రంగారెడ్డి

శరవేగంగా మిషన్ భగీరథ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.1027 కోట్లతో
కొనసాగుతున్న పనులు
ఇంటింటికీ
నీటి సరఫరాకు కసరత్తు

వికారాబాద్, ఏప్రిల్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వికారాబాద్ జిల్లాలో శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.1027 కోట్లతో పనులను చేపడుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లోని 828 గ్రామాల్లో పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని తొమ్మిది లక్షల జనాభాకు నీరందించేందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎల్లూర్ వద్ద పంపింగ్ చేస్తారు. అక్కడి నుండి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని కమ్‌దన్ గ్రామానికి నీరొచ్చేలా చూస్తారు.
ఆతర్వాత వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలోని రాఘవపూర్ వద్ద టీ ఏర్పాటు చేసి రెండు మార్గాల ద్వారా జిల్లా వ్యాప్తంగా భగీరథ నీరు పంపిణీ చేయడానికి ఇంజనీర్లు చర్యలు తీసుకుంటున్నారు. రాఘవపూర్ వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి అందులో 135 ఎంఎల్‌డి సామర్థ్యం గల ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు. పరిగి నుండి మోమిన్‌కుర్దు, యాలాల్, బషీరాబాద్ వరకు పైపులైన్ వేసి గ్రావిటీ ద్వారా మంచినీటిని పంపిస్తారు. మరో మార్గంలో పరిగి నుండి రాకంచర్లకు నీటిని పంపింగ్ చేస్తారు. ఇక్కడ వెయ్యి కిలో లీటర్ల సామర్థ్యం గల ఒహెచ్‌బిఆర్ ట్యాంకును నిర్మిస్తున్నారు. పూడూర్ మండలం మనె్నగూడ నుండి శివారెడ్డిపేట ఫిల్టర్‌బెడ్‌కు నీటిని పంపింగ్ చేసి అక్కడ నుండి వికారాబాద్ మున్సిపల్‌కు అవసరమైన పెద్ద మొత్తం నీటిని అందిస్తారు. మార్గాల గుండా నీరు సాఫీగా వెళ్లేందుకు పైపులైన్లు వేస్తున్నారు. వికారాబాద్ మండలం బుర్గుపల్లి నుండి ధారూర్ మండలం కెరెల్లి గుండా తొర్మామిడి ద్వారా నీటిని సరఫరాచేస్తారు. శివారెడ్డిపేట ఫిల్టర్‌బెడ్ వద్ద నిర్మిస్తున్న ట్యాంకు నుండి పాతూర్ మీదుగా పెద్దెముల్ వరకు నీళ్లు వెళ్లేలా పైపులైన్ వేస్తున్నారు. పరిగిలో రాఘవపూర్ వద్ద నుండి కట్లాపూర్ గ్రామం మీదుగా కులకచర్ల, దోమ వరకు నీరు గ్రావిటీ ద్వారా వెళ్లేలా పనులు చేపడుతున్నారు. జిల్లాలో మిషన్ భగీరథలో భాగంగా 43 ట్యాంకులు, 11 సంపుల నిర్మాణం చేపడుతున్నారు. సంపుల ద్వారా చివరి వరకు ఉన్న గ్రామాలకు సైతం మంచినీరు అందేలా ప్రణాళికను సిద్దం చేశారు. సంపుల ద్వారా 14 వేలకిలో లీటర్ల నీటిని సరఫరా చేయనున్నారు. 8461 హెక్టార్ల అటవీ భూములలో పనులు చేపట్టేందుకు చెన్నైలోని అటవీ శాఖ ముఖ్య కార్యాలయం నుండి అనుమతులు సైతం పొందారు. ఆర్‌అండ్‌బి రోడ్లలో 134 చోట్ల మిషన్ భగీరథ పైపులైన్లు వెళుతున్నాయని, వీటిలో 12 నిర్మాణాలు పూర్తికాగా, ఆరు పనులు కొనసాగుతుండగా, 18 పూర్తయ్యాయి. 20 రైల్వేలైన్ల వద్ద పనులు చేపట్టాల్సి ఉండటంతో రైల్వే శాఖ అనుమతి తీసుకున్నారు. వీటిలో రెండు చోట్ల ఇప్పటికే పనులు పూర్తవగా, 12 చోట్ల పనులు జరుగుతున్నాయి. నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం వికారాబాద్ మండలంలో 33 కెవి సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేస్తున్నారు. జిన్‌గుర్తి, నవాల్గ, రేడ్లగడ్డలో 11 కెవి సబ్‌స్టేషన్లను నిర్మించనున్నారు. ఐదు చోట్ల ఎల్‌టి లైన్లను పూర్తి చేశారు. జిల్లా మొత్తం మీద 2195 కిలోమీటర్ల మేర పైపులైను వేసేందుకు తవ్వాల్సి ఉండగా వెయ్యికిలోమీటర్లు తవ్వారు. 450 కిలోమీటర్ల మేర హెచ్‌డిపి, డిఐ పైపులను వేశారు. ప్రభుత్వ భూమితో పాటు 45 ఎకరాల ప్రైవేటు భూమిని సైతం సేకరించారు.
డిసెంబర్ నాటికి జిల్లా ప్రజలకు నీరు
ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ ఆంజనేయులు వెల్లడి
మిషన్ భగీరథ ద్వారా జిల్లా ప్రజలకు ఈ ఏడాది డిసెంబర్ నాటికి నీటిని అందిస్తామని గ్రామీణ నీటి సరఫరా జిల్లా అధికారి ఆంజనేయులు వెల్లడించారు. వచ్చే ఏడాది మే వరకు అగ్రిమెంట్ ఉన్నా, సెప్టెంబర్ కల్లా ఆరు నెలల ముందే పనులు పూర్తవుతాయని భరోసా ఇచ్చారు.

ఆటోను ఢీకొన్న లారీ
ఏడుగురికి తీవ్ర గాయాలు
108లో తరలింపు
కొందుర్గు, ఏప్రిల్ 23: కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుండి లారీ ఢీకొనడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం కొందుర్గు మండల కేంద్రం సమీపంలో పరిగి - షాద్‌నగర్ రహదారిపై సంఘటన చోటు చేసుకుంది. కొందుర్గు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం లాల్‌పహాడ్ గ్రామం వద్ద ఉన్న ఓ పరిశ్రమలో పనులు ముగించుకొని ఇంటికి ఆటోలో కొందుర్గుకు వస్తుండగా వెనక నుండి లారీ వచ్చి ఢీకొనడంతో ఆటోడ్రైవర్ శేఖర్ (33), బాల్‌రాజ్ (45), ఈరమ్మ (35), పద్మమ్మ (42), మెడిపల్లి అనంతమ్మ (38), అనంతమ్మ (41), గీరయ్య (43) గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108వాహనంలో షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
నార్సింగ్, ఏప్రిల్ 23: సెల్‌ఫోన్ చార్జింగ్‌కు పెట్టగా విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. రాజస్థాన్‌కు చెందిన అఫ్జల్ (18) బతుకుదెరువుకోసం ఇటీవల రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి వచ్చాడు. గన్నారం గ్రామానికి చెందిన రఫీఖ్ అనే వ్యక్తివద్ద జెబిసి క్లీనర్‌గా చేరాడు. జెసిబి క్లీనర్‌గా పనిచేస్తున్న అఫ్జల్ తన సెల్‌ఫోన్‌లో చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ పెట్టగా, విద్యుత్ షాక్ సంభవించింది. దీంతో అఫ్జల్ అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు నార్సింగ్ పోలీసులు తెలిపారు.
బెల్ట్‌షాపులపై దాడులు
షాబాద్, ఏప్రిల్ 23: రోజురోజుకూ గ్రామాల్లో పెరిగిపోతున్న బెల్టుషాపులపై షాబాద్ ఎస్‌ఐ వరప్రసాద్ దాడులు చేస్తున్నారు. ఆదివారం షాబాద్ మండలం కేశవగూడ గ్రామంలో పర్యటించి కిరాణా షాపులపైలో తనిఖీ చేశారు. యాదయ్య షాపులలో ఐదు బీర్లు, 10 క్వాటర్లు, మూడు ఐబి క్వాటర్లు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. షాబాద్ మండలంలోని 29గ్రామ పంచాయతీలు 54 అనుబంధ గ్రామాల్లో పర్యటించి బెల్టుషాపులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా కిరణాషాపుల్లో మద్యం విక్రహిస్తే పోలీస్‌స్టేషన్‌లో సమచారం ఇవ్వాలని సూచించారు.
వడదెబ్బకు
ఒకరి మృతి
కేశంపేట, ఏప్రిల్ 23: వడదెబ్బకు గురై ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం కేశంపేట మండలం లేమామిడి గ్రామానికి చెందిన నర్సింలు (55) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు వివరించారు. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో పొలం వద్ద పశువులకు నీళ్లు తాగించి తిరిగి ఇంటింటి వచ్చి సృహ తప్పిపడిపోయాడని గ్రామస్థులు వివరించారు. వెంటనే చికిత్స నిమిత్తం తలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమన్‌గల్‌కు తీసుకువెళ్తుండగా మృతిచెందినట్లు వివరించారు.

నూరేళ్ల ఉత్సవానికి ముస్తాబైన
ఉద్యమ కళా నిలయం
ఉస్మానియా
విద్యుత్ కాంతులతో వైభవం
నాచారం, ఏప్రిల్ 23: నూరేళ్ల ఉత్సవానికి ముస్తాబు అవుతున్న ఓయు నూతన కాంతులతో స్వాగతం పలుకుతోంది. శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకుంది. శతాబ్ది ఉత్సవాలకు ప్రతీకగా నిలుస్తున్న ఆర్ట్స్ కాలేజీని విద్యుత్ దీపాలతో అలంకరించి, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 26 నుండి శతాబ్ది ఉత్సవాలు మొదలవుతాయి.
ఓయులోని అంతర్గత రోడ్లను మెరుగుపరిచి, ఇరువైపుల రంగులను వేశారు. ఎ-గ్రౌండ్‌కు వెళ్లే దారులలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాల అలంకరణ చూపరులను ఆకట్టకుంటుంది. ఉత్సవాలకు పదివేల మంది విద్యార్థులు, వెయ్యి మంది ప్రముఖులు, రెండు వేల మంది పూర్వ విద్యార్థులు, ఓయు అనుబంధ కాలేజీల నుంచి 1500 మంది, ఫ్యాకల్టీ వెయ్యి మంది, నాన్ టీచింగ్ 800మంది, వికలాంగులు 128 మంది వస్తారనే అంచనాలతో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.