రంగారెడ్డి

కంది రైతుల కష్టాలు తీరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 25: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం వ్యాపారులు, దళారీల వైపు మొగ్గు చూపిస్తుండటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే బిల్లులు ఇస్తామని చెప్పిన అధికారులు అదే బిల్లుల కోసం కార్యాలయం చుట్టు తిరుగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు కందులకు రూ.5800 ధర ప్రభుత్వం కేటాయించడంతో రైతులు ఎక్కువగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వస్తున్నారు. అదే అసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు, దళారీలు రైతుల వద్ద తక్కువ ధరకు కందులను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన రైతులు దళారీలను, వ్యాపారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ కందుల కొనుగోలు కేంద్రానికి ఏడు మండలాలను కేటాయించారు. రైతుల నుంచి మూడువేల క్వింటాళ్ల కందులను కొనుగోళ్లు చేసి నిలిపివేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కందుల కొనుగోలు కేంద్రానికి రైతులు నేరుగా తీసుకొని వస్తుంటే అధికారులు మాత్రం వ్యాపారులు, దళారీల వైపు ఎందుకు చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కందులు తీసుకున్న వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికి డబ్బుల కోసం కొనుకోలు కేంద్రం చుట్టు తిరుగాల్సి వస్తుందని రైతులు వాపోయారు.
మూడువేల క్వింటాళ్ల కందులు కొనుగోలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడువేల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసి కేంద్రాన్ని మూసివేసినట్లు షాద్‌నగర్ డీసీఎంఎస్ ఇన్‌చార్జి అధికారి నర్సింహా రెడ్డి వివరించారు. ఉన్నతాధికారుల అదేశాల ప్రకారం సోమవారం తిరిగి కందుల కొనుగోలు కేంద్రాన్ని తెరిచినట్లు తెలిపారు. క్వింటాల్ కందులకు రూ.5800పెరగడంతోనే రైతులు ఎక్కువగా విక్రయ కేంద్రానికి వస్తున్నారని వివరించారు. కొనుగోలు చేసిన వారంలోనే డబ్బులు వేస్తున్నామని, ఆన్‌లైన్ సమస్య కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.