రంగారెడ్డి

స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజలందరూ ఈనెల 22 ఆదివారం జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు.
శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో జనతా కర్ఫ్యూ, కోవిడ్-19 నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉదయం 7 నుంచి రాత్రి 9గంటల వరకు స్వీయ నియంత్రణతో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితులలో బయటకు రావద్దని అన్నారు. 14 గంటలూ సురక్షితంగా ఇంటికే పరిమితమైతే ప్రమాదకరమైన కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అత్యవసరమైన వైద్య సహాయానికి తప్ప మరే ఇతర అవసరాలకు ఇళ్లు వదిలి బయటకు రావద్దని తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలు జనతా కర్ఫ్యూను పాటించాలని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు తిరిగే అవకాశం లేనందున ప్రయాణాలకు దూరంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు విద్యాసాగర్, శ్యాంసన్, డీఆర్‌ఓ మధుకర్ రెడ్డి, ఆర్డీఓలు మల్లయ్య, రవి, జడ్పీ సీఈఓ దేవ సహాయం పాల్గొన్నారు.