రంగారెడ్డి

జనతా కర్ఫ్యూ.. చప్పట్ల ధ్వనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 22: ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను శాశ్వతంగా తరిమికొట్టేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ పీర్జాదిగూడ పట్టణంలో విజయవంతమైంది. ఉప్పల్ బస్‌డిపో, చెంగిచర్ల బస్‌డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు వెల్లకుండా ఇంట్లోనే బందీ అయ్యారు. కరోనా వైరస్ ధరి చేరకుండా స్వీయ నిశబ్ధంతో జనతా కర్ఫ్యూ చప్పట్ల ధ్వనులతో తరిమికొట్టారు. మేడిపల్లిలోని ఇన్‌ఫ్రో ఫ్రైడ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అపార్ట్‌మెంట్ వాసులు సైరన్ మోగడంతో చప్పట్లతో సంఘీబావం తెలిపారు.
పల్లె నుంచి పట్నం వరకు
షాద్‌నగర్: పల్లె నుంచి పట్నం వరకు జన మన కర్ఫ్యూకు జనం జైకొట్టింది. జనతా కర్ఫ్యూకు సంఘీభావం పలకడంతో ప్రభుత్వం కరోనాపై తలపెట్టిన యుద్ధానికి ప్రజలు సంఘటితంగా మద్దతు పలికారు. కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ ప్రధాని నరేంద్రమోది ఇచ్చిన పిలుపుతో చేపట్టిన జనం కోసం జనతా కర్ఫ్యూ సక్సెస్ అయింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎవరూ బయటకు రాకపోవడం, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడం, రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయిన నేపథ్యంలో జనతా కర్ఫ్యు సక్సెస్ అయింది. నిత్యం వేల మందితో రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం జనం లేకపోవడంతో వెలవెలబోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుకు ప్రజానీకం సంపూర్ణ మద్దతు ప్రకటించి ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు రాకపోవడంతో జనతా కర్ఫ్యూ సక్సెస్ అయింది. 44వ జాతీయ రహదారి బైపాస్, హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారి నిత్యం వేల సంఖ్య వాహనాలతో రద్దీగా ఉండేది. కరోనా రక్కసి నేపథ్యంలో జనతా కర్ఫ్యూ విధించడంతో ఒక్క వాహనం కూడా రోడేక్కని పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ రహదారిపై రాయికల్ జీఎంఆర్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు లేకపోవడంతో వెలవెలబోయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కావడంతో బస్టాండ్ ఆవరణ ప్రయాణికులు లేకపోవడం నిర్మానుష్యంగా మారిపోయింది. పరిగి రోడ్డు, మెయిన్‌రోడ్డు, జడ్చర్ల రోడ్డు, కేశంపేట రోడ్డు, గాంధీ చౌక్, పటేల్ రోడ్డు, కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో నిత్యం జనం ఎక్కువగా రాకపోకలు కొనసాగిస్తుంటారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి ఎవరు బయటకు రాకపోవడంతో నిర్మాణుష్యంగా మారిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైన రోడ్లపైకి వస్తే వారి నుంచి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఎక్కడి వెళ్లాలి.. ఎందుకు అనే విషయాలను పూర్తిగా సేకరించిన తరువాత వారికి అనుమతి ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలే తప్ప మిగతా వారు ఎవరూ బయటకు రావద్దని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ముఖ్యకూడలిలో మైక్ ద్వారా ప్రచారం చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరికలు జారీ చేశారు. వ్యాపారు సముదాయాలతోపాటు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు సైతం స్వచ్చందంగా బంద్ పాటించారు. ఇప్పటికే పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, విద్యాసంస్థలను బంద్ చేశారు. కోవిడ్-19 మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు పేర్కొంటున్నారు.
షాద్‌నగర్ డివిజన్‌లోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రాలతోపాటు వివిధ గ్రామాల్లో సైతం జనతా కర్ఫ్యూ విజయవంతంగా నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండల కేంద్రంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. జనతా కర్ఫ్యూలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సక్సెస్ చేశారు.
