రంగారెడ్డి

నేత్రపర్వంగా శ్రీ వేంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 19: శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు మూడో రోజు అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పద్మశాలిపురం టిఎన్జీవోఎస్ కాలనీలోని వెంకన్నగుట్టపై కొలువుదీరిన వెంకటేశ్వరస్వామికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రవచనాలు, వేంకటేశ్వరస్వామి చరిత్రను కన్నులకు కట్టినట్లు వివరించారు. భక్తజనవాహిని నడుమ స్వామివారికి పూజలు నిర్వహించారు. పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు ప్రత్యేకంగా పూలను తెప్పించి పుష్పయాగం జరిపించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి విగ్రహాలకు సేవాకాలం, పారాయణాదులు ప్రారంభం, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, కుంకుమార్చన, సుదర్శనహోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. శివారు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మండుటెండలో
పశువైద్య విద్యార్థుల నిరసన

రాజేంద్రనగర్, మే 19: రాజేంద్రనగర్‌లోని పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలో 26 రోజులుగా విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం నిరసనలో భాగంగా పశుసంపద కేంద్రాలను పశు వైద్యశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని నినాదాలు చేస్తూ వర్సిటీలోని గేట్ ఆవరణలో మండుటెండలో పడుకొని నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ 26 రోజులుగా మండుటెండలో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు. పశువైద్య నియామకాల్లో కాంట్రాక్టు వ్యవస్థను ఎత్తివేసి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనుకుంటే ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్ బంకుల్లో తనిఖీలు
వికారాబాద్, మే 19: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో చిప్ ఆధారంగా పెట్రోల్ కొలతల్లో తేడా రావడంతోపాటు మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయాలని సివిల్ సప్లై కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఈనెల 16, 17 తేదీల్లో రాయల్ ఫిల్లింగ్ స్టేషన్, శ్రీరామ ఆయిల్ సర్వీస్, హయత్ ఫిల్లింగ్ స్టేషన్, విబి కోర్వార్ ఫిల్లింగ్ స్టేషన్‌లలో తనిఖీ చేశారు. పెట్రోల్ బంకుల్లో జరుపుతున్న తనిఖీల్లో ఎటువంటి కల్తీగాని, వ్యత్యాసాలుగాని కొలతల్లో తేడాలుగాని ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి సి.పద్మజ హెచ్చరించారు.

లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
కొత్తూరు, మే 19: గొర్రెల పెంపకం దారుల సంఘాలను లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఎంపిడివో జ్యోతి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షులతోపాటు వివిధ శాఖల అధికారులకు గొర్రెల కాపరుల సంఘాలను లాటరీ పద్ధతిపై ఏవిధంగా ఎంపిక చేస్తారనే దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ నాగరకుంట నవీన్‌రెడ్డి, ఎంపిపి శివశంకర్‌గౌడ్, తహశీల్దార్ శకుంతల, ఇవోఆర్డీ సాధనరెడ్డి, వెటర్నరీ డాక్టర్లు డాక్టర్ సునీత, స్రవంతిలు పాల్గొన్నారు.

30న మెడికల్
షాపుల సమ్మె

సనత్‌నగర్, మే 19: ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను నిరసిస్తూ ఈనెల 30న మెడికల్ షాపులను బంద్ చేసి సమ్మె చేయనున్నట్టు తెలంగాణ కెమిస్ట్, డ్రగిస్ట్ అసోసియేషన్ పేర్కొంది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, చైర్మన్ జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలు ఎంతో ప్రమాదం ఉందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ ద్వారా మందులను ఎలా విక్రయిస్తారని వారు ప్రశ్నించారు. ఓవైపు వైద్యుల సూచనల ప్రకారమే మందులను విక్రయించాలని చెబుతున్న ప్రభుత్వాలు, ఆన్‌లైన్ ద్వారా విక్రయాలకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం ఉదాసీనత సరికాదని వారు అన్నారు. దీంతోపాటు ఎంతోమంది మందుల షాపులు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారని, వారితో పాటు లక్షలాది మందికి ఉపాధిని సైతం ఇస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ విధానం ద్వారా మందుల విక్రయాలకు అనుమతులు వద్దంటూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాజు, వెంకట్, కృష్ణకుమార్, ధన్‌రాజు, పాండురంగారావు, మాణిక్ రావు పాల్గొన్నారు.

