రంగారెడ్డి

రియాక్టర్ పేలి కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, డిసెంబర్ 28: రియాక్టర్ పేలి కార్మికుడు మృతి చెందిన సంఘటన శంషాబాద్ ఆర్‌జిఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో సన్‌జిమ్ లిమిటెడ్ కంపెనీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తలారి శంకర్(45) మంగళవారం రాత్రి కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనితో పాటు శ్రీనివాస్ అనే మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కంపెనీలోని భవనం కుప్పకూలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేష్ తెలిపారు.కంపెనీ యాజమన్యం నిర్లక్ష్యంతోనే గత 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కార్మికుడు మృతి చెందాడని సిపిఐ, ఏఐటియుసి నాయకులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, పాల్మాకుల జంగయ్య డిమాండ్ చేశారు.
డ్రైవర్ కం ఓనర్ పథకంలో 408మందికి లబ్ధి

సురక్షిత జిల్లాగా వికారాబాద్

ఎస్పీ నవీన్‌కుమార్
మోమిన్‌పేట, డిసెంబర్ 28: వచ్చే ఏడాది వికారాబాద్‌ను, సేఫ్టీ (సురక్షిత) జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం మోనిన్‌పేట పోలీసు సర్కిల్ కార్యాలయంను ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రికార్డులన్నీ పరిశీలించగా అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని, నేరాల సంఖ్య 40 శాతం తగ్గిందన్నారు. గతేడాది తొమ్మిది ఉండగా ఈసారి ఆరు మాత్రమే నేరాలు జరిగాయని, ప్రాపర్టీ రికవరీలో 76.46 శాతం సాధించడం ఆదర్శనీయమన్నారు. ప్రతి గ్రామాన్ని ఒక కానిస్టేబుల్ దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని రెండు రోజులకు ఒకసారి సందర్శించి ఏమైనా సమస్యలుంటే సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూతగాదాలను, రెవెన్యూ అధికారుల సహాయంతో, ఇతర ఏ సమస్యలున్న సంబంధిత శాఖలతో చర్చించి సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లోని సమస్యలను సాధ్యమైనంత వరకు గ్రామాల్లోనే పరిష్కరించడం వల్ల పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదుదారులు వచ్చే అవకాశం ఉండదన్నారు. సర్కిల్ పరిధిలోని 2, 3 గ్రామాలకు ఒక్క జవానును దత్తత తీసుకొనేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎస్పీ టి.స్వామి, సిఐ ఎవి రంగా, ఎస్‌ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
స్వైపింగ్ మిషన్లు, డెబిట్‌కార్డుల కొరత