కొందుర్గు: కరోనా వైరస్‌ను నియంత్రించడంతో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఆదివారం కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రాలతోపాటు వివిధ గ్రామాల్లో జనతా కర్ఫ్యూ సక్సెస్ అయింది. కొందుర్గు మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, కిరాణా దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. వాహనాల రాకపోకలు లేకపోవడంతో మండల కేంద్రంలోని పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. వివిధ గ్రామాల నుంచి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలు, రైతులు ఆదివారం జనతా కర్ఫ్యూతో ఎవరూ రాకపోవడంతో నిర్మానుష్యంగా మారిపోయింది.
జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. మండల పరిధిలోని లాల్‌పహాడ్ వద్ద ఉన్న కొన్ని పరిశ్రమల్లో మాత్రం కార్మికులతో పనులు చేయిస్తున్నట్లు సమాచారం. పరిశ్రమ గేటుకు తాళం వేసి లోపల కార్మికులతో యజమాన్యం పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం కొంతమంది నేతలు మండల తహశీల్దార్, పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. మరోవైపు పరిశ్రమ యజమాన్యాలు కార్మికులతో పనులు చేయించడం ఏమిటని నేతలు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్-19వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
మీ సేవలకు మా జోహార్లు..
షాద్‌నగర్: మీ సేవలకు మా జోహార్లు అంటూ చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఐదు గంటల సమయంలో బయటకు వచ్చి చప్పట్లతో వైద్యులను అభినందనలతో ముంచెత్తారు. ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు కరతాళ ధ్వనులతో కరోనా రక్కసిని అదుపు చేస్తున్న వైద్యులకు అభినందనలు తెలపాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు షాద్‌నగర్ చప్పట్లతో మారుమోగిపోయింది. ఎన్నడు లేనివిధంగా ప్రజలంత కులమతాలకు అతీతంగా సమయం ఐదు కాగానే బయటకు వచ్చి చప్పట్లతో హుషారెత్తించారు. ఉదయం నుండి ఇంట్లోనే ఉంటూ జనతా కర్ఫ్యూను మన కర్ఫ్యూగా భావించి విజయవంతం చేసిన ప్రజానీకం ఒక్కసారిగా బయటకు వచ్చి ఐదు గంటలకు చప్పట్లతో నినధించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ స్వగ్రామం కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్ పేటలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వైద్యులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కోసం వైద్యులకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ కుటుంబ సామేతంగా సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి కుటుంబ సామేతంగా ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వైద్యులకు, పోలీసులకు సంఘీభావం తెలిపారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఏసీపీ సురేందర్, ఐపీఎస్ అధికారిణి రీతిరాజ్, ఎస్‌ఐలు విజయభాస్కర్, దేవ్‌రాజ్‌తోపాటు సిబ్బంది స్టేషన్ నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వైద్యులకు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ 5వ వార్డులో కౌన్సిలర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.
కొత్తూరు: జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి వైద్యులకు, పోలీసులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం కొత్తూరు మండల కేంద్రంలో సీఐ చంద్రబాబుతోపాటు సిబ్బంది స్టేషన్ బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు.
కొందుర్గు: జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఇళ్లల్లో నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి చప్పట్లతో వైద్యులకు, పోలీసులకు సంఘీభావం తెలిపారు. కొందుర్గు వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, మండల అధ్యక్షుడు శ్రీ్ధర్ రెడ్డి, జిల్లేడు చౌదరిగూడ జడ్పీటీసీ బంగారు స్వరూప రాములు, ఎంపీపీ యాదమ్మతోపాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ఒక్కసారిగా బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు.

షేక్ హ్యాండ్‌లు వద్దు..