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
జెఎసి డిమాండ్
సనత్‌నగర్, మే 19: తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ జెఎసి డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జెఎసి చైర్మన్ విశ్వాస్ రెడ్డి, లక్ష్మయ్య, నర్సిం హ మాట్లాడారు. పదో పిఆర్‌సి ప్రతిపాదించినట్టుగా 70 ఏళ్లు పైబడ్డ వారికి 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నానాటికీ పెరుగుతున్న ఖర్చులు, వృద్దాప్యంలో ఆనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని పెన్షనర్లకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్య సేవల్లో కూడా వృద్దులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నడవలేని వారు వైద్యుడి వద్దకు వెళ్లేందుకే నానా తంటాలు పడుతున్నారని ఈ నేపథ్యంలో నగరంలో వెల్‌నెస్ సెంటర్లను పెంచాలని డిమాండ్ చేశారు. వృద్దులకు వేగవంతంగా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులో 50 శాతం రాయితీతో ప్రయాణించేలా అవకాశం కల్పించాలని, పేదలైన పెన్షనర్లకు ప్రభుత్వం గృహ సదుపాయం కల్పించాలని కోరారు. రాష్టవ్య్రాప్తంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జెఎసి పోరాడుతుందని చెప్పారు. ఇందుకోసం గ్రామగ్రామాన జెఎసిలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ఒంటరి మహిళల పింఛన్ కోసం 4168 దరఖాస్తులు

