రంగారెడ్డి

ఇదే మనం కోరుకున్న సంక్షేమ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 25: సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ పాలనలో మన చిరాకల స్వప్నం సంక్షేమ తెలంగాణ కల సాకారమయ్యిందని, ఇది మనం కోరుకున్న సంక్షేమ తెలంగాణ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆదిభట్లలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.47 వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తోందని గుర్తు చేశారు. వార్డుల వారీగా యువకులు, మహిళలు, విద్యావంతులు, సీనియర్ సిటిజన్స్‌ను కలుపుకొని 60 మందితో కమిటీలు వేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.130 కోట్ల నిధులు వస్తాయని వెల్లడించారు. తమ బడ్జెట్‌లో 10 శాతం నిధులను హరితహారానికి కేటాయించాలని స్పష్టం చేశారు. ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని కోరారు. వార్డుల వారీగా స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వాహణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రధానంగా తడి-పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు స్థానికులను చైతన్యపరిచే బాధ్యత అందరిపై ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆదిభట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కొత్త హార్దిక, వైస్ చైర్మన్ కోరె కళమ్మ, కమిషనర్ సరస్వతి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, పల్లె గోపాల్ గౌడ్, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్వీ రమణా రెడ్డి పాల్గొన్నారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రెండో రోజైన మంగళవారం ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం కొనసాగింది. నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుందిగల్, కొంపల్లి మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా వార్డులు, డివిజన్‌లలో పర్యటించారు. నిజాంపేట్ గ్రామంలోని 8వ డివిజన్, 9వ డివిజన్, 10వ డివిజన్‌లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ గోపి, కార్పొరేటర్‌లు పాల్గొని స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. నిజాంపేట్ 33వ వార్డులోని రాజీవ్ గృహ కల్పలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ కొలను తేజ శ్రీనివాస్ రెడ్డి పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రగతినగర్ 2వ వార్డులో కార్పొరేటర్ చిట్ల దివాకర్ పర్యటించి కాలనీలలోని సమస్యలను తెలుసుకున్నారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని దూలపల్లి 15, 16 వార్డులలో మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం, కమిషనర్ జ్యోతి, కౌన్సిలర్‌లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు.
తాండూరు: పట్టణ ప్రగతి ప్రణాళిక రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పౌసుమి బసు మంగళవారం తాండూరు పట్టణంలోని పలు మున్సిపల్ వార్డులలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ధేశాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులను అందరూ కలిసి కట్టుగా విజయవంతం చేయాలని అన్నారు. పట్టణంలోని పాత తాండూరులో 13, 14, 15, 16 వార్డులలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.
మేడ్చల్: పట్టణ ప్రగతి కార్యక్రమం మున్సిపాలిటీల్లో రెండవ రోజు మంగళవారం జోరుగా కొనసాగింది. మేడ్చల్, గుండ్లపోచంపల్లి పరిధిలో చైర్‌పర్సన్‌లు, వైస్‌చైర్మన్‌లు, కౌన్సిలర్‌లు తమ తమ వార్డుల్లో పాదయాత్రలు నిర్వహించి సమస్యలను గుర్తించారు. మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను గుర్తించారు. గుండ్లపోచంపల్లి చైర్‌పర్సన్ మద్ధుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి పలు వార్డుల్లో కౌన్సిలర్‌లతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించారు. 9వ వార్డు కౌన్సిలర్ ఎస్. హాంసరాణి, 11వ వార్డు కౌన్సిలర్ అమరం జైపాల్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ తమతమ వార్డుల్లో కమిటీలతో పర్యటించి సమస్యలను గుర్తించారు.
