రంగారెడ్డి

చెరువులను సుందరీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 26: పట్టణ ప్రగతిలో చెరువులను సందరీకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి మల్లారెడ్డి నాగారం మున్సిపాలిటీలోని తొమ్మిదవ వార్డులో పర్యటించారు. కాలనీలోని సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కౌన్సిలర్‌లు వారి వార్డుల్లోని సమస్యలు తెలుసుకొని, తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. ఇలాగే కొనసాగితే చెరువుకనుమరుగు కావటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేసారు. చెరువులో కలుస్తున్న డ్రైనేజీ మురికిని కాల్వ ఏర్పాటు చేసి, పక్కకు మళ్లించాలని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వాణి, చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, సభ్యులు అన్నంరాజు లావణ్య శ్రీనివాస్ జగన్ మోహన్ రెడ్డి, బిజ్జ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అన్నరాయిని పరి రక్షణసభ్యులు పాల్గొన్నారు.
బండ మల్లన్న జాతర ఏర్పాట్లు పూర్తి
కొత్తూరు, ఫిబ్రవరి 26: బండ మల్లన్న జాతర ఉత్సవాలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 27వ తేది నుండి మార్చి-2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీ బండ మల్లన్న జాతర ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పా ట్లు చేశారు. 28 శుక్రవారం భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. 29న శ్రీ బండ మల్లన్న స్వామి ఊరేగింపు, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు మేడ్చల్‌కు మంత్రి మల్లారెడ్డి రాక
మేడ్చల్, ఫిబ్రవరి 26: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి నేడు మేడ్చల్‌కు విచ్చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి బుధవారం తెలియజేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని వివరించారు. ఉదయం తొమ్మిది గంటలకు మార్కెట్‌కు శంకుస్థాపన, రైల్వేకాలనీ వెళ్లే దారిలో పార్కు స్థలానికి శంకుస్థాపన, గంటలకు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ మైదానంలో ముళ్లపొదలు తొలగించుటట ,ఉదయం 10 గంటలకు కేఎల్‌ఆర్ ప్రశాంత్ లేఅవుట్ పక్కన కిష్టాపూర్ రోడ్డులో 7 ఎకరాల్లో పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన, 10 - 30 గంటలకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో సమావేశంలో మంత్రి పాల్గొంటారని చైర్‌పర్సన్ దీపికా రెడ్డి తెలిపారు.