాడ్గుల జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పద్మ, వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, కడ్తాల్, ఆమనగల్లు జడ్పీటీసీలు దశరథ్ నాయక్, అనురాధ పత్య నాయక్, పీఏసీఎస్ తిర్మల రెడ్డి పాల్గొన్నారు.