మేడ్చల్ మున్సిపల్ పరిధిలో చైర్‌పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి 13వ, 14వ వార్డుల్లో కౌన్సిలర్‌లు మర్రి శ్రీనివాస్ రెడ్డి(టిల్లు) ఏ.శ్రీనివాస్ రెడ్డితో పాటు పర్యటించి వివిధ సమస్యలను గుర్తించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. 3వ వార్డులో జకట దేవరాజ్ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన పార్కు స్థలాలను గుర్తించి జేసీబీ సహాయంతో శుభ్రం చేయించారు. మున్సిపాలిటీల కమిషనర్‌లు సత్యనారాయణ రెడ్డి, అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
శామీర్‌పేట: ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జవహర్‌నగర్ 16వ డివిజన్ కార్పొరేటర్ టీట్ల విశ్రాంతమ్మ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అరుంధతినగర్, మల్కారం,, సీఆర్‌పీఎఫ్ క్యాంపు ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లను శుభ్రం చేశారు. కాలనీలోని అంతర్గత రోడ్లు, రోడ్లకు ఇరుకుగా ఉన్న స్తంభాల తొలగింపు, కాలనీలోని రోడ్లపై ఉన్న గుంతల పూడిక పనులను చేపట్టారు. స్థానిక నాయకులు డీ.రామానుజన్, వీ.సత్యానందం, ఆంటోనీ, రాజేష్, అబీద్‌ఖాన్, సిద్దు గౌడ్, రాజేశ్వరీ, భాగ్య, ప్రమీల, వీ.జ్యోతి, ఏ.ప్రశాంతి, యువ నాయకులు అమీర్‌ఖాన్, ప్రవీన్, జగదీష్, యూసుఫ్, అక్బర్, వంశీ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల్లో రూ. కోటి 53 లక్షలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు శ్రీకారం చుట్టారు. దేవరయాంజాల్, హకీంపేట, సింగాయిపల్లి గ్రామాల్లో మల్లారెడ్డి కాలనీలోని పార్కు, ఓపెన్ జిమ్, అంగన్‌వాడీ కేంద్రం పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఈ నెల 24 నుండి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, మున్సిపల్ చైర్మన్ కే.రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ పీ.వాణీ, డిప్యూటీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ గోవర్దన్ పాల్గొన్నారు.
బాలాపూర్: బడంగ్‌పేట్ నగర పాలక సంస్థను చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందామని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10, 13వ డివిజన్లలో కమిషనర్ సత్యబాబు, డీఈ అశోక్ రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ బొర్ర జగన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు రోహిణి రమేష్, బాలు నాయక్‌తో కలిసి కుర్మల్‌గూడ, బాలాజీ నగర్, తదితర ప్రాంతాలలో మేయర్ పారిజాత పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.
ఖాళీ ప్రదేశాలలో పేరుకుపొయిన చెత్తను తొలగించి, మొక్కలు నాటాలని మాజీ ఎంపీపీ, మీర్‌పేట్ 21వ డివిజన్ కార్పొరేటర్ సిద్దాల లావణ్య బీరప్ప సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా లావణ్య బీరప్ప 21వ డివిజన్‌లో స్పెషల్ ఆఫీసర్, శానిటేషన్ సిబ్బందితో కలిసి ఇంటింటికీ పర్యటించి, స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే వాటిని పరిష్కారించాలని సిబ్బందికి సూచించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బడంగ్‌పేట్ నగర పాలక సంస్థ 5వ డివిజన్ కార్పొరేటర్ వినాయక హిల్స్, తిరుమల నగర్ తదితర కాలనీలలో పర్యాటించి, స్థానికంగా నెలకొన్న చెత్తను తొలగింప చేశారు. శానిటేషన్ సిబ్బందితో కలిసి కొంత దూరం రోడ్లను శుభ్రపరిచారు. దీపికా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పది రోజుల పట్టణ ప్రగతి ప్రణాళికలో డివిజన్ అదర్శంగా తీర్చుదిద్దుకుందామని తెలిపారు.
కొడంగల్: పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. పట్ణణపగ్రతి పనుల్లోభాగంగా మంగళవారం కొడంగల్‌లోని బుల్కాపూర్, ఐనాన్‌పల్లిగ్రామాల్లో పర్యాటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, కమిషనర్ కిరణ్ కుమార్, కౌన్సిలర్ మధు యాదవ్ పాల్గొన్నారు,