రంగారెడ్డి

వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ దివ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 24: వికారాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డి.దివ్య శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆసుపత్రి సేవలను మెరుగుపర్చడంలో భాగంగా గతంలో మాదిరిగా ఆసుపత్రి పరిసరాలు, సిబ్బంది విధులపై పరిశీలించారు. ఆసుపత్రిలో జనరిక్ మందులు అమ్మేందుకు మెడికల్ షాపు, క్యాంటీన్, జనరల్ స్టోర్‌ల ఏర్పాటుకు మూడు దుకాణాలు నిర్మించాలని, వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఇఇ మనోహర్‌రావుకు ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశ్రీ వార్డు మెరుగుకు కొత్త మంచాలను వేయాలని సూచించారు. చిన్నచిన్న మరమ్మతులు చేపట్టాలని, స్క్రాప్ అమ్మితే కనీసం ఆసుపత్రి కలరింగ్‌కైనా డబ్బులు వస్తాయని పేర్కొన్నారు. సీమాంక్ సెంటర్‌లో అనస్తీషియన్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రసవ నిరీక్షణ భవనం నిర్మాణం పూర్తికి నిధులు కేటాయిస్తామని, సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రైవేటు వైద్యుల సహకారం తీసుకోవాలని సూచించారు. జనరేటర్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకున్న ఆమె అంబులెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డ్రిస్టిక్ట్ అధికారి భాగ్యశేఖర్‌గౌడ్‌ను ఆదేశించారు. తనిఖీలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దశరథ్‌కు పలు సూచనలు ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి అన్ని విభాగాలు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.