రంగారెడ్డి

నిర్మానుష్యంగా రోడ్లు, మార్కెట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 22: దేశ ప్రధాని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుమేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం 6 గంటల నుంచి నియోజకవర్గం ప్రజలు బయటికి రాకుండా ఇంటికే పరిమితం అయ్యారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన కూడళ్లలో పోలీసులు ఎవరిని బయటికి రాకుండా చర్యలు తీసుకున్నారు. బయటికి వచ్చిన ఒకరిద్దరిని ప్రశ్నించి, కరోనా వైరస్ పట్ల అవగాహనను కల్పించారు. నియోజకవర్గంలోని ఐడీపీఎల్ నుండి గాగిల్లాపూర్, దుందిగల్ రోడ్లు, బాచుపల్లి నుంచి మేడ్చల్‌కు వెళ్లే రహదారి, సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్‌కు వెళ్లే రోడ్డు, నిజాంపేట్ నుంచి మల్లంపేట్‌కు వెళ్లే రహదారి, జగద్గిరిగుట్ట నుంచి ఐడీపీఎల్, షాపూర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. షాపూర్‌నగర్, చింతల్, సూరారం, జగద్గిరిగుట్ట, నిజాంపేట్, గాగిల్లాపూర్, దుందిగల్, బౌరంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లోని మార్కెట్‌లు, దుకాణ సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఎప్పటికీ కిటకిటలాడే ప్రధాన కూడళ్లు సైతం వెలవెలబోయాయి. పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో సీఐ మహేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ చైతన్యం చేశారు.
చప్పట్లతో సంఘీభావం
తెలిపిన ప్రజలు
ప్రభుత్వం నిర్వహించిన జనతా కర్ఫ్యూలో ప్రజలంతా సంపూర్ణంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి బయటికి రాకుండా సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి ప్రజలు బయటికి వచ్చి చప్పట్లు, గినె్నలను కొట్టి సంఘీభావం తెలిపారు.