వికారాబాద్ డిఆర్‌డివో జాన్సన్ వెల్లడి
వికారాబాద్, మే 19: ఒంటరి మహిళల పింఛన్ కోసం జిల్లాలో ఇప్పటివరకు 4168 దరఖాస్తులు వచ్చాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జాన్సన్ వెల్లడించారు. దరఖాస్తుకు చివరి తేదీని 21వ తేదీకి పెంచినందున మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని చెప్పారు. గ్రామీణ ప్రాంతం నుండి 3808 దరఖాస్తులు రాగా, పట్టణ ప్రాంతం నుండి 360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోతే విఆర్‌వోకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఎలాంటి జిరాక్స్ లేకుండా కేవలం తెల్లకాగితంపై రాసి దరఖాస్తు ఇచ్చినా, దరఖాస్తు చిరునామా ఆధారంగా ఇంటింటికీ వెళ్ళి ఆధార్, ఖాతాపుస్తకం, ఫొటోలను సేకరించి తహశీల్దార్‌కు అందజేస్తారని, తహశీల్దార్ దరఖాస్తులను పరిశీలించి జాబితాను విడుదల చేస్తారని పేర్కొన్నారు. జాబితాను గ్రామ పంచాయతీల వద్ద ప్రదర్శిస్తారని, 25వ తేదీలోపు ఎంపిడివోకు తుదిజాబితా ఇస్తే డేటా ఎంట్రీ చేస్తారని, 31వ తేదీలోపు కలెక్టర్ ఆమోదం పొంది అది సెర్ప్‌కు వెళ్తుందని వివరించారు. 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్, మే నెల పింఛన్ వస్తుందని, ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నెల నుండి పింఛన్ వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు, వారి కుటుంబ సభ్యులకు పింఛన్ రాదని చెప్పారు. 18 సంవత్సరాలు నిండి పెళ్ళి చేసుకుని, ఏడాది కాలంగా భర్తతో విడిపోయి ఉంటే పింఛన్‌కు అర్హులని, పెళ్ళికాని 30, 35 సంవత్సరాల మహిళలు అర్హులని తెలిపారు. జోగిని, యాసిడ్ బారిన పడినవారు, కుష్టువ్యాధి, హెచ్‌ఐవి ఉన్నవారికి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ మండలానికి పది లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారని అన్నారు. ఇజిఎస్, ఎస్‌బిఎం గ్రామాలున్నాయని, మెటీరియల్ ఇస్తే మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారని వివరించారు. నెలాఖరుకల్లా జిల్లాలోని 20 గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జన కింద ఎంపిక కానున్నాయని చెప్పారు. జిల్లాలో లక్షా 20 వేల మరుగుదొడ్ల నిర్మాణం అవసరమని సర్వేలో తేలిందని, 2018 కల్లా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
20 లక్షల టేకు మొక్కలు సిద్ధం
హరితహారంలో నాటేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల టేకు మొక్కలను సిద్ధం చేశామని చెప్పారు. ఇప్పటికే మొక్కలు నాటేందుకు గుంతలు తీసి సిద్దంగా ఉంచాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయని తెలిపారు.
అటవీశాఖ కోటి 20 లక్షల మొక్కలు సిద్దం చేసిందని అన్నారు. గ్రామానికి 40 వేల చొప్పున కోటి 40 లక్షల మొక్కలు అవసరమని, ముఖ్యంగా టేకు మొక్కలకు ఎక్కువ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. మొక్కలు నాటేందుకు స్థలాలను పరిశీలిస్తున్నామని వివరించారు.
23లోగా పింఛన్ కోసం
దరఖాస్తు చేసుకోవాలి
జెసి సురేష్ పొద్దార్
వికారాబాద్, మే 19: జిల్లాలో గల కళాకారుల పింఛన్ కొరకు అర్హత గల వృద్ద కళాకారులు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో 60 సంవత్సరాల పైబడిన కళాకారులు పింఛన్‌కు అర్హులని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ఏ ఇతర పింఛన్ పొందకుండా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తుతో పాటు కళాకారునిగా గుర్తింపు కార్డుతో పాటు వారు నిర్వహించే కార్యక్రమాల ఫొటోలు, పేపర్ కత్తిరింపులు సమర్పించాలని సూచిచారు.

విద్యుత్ స్తంభాలు మీదపడి
ఇద్దరి దుర్మరణం
వికారాబాద్, మే 19: విద్యుత్ స్తంభాలు పడి ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలో జరిగింది. గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొత్తూర్ గ్రామ అనుబంధమైన జిడిగడ్డ తండాకు చెందిన మోహన్(24), సంతోష్(20)లు శుక్రవారం సాయంత్రం విద్యుత్ స్తంభాలను తీసుకెళ్తుండగా తుంకిమెట్ల వద్ద ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయి ట్రాక్టర్ నడుపుతున్న మోహన్ సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్‌లో ఉన్న విద్యుత్ స్తంభాలు ఇద్దరిపై పడటంతో మృతిచెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో యువకుడు నంద్యానాయక్ పరిస్థితి విషమంగా ఉంది.

నీళ్లల్లో నిప్పు రగిల్చిన మహనీయుడు

చిరస్మరణీయుడు విద్యాసాగర్‌రావు * నాటకోత్సవాల్లో కొనియాడిన మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్ర సాధనలో అవిరళ కృషి చేసి ఉద్యమం ద్వారా తెలంగాణకు నీరు రప్పించిన విద్యాసాగర్‌రావు నీళ్లల్లో నిప్పు రగిల్చిన మహనీయుడని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ థియేటర్ రీసెర్ చ సెంటర్ నిర్వహిస్తున్న విద్యాసాగర్‌రావు నాటకోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం కార్యక్రమానికి హరీష్‌రావు ముఖ్యఅతిథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు రాసిన నాటకాలు, నాటికలు అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యాసాగర్‌రావు కల నిజం చేస్తూ కోటి ఎకరాల మాగాణిని సాగుభూమిగా చేస్తామన్నారు. తెలంగాణలోని ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెడతామని హరీష్‌రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆప్‌కీ అదాలత్, గంధర్వులే తీరుస్తారు, ప్రదానం అనే మూడు నాటికలను ప్రదర్శించారు. రచయత, దర్శకుడు డి అమరేంద్ర, త్సల్లావజ్జుల సుందరంలను హరీష్‌రావు సత్కరించారు. సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, విద్యాసాగర్‌రావు సతీమణి ఆర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అధ్యక్షత వహించారు.