నమస్కారాలు ముద్దు
వనస్థలిపురం: షేక్ హ్యాండ్‌లకు స్వస్తి చెప్పి నమస్కారాలు చేసుకుంటే కోవిడ్-19 వైరస్‌ను సాధ్యమైనంత వరకు నివారించ వచ్చని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జనతా కర్ఫ్యూ పర్యవేక్షణలో భాగంగా కమిషరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలను సందర్శించినట్లు చెప్పారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాచకొండ కమిషరేట్ పరిధిలో ప్రజలు జనతా కర్ఫూలో స్వచ్చందంగా పాల్గొని అన్ని విధాల ప్రభుత్వాలకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. కరోనా నివారణ కోసం ఆరోగ్య, రెవిన్యూ, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖలు చేస్తున్న కృషి అభినందనీయమని గుర్తు చేశారు. కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి వివరాలను పోలీస్ వాట్సప్ నెంబర్ 9490617111కి, 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. అబ్దుల్లాపూర్ మెట్, చర్లపల్లి ప్రాంతాలలో కోటి రూపాయల విలువ చేసే నకిలీ శానిటైజర్ల బాటిళ్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశామని చెప్పారు.
వనస్థలిపురంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. వ్యాపార సముదాయాలు ఎక్కడికి అక్కడ మూత పడ్డాయి. ప్రజలు స్వచ్చందంగా బందుకు మద్దతు తెలుపుతూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వాల పిలుపు మేరకు సాయంత్రం ఐదు గంటలకు ఇంటి తలుపులు, కిటికీలు తెరచి ఇంటి ముందు, బాల్కానీల పైనుంచి చప్పట్లు, గంటలు వీలలు వేస్తూ కరోనా నివారణకు పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, మీడియా, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మద్దతు తెలిపారు.
సికిందరాబాద్: కరోన కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన జనతా కర్ప్యూలో బాగంగా సికిందరాబాద్‌లోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలంతా స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమైపోయారు. సాయంత్రం 5గంటలకు ఎవరి ఇళ్ల వద్ద వారే ఉండి చప్పట్లు కొట్టి వైద్యులకు సంఘీభావం తెలిపారు. పోలీసులు పోలీస్ స్టేషన్‌ల వద్ద పలు కూడళ్లలో చప్పట్లతో సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలోని రోడ్లన్ని మైదానాలను తలపించాయి. రెండు మూడు రోజుల క్రితం వివిద రాష్ట్రాల నుంచి బయలు దేరిన రైళ్ళు కొన్ని ఈ రోజు సికిందరాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాయి. వాటిలో వచ్చిన ప్రయాణికులు తమతమ గమ్యస్థానాలకు చేరుకోడానికి ప్రయాణ సౌకర్యాలు ఏమి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అటువంటి వారిని గుర్తించి మహంకాళి ట్రాఫిక్, గోపాల పురం లాఅండ్‌ఆర్డర్ పోలీసులు పోలీస్ జీపులలోనే తీసుకు వెళ్లి వదిలి వేయడం చేసి ప్రజల మన్ననలను పొందారు.

ఇదే స్ఫూర్తిని 31 వరకు కొనసాగిదాం
బాలాపూర్: కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలను ప్రతి ఒక్కరూ తమ పూర్తి సహయ సకరాలు అందించాలని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి ప్రజలు కోరారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్యులకు సంఘీభావంగా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి మంత్రి సబితా రెడ్డి చప్పట్లు కొట్టారు.
కేపీహెచ్‌బీకాలనీ: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, సీ ఎం కేసీ ఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు అభినందనలు తెలిపారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆమనగల్లు: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాధి నియంత్రణలో భాగంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు ఆమనగల్లు మున్సిపాలిటీతో పాటు గ్రామాలు, గిరిజన తండాలలో సైతం జనం స్వచ్చంధంగా జనతా కర్ఫ్యూను పాటిస్తూ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు ఇంట్లోనే ఉంటు కనివిని ఎరుగని రీతిలో ఎవరూ ఊహించని విధంగా స్వీయ నియంత్రనకు శ్రీకారం చుట్టారు. జనతా కర్ఫ్యూ కొనసాగుతుందని తెలియడంతో ఆమనగల్లు పట్టణంలోని బస్ డిపోతో పాటు ప్రధాన వీదులు, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెల్లె జాతీయ రహదారి మొత్తం జనం లేకపోవడంతో వెలవెలపోయింది.
ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఆమనగల్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ధర్మేష్ తన సిబ్బందితో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించారు.