రంగారెడ్డి

స్వచ్ఛ్భారత్.. ప్రతి భారతీయుడి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 17: స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రతి భారతీయుని లక్ష్యం కావాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛ్భారత్ మిషన్ కార్యక్రమంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములను గుర్తించి లిఖితపూర్వకంగా రికార్డు చేసి పరిరక్షించాలని, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులకు భూములను కేటాయించటంలో అధికారులదే తుది నిర్ణయమని చెప్పారు. మల విసర్జన కోసం నేటికీ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోకుండా బయటకు వెళ్లటం విచారకరమన్నారు. స్మృతివనం పేరుతో పార్కులు, వైకుంఠదామం పేరుతో శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమం గడువు ముగుస్తున్నందున హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు.. మొక్కలను నాటేందుకు గుంతలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. భూగర్భ జలాలను మరింత పెంపొందించేందుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామస్థులు తమ ఇళ్ల వద్ద, రైతులు పొలాల వద్ద ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. మండల పరిధి అంకుషాపూర్ గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే పలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు అందజేస్తుందన్నారు. ఆదర్శ గ్రామాలుగా ఎంపిక అయిన సర్పంచ్‌లు ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందేలా కృషి చేయాలని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను సేకరించి విడతల వారీగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఘట్‌కేసర్‌లో త్వరలో డిగ్రీ కళాశాల నిర్మిస్తామని, రైతుల సమగ్ర సర్వే, గొర్రెల పెంపకందారుల ఎంపిక సజావుగా జరుగుందని చెప్పారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలో మార్కెట్‌యార్డు ఏర్పాటుతో పాటు గ్రామాలలో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రహస్యంగా బాల్య వివాహం
* ఇంటి నుంచి పరారైన కుటుంబ సభ్యులు
* బాలిక ఇంటి వద్ద పోలీసుల పహరా
కొత్తూరు రూరల్, మే 17: బాలిక వివాహం రహస్యంగా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం కొత్తూరు మండలం శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శేరిగూడబద్రాయపల్లి గ్రామానికి చెందిన మంగళి యాదయ్య కుమార్తె మహేశ్వరం మండలం కొళ్ల పడకల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 14 సంవత్సరాలు వయస్సు గల బాలికకు వారం రోజుల క్రితం ఒక యువకుడితో వివాహాన్ని నిశ్చయించారు. ఇందులో భాగంగానే బుధవారం కొత్తూరు మండలం శేరిగూడబద్రాయపల్లి గ్రామంలోని అమ్మాయి ఇంటి వద్ద వివాహం చేసేందుకు నిర్ణయించారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఐసిడిఎస్ అధికారులు రంగంలోకి దిగే లోపే పెళ్లికుమార్తె బంధువులు విషయాన్ని పసిగట్టి తెల్లవారుఝామునే గ్రామం నుండి పరారయ్యారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక ఇంటి వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉన్నట్లు తెలిసింది. దీంతో ఉదయం నుండి రాత్రి వరకు కొత్తూరు పోలీసులు బాలిక ఇంటి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు స్థానిక ఐసిడిఎస్ అధికారులు ముందుగానే తెలిసినా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
విచారణ చేస్తున్నాం: ఎస్సై
శేరిగూడ భద్రాయపల్లిలో బాల్య వివాహం జరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని, దీంతో సిబ్బందిని గ్రామానికి పంపించగా అక్కడ తాళం వేసి ఉండడంతో మండలంలోని సమీప దేవాలయాలలో విచారణ చేస్తున్నామని కొత్తూరు ఎస్సై శ్రీశైలం యాదవ్ తెలిపారు.

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరి దుర్మరణం
* ముగ్గురికి తీవ్రగాయాలు
మేడ్చల్, మే 17: ప్రయాణికుల ఆటోను ఓవర్‌టేక్ చేయబోయిన లారీ ఆటోను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్న సంఘటన ఒకరు దుర్మరణం చెందగా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపరాజు వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయ్యపల్లి గ్రామంలో పెళ్లికి హాజరై ఆటోలో తిరిగి బుధవారం తమ సొంత గ్రామమైన చీకటిమామిడికి కృష్ణ తన తండ్రితో కలిసి ప్రయాణికుల ఆటో (ఎపి24డబ్ల్యూ 9856)లో బయల్దేరారు. దారిలో పూడూరు గ్రామ ఎక్స్ రోడ్డు పెట్రోల్‌బంకు సమీపంలో వెనుక నుండి అతి వేగంగా వస్తున్న లారీ (టిఎస్8యుడి1259) ఆటోను ఓవర్‌టేక్ చేయబోయి ఆటోను బలంగా ఢీకొనడంతో పాటు ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ సి. శ్రీను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి గ్రామానికి చెందినవాడు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గంటసేపు కష్టపడి వెలికితీశారు. మరో డ్రైవరు సైదులు, గణేశ్‌లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా రెండు లారీల ముందు భాగాలు క్యాబిన్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికుల అవస్థ
* మెరుగుపడని ఆర్టీసీ వ్యవస్థ
* ఆదాయం ఫుల్.. అభివృద్ధి నిల్
* నిద్రమత్తులో యంత్రాంగం
* సౌకర్యాల కల్పనలో విఫలం
షాద్‌నగర్, మే 17: కాలం చెల్లించిన ఆర్టీసి బస్సులతో ప్రయాణికులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన ఆర్టీసి వ్యవస్థను అభివృద్ది చేయడంలో విఫలమవుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. షాద్‌నగర్ ఆర్టీసి బస్టాండ్ నుండి ప్రతిరోజు దాదాపు 40వేల కిలో మీటర్ల ప్రయాణం ఆర్టీసి బస్సులు చేస్తూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఆర్టీసి బస్టాండ్ ఏర్పడిన నాటి నుండి అవే బస్సులు కొనసాగుతుండటంతో ప్రయాణికులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. షాద్‌నగర్ ఆర్టీసి బస్టాండ్ నుండి వివిధ గ్రామాలకు వెళ్లే బస్సులకు ఏ సమయంలో ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందోనంటూ ప్రయాణికులను భయం గుప్పిట్లో గమ్యాలకు చేరుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అసలే రహదారులు అంతంత మాత్రం..ఇక కాలం చెల్లిన ఆర్టీసి బస్సులతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలం చెల్లిన ఆర్టీసి బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేక మార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసి బస్సుల పరిస్థితి ఇలా ఉంటే..ఇక బస్టాండ్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సరైన ఫ్లాట్ ఫాంలు, పారిశుధ్యం, తాగునీరు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతుంటే అధికారులు ఏమాత్రం పట్టడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాలం చెల్లిన ఆర్టీసి బస్సుల స్థానంలో కొత్తబస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
81 బస్సులు.. డిపో మేనేజర్ సత్తయ్య వెల్లడి
షాద్‌నగర్ ఆర్టీసి బస్టాండ్‌లో ప్రభుత్వ పరంగా 81బస్సులు ఉన్నాయని ఆర్టీసి డిపో మేనేజర్ సత్తయ్య వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అద్దెకు 31ప్రైవేట్ బస్సులను తీసుకొని నడిపిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 32రూట్లలో సుమారు 40వేల కిలో మీటర్ల ప్రయాణం ఆర్టీసి బస్సులు చేస్తున్నాయి. ప్రతిరోజు ఆర్టీసికి 10లక్షలకు పైగానే వస్తుందని వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆర్టీసి బస్సులను నడిపిస్తున్నట్లు వివరించారు. కాలం చెల్లిన బస్సులు సగానికి పైగానే ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు పేర్కొన్నారు. పాత బస్సుల స్థానంలో కొత్తబస్సు