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 28: పెద్దనోట్లను రద్దు చేసి 50రోజులు దాటిన నగదు కష్టాలు మాత్రం తప్పడం లేదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రెండువేలు, ఐదు వందలు, 100, 50,20 రూపాయల నోట్లు భారీ స్థాయిలోనే విడుదల చేసినప్పటికీ కిందిస్థాయి ప్రజల వద్దకు చేరకపోవడంతో అనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని బ్యాంకుల్లో నగదుకోసం జనం నిండిపోతున్నారు. కొత్తనోట్లు అందుబాటులోకి రాకపోవడం..వచ్చిన రెండు నోటుకు చిల్లర లభించకపోవడం వంటి కారణాల వల్ల వ్యాపారాలు 40నుండి 50శాతం వరకు పడిపోయినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి రెండు వేల రూపాయల నోటుఇస్తే తమ వద్ద అందుకు సరిపడా చిల్లర డబ్బులు లేవని తేల్చి చెబుతుండటంతో ఏమి చేయాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. డిమాండ్‌కు తగ్గ స్వైపింగ్ మిషన్లు బ్యాంకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం..చిల్లర డబ్బులు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల రైతులు, వ్యాపారస్తులు, కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50రోజుల్లో నగదు కష్టాలు తీరుస్తామని ప్రధానమంత్రి ప్రకటన చేసినప్పటికీ ఎక్కడా కూడా ఆచరణలో అమలు కావడం లేదని, కష్టాలు అలాగే ఉన్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. నేటివరకు ఏ బ్యాంక్ వద్దకు వెళ్లి చూసినా నగదు కోసం క్యూలైన్‌లోనే నిలిచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోతున్నారు. వ్యవసాయ దారులైతే పంటపొలాల్లో పనులు చేయించుకున్న కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు వద్ద కేవలం రెండువేల రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుండటంతో చిల్లరకోసం నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. స్వైపింగ్ మిషన్లు, చెక్కుల ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చునని ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ముందుకు సాగడం లేదు. చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో స్వైపింగ్ మిషన్లు లేకపోవడంతో తమ వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. ఒక్కసారిగా కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో ఉన్న కొద్దిపాటి వ్యాపారం కాస్తా పడిపోయిందని వ్యాపారస్తులు అంటున్నారు. నోట్లను రద్దు చేసి 50రోజులు గడుస్తున్నా నేటివరకు బ్యాంకుల్లో మాత్రం అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని వ్యాపారస్తులు, రైతులు పేర్కొంటున్నారు. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ఖాతాదారులకు చెక్కులు పాస్ చేయడంతోపాటు వ్యాపారస్తులందరికీ స్వైపింగ్ మిషన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను డిమాండ్ ప్రకారం పంపిణీ చేసి ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.

నుమాయిష్‌కు ముమ్మర ఏర్పాట్లు

* తుది దశలో స్టాళ్ల పనులు
* బందోబస్తుకు పోలీసుల కసరత్తు
* 1 నుంచి ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28: ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తి, శ్రద్ధ ఉన్నా, కుటుంబ పరిస్థితులు సహకరించని పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్న ఈ ప్రదర్శనకు ఈ సారి 2700 వరకు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. స్టాళ్ల ఏర్పాటు పనులు ఇప్పటికే సుమారు 70శాతం వరకు పూర్తయినట్లు వ్యాపారులు తెలిపారు. వీటిల్లో చేతి రుమాలును తయారు చేసే చిన్న స్థాయి పరిశ్రమ మొదలుకుని కార్పొరేట్, బహుళ జాతి, అంతర్జాతీయ కంపెనీల స్టాళ్లు తమ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేనున్నాయి. దశాబ్దాల క్రితం వంద స్టాళ్లతో ఏర్పాటైన ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనతో నగరవాసులకు ఏటా 46 రోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. స్టాళ్లు, ఉత్పత్తులు తదితర వివరాలను ఎగ్జిబిషన్ సొసైటీ గురువారం అధికారికంగా ప్రకటించనుంది. రెండు ఎంట్రెన్స్‌ల ద్వారా ప్రతిరోజు వేలాది మంది తిలకించే ఈ ప్రదర్శనకు పోలీసులు సిసి కెమెరాల ద్వారా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. రాత్రి పది గంటల వరకు ప్రదర్శన ప్రజలకు అందుబాటులో ఉంటున్నందున, నగరం, శివార్లలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శన తిలకించేందుకు వచ్చిన సందర్శకుల సౌకర్యార్దం ఆర్టీసి సైతం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ప్రతిరోజు తిలకించేందుకు వచ్చే వేలాది మంది సందర్శకుల కోసం ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర భవనాలు, ఖాళీ స్థలాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ప్రదర్శన కొనసాగే 46రోజుల పాటు చిన్నారులను ఆకట్టుకునేందుకు ట్రాయ్ ట్రెన్, జాయింట్‌వీల్స్‌తో పాటు ఈ సారి ఎలక్ట్రానిక్ పరికరాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి తోడు రౌండ్ ది క్లాక్ కార్ రేసింగ్ వంటి విన్యాసాలు అందుబాటులో ఉండనున్నాయి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రం అవిర్భవించక ముందు నుంచే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. అంతేగాక, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రదర్శన తిలకించేందుకు వచ్చే వారికి తెలంగాణ వంటకాలను సైతం రుచి చూపేందుకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అహార్నిశలు పనులు కొనసాగుతున్నాయి. మరోవైపేమో ఎట్టి పరిస్థితుల్లోనైనా తమ స్టాళ్లు జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించుకునేందుకు వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రదర్శన ప్రారంభమైనా, ఆ తర్వాత నాలుగైదు రోజుల పాటు స్టాళ్ల ఏర్పాటు పనులు కొనసాగుతూనే ఉండేవి. ఫలితంగా స్టాళ్లు తీసుకున్న వ్యాపారులకు వ్యాపారం గిట్టుబాటు అయ్యేది కాదని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 1వ తేదీ కల్లా అన్ని స్టాళ్లను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు వ్యాపారులు వెల్లడించారు.
నోట్ల రద్దు ప్రభావం ఉంటుందా?
ప్రతి ఏటా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే నుమాయిష్‌పై ఈసారి పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉంటుందా? అన్న మీమాంసలో వ్యాపారులున్నాయి. పెట్టుబడులు మాత్రం గత ఏడాదితో పోల్చితే స్వల్పంగా తగ్గినా, రద్దు నోట్ల ప్రభావం ఉండకూడదనుకుంటే ప్రతి స్టాల్‌లో స్వైపింగ్ మిషన్ ఉంటే బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు.

గ్రామాల అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

రాజేంద్రనగర్, డిసెంబర్ 28: దేశంలోని గ్రామాలు అన్ని రంగాల్లో సస్యశ్యామలంగా అభివృద్ధి చెందాలంటే గ్రామీణ పట్టా పొందిన విద్యార్థుల చేతుల్లోనే ఉందని కేంద్ర పంచాయతీరాజ్ సెక్రటరీ జితేంద్ర శంకర్ మాథూర్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్డీ)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రూరల్ డెవ్‌లెప్‌మెంట్ కోర్సుల్లో డిప్లమా పూర్తిచేసిన 11వ బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ కాన్వోకేషన్‌లో జెఎస్ మాథూర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి నిపుణుల అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు గ్రామాల పురోగాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రంగాన్ని ఎంచుకున్న విద్యార్థులు రెండు సంవత్సరాలు కష్టపడితే ప్రజల భవిష్యత్తుతో పాటు విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఏ రంగంలోనైనా కష్టపడినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. గ్రామీణ డిప్లమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. ఎన్‌ఐఆర్డీ డిప్యూటీ జనరల్ డాక్టర్ డబ్ల్యూ ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యం కోసం పనిచేసినప్పుడే వారి జన్మసార్థకం అవుతుందని అన్నారు. పట్టాపొందిన విద్యార్థులు గ్రామాల అవసరాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన సూచించారు. సాంకేతిక కోర్సును ఎంచుకున్న వారు సైతం గ్రామీణ కోర్సు వైపు మొగ్గు చూపడం అభినందనీయమని విద్యార్థులను కొనియాడారు. క్షేత్ర స్థాయిలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం ఉపయోగించి ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లినప్పుడే సఫలీకృతం అవుతారని విద్యార్థులకు హితబోధ చేశారు. గ్రామీణ డిప్లమా, డిగ్రీ పొందిన విద్యార్థులు ప్రజల జీవనశైలిలో మార్పు తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఉద్యోగంలోనైనా బాధ్యతగా కష్టపడి పని చేసినప్పుడే ఆ సంస్థతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. డిప్లమా కోర్సుల్లో నేర్చుకున్న ప్రతి అంశాన్ని, నైపుణ్యతను గ్రామాల అభివృద్ధి కోసం ప్రదర్శించి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అంతకుముందు పిజి డిప్లమా కోర్సులలో గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థులు క్రాంతికుమార్, సంజాజోష్, సిల్వర్‌మెడల్ సాధించిన పుష్పల్ అగర్వాల్‌లకు జెఎస్ మాథూర్ చేతుల మీదుగా వాటిని అందజేశారు.
కోర్సు పూర్తి చేసిన 11వ బ్యాచ్‌కు చెందిన 36మంది విద్యార్థులకు సర్ట్ఫికెట్లు, పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులతో గ్రామాల అభివృద్ధికి పాటుపడుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు డాక్టర్ సిఎస్ సింగ్, చంద్రపండిత్, డాక్టర్ ఎస్.జిలానీ, డాక్టర్ పి.దుర్గాప్రసాద్, డాక్టర్ విక్రమ్‌సింగ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో అదుర్స్
కాచిగూడ, డిసెంబర్ 28: చరిత్ర నుంచే చరిత్ర పుడుతుంది. నిన్నటిని స్ఫూర్తిగా తీసుకుంటేనే భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త ఒరవడికి పట్టం గట్టే ఫ్యాషన్ రంగానికి కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుందని నిఫ్ట్ షో నిరూపించింది. మారుతున్న ఫ్యాషన్‌ల పట్ల ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూనే ట్రెడిషన్‌లో కాంటెంపరరీ ఫ్యాషన్‌లను ఏ విధంగా చూపాలో తెలుపుతూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (నిఫ్ట్) విద్యార్థులు ఓ ఫ్యాషన్‌ను నిర్వహించారు. బుధవారం నారాయణగూడ తాజ్‌మహాల్ హోటల్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. విద్యార్థులు సంప్రదాయ, పాశ్చాత్య వస్తధ్రారణలతో హోయలొలుకుతూ చేసిన ఫ్యాషన్ షో హోరెత్తించింది. సినిమా పాటలకు గ్రూప్ డ్యాన్స్‌లు, అదరగొట్టే ‘మూవీ-మస్తీ’ వంటి కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. కార్యక్రమంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌కు చెందిన బర్కత్‌పుర, దిల్‌సుఖ్‌నగర్, ఇసిఐఎల్, బ్రాంచిల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ఎక్కాల చైతన్య నిఫ్ట్ విద్యార్థులకు సర్ట్ఫికెట్స్‌ను ప్రదానం చేశారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నిఫ్ట్ డైరెక్టర్లు కె.గీత, ఎల్.విశాలాక్షి, కరాటే వరల్డ్ రికార్డు హోల్డర్ డా.జిఎస్.గోపాల్‌రెడ్డి, దేవిరెడ్డి విజితారెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి

సకింద్రాబాద్, డిసెంబర్ 28: ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో తెలుగుదేశంపార్టీ ముందుంటుందని నగర టిడిపి కన్వీనర్ ఎంఎన్.శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం నగర టిడిపి కార్యాలయంలో నగర కో కన్వీనర్ మేకల సారంగపాణితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గతఎన్నికలకు ముందు, తర్వాత టిడిపికి చెందిన ముఖ్యనేతలుగా చెలామణి అయిన వారు మాజీమంత్రుల మొదలు మాజీ కార్పొరేటర్‌ల వరకు తెరాస ఆకర్ష్‌కు గురై పార్టీ నుంచి వెళ్లిపోయారని అన్నారు. అయినప్పటికి క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు ప్రజల మద్దతుతో నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పటిష్టమైన నాయకత్వంతో సభ్యత్వ నమోదును గతంలోకన్నా అధికంగా చేయగలుగుతున్నామని తెలిపారు. సాక్షాత్తూ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తెదేపా సభ్యత్వం రికార్డు స్థాయిలో చేయగలిగామని ఇందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే కారణమని అన్నారు. ప్రజలు తెరాస పాలనతో విసిగిపోయారని మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీని అధికార పార్టీతో పాటు ఏ ఇతర శక్తులు బలహీన పర్చాలని చూసినా వారి ఆశలు ఫలించవని మరోసారి ఈ సభ్యత్వ నమోదుతో తేటతెల్లమైందన్నారు. గత ఎన్నికల ముందు రెండు లక్షల రెండు పడకల గదుల ఇళ్లను నిర్మిస్తామని చెప్పి కేవలం రెండు నియోజకవర్గాల్లో అందులో సనత్‌నగర్ నియోజకవర్గంలో పాత ఇళ్లను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించారన్నారు. అదే విధంగా సిఎం ప్రాతినిధ్య వహిస్తున్న ఎర్రవల్లిలో కేవలం 395 ఇళ్లను నిర్మించారన్నారు. రెండు లక్షల ఇళ్లకు 395 మాత్రమే నిర్మించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కుంటి సాకులు చెబుతున్నారన్నారు. అదేవిధంగా బంజారాహిల్స్‌లో బంజారాభవన్ పరిస్థితి అదే విధంగా ఉందని, ఇప్పటి ఆయావర్గాలకు ప్రకటించిన భవన్‌లు ఎక్కడా పునాదులు కూడా వేయలేదని ఇలా కేవలం మాటలకే సిఎం పరిమితమయ్యారని ఆరోపించారు. నగరంలో రైల్వేస్థలాలను, ఓయు భూములను తీసుకుని పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. కాని ఆయన క్యాంపు కార్యాలయం ముందు ఆయన నివాసాన్ని నిర్మించుకున్నారన్నారు.
ఇక ఆయన కుమారుడు, కుమార్తెలు కూడా ఏమాత్రం తీసిపోకుండా గత జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు పేదలకు వరాలు కురిపించి తాజాగా వారిని అధికారులకు పురమాయించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. జీఓ నెంబర్ 59 కింద వంద సంవత్సరాల క్రితం నిర్మించుకుని అన్ని టాక్స్‌లు కడుతున్న వారికి సైతం డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీచేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. పేదలను వేధిస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి ఎదురుగా జనవరి 5న మహా నిరసన దీక్షను నిర్వహించనున్నామని ఎంఎన్.శ్రీనివాస్, మేకల సారంగపాణిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లెల కిశోర్, యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక ట్రిబ్యునల్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28: మహానగరంలో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సర్కారు ప్రవేశపెట్టిన ప్రత్యేక ట్రిబ్యునల్‌కు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలపై ఎప్పటికపుడు కోర్టులు, ప్రభుత్వం న్యాయస్థానాలు వేసినా, వాటిని అడ్డుకోలేకపోయారు. ఇందుకు చట్టంలోని లొసుగులు, కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యం వంటి కారణాలను గుర్తించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి మున్సిపల్ యాక్టు 1959లోని మూడు సెక్షన్లకు సవరణలు చేస్తూ, ట్రిబ్యునల్‌ను ఏ ఏర్పాటు చేయనుంది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే అక్రమ నిర్మాణాలు అదుపుకావటంతో పాటు టౌన్‌ప్లానింగ్‌లో పెరిగిపోతున్న అవినీతికి కూడా కొంత వరకు బ్రేక్ పడే అవకాశముందని సర్కారు భావిస్తోంది. ఇక మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ హైకోర్టును ఆశ్రయించనుంది. దీంతో ట్రిబ్యునల్‌లోని బెంచ్‌లకు అవసరమైన న్యాయశాఖ సిబ్బందిని, న్యాయమూర్తులను కోర్టు నియమించనున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ప్రస్తుతమున్న మున్సిపల్ చట్టంలోని 452, 461,636 సెక్షన్లకు సవరణలు చేసిన తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. తొలి దశగా ఎనిమిది బెంచ్‌లుగా ఏర్పాటు కానున్న ఈ ట్రిబ్యునల్‌లో ఒక్కో బెంచ్‌కు న్యాయశాఖకు చెందిన ఒకరు, అలాకే టెక్నికల్ పర్సన్ ఒకరిని నియమించనున్నారు.