గుండు హనుమంతరావుకు
బంగారు పతకం బహూకరణ

కాచిగూడ, మే 19: హాస్యనటుడు చలం 88వ జయంతి సందర్భంగా ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావుకు బంగారు పతక బహూకరణ మహోత్సవ సభ రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు పాల్గొని గుండు హనుమంతరావుకు బంగారు పతకం బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండు హనుమంతరావు యమలీల, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు తదితర చిత్రాలలో హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమల్లో చెరగని ముద్రవేసుకున్నాడని తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన నటులను ప్రొత్సహిస్తున్న రాగరాగిణి సంస్థను ఆయన అభినందించారు. సభకు ముందు చలం నటించిన చిత్ర సినీ సంగీత విభావరి అందరినీ అలరించింది. సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో కాచం ఫౌండేషన్ చైర్మెన్ కాచం సత్యనారాయణ గుప్త, మానేపల్లి గ్రూప్ చైర్మెన్ రామారావు, గురుస్వామి గ్రంధి, లయన్ జయప్రకాష్‌రెడ్డి, వి.శైలజ, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు యంవి.సుబ్బలక్ష్మీ, రమణకుమారి పాల్గొన్నారు.

నాటి ఆటగాళ్లు..
నేటి గురువులు!

* నిస్వార్థ సేవలందిస్తున్న సీనియర్ క్రీడాకారులు
* ఔత్సాహికులకు తర్ఫీదునిస్తున్న 1966 మంది కోచ్‌లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 19: క్రీడారంగంలో ఒక వెలుగువెలిగి,జిల్లా స్థాయి మొదలుకుని జాతీయ స్థాయిలో నగరానికి పేరుప్రతిష్టలు తెచ్చిన ప్రముఖ క్రీడాకారులు నేటికీ అదే ఉత్సాహాంతో క్రీడారంగం అభివృద్ధికి శ్రమిస్తున్నారు. జిహెచ్‌ఎంసి వేసవి క్రీడాశిక్షణ శిబిరాల్లో వివిధ క్రీడాంశాలను నేర్చుకునేందుకు వచ్చిన ఔత్సాహిక క్రీడాకారులకు మెళుకువలను నేర్పుతూ నిస్వార్థ సేవలు చేస్తున్నారు. జిహెచ్‌ఎంసిలో మొత్తం రి2వేల 69 మంది కోచ్‌లు ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా, వీరిలో 103 మంది మినహా మిగిలిన 1966 నుంచి కోచ్‌లు ఉచితంగానే తర్ఫీదునివ్వటం విశేషం. వీరిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న క్రీడాకారులు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందిన సీనియర్ క్రీడాకారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారితో పాటు రిటైర్డు అయిన వారున్నారు. వీరిలో కొందరు తమకు జీవనోపాధి అంతంతమాత్రంగా ఉండటంతో చిరువ్యాపారులు చేసుకుంటున్నా, నేటికీకి వారికి క్రీడలపై మక్కువ తగ్గలేదిన చెప్పవచ్చు. ప్రతిరోజు ఉదయం అయిదు గంటలకే బల్దియా క్రీడాదానాలకు వచ్చి యువతకు పలు క్రీడాంగాశాల్లో నిస్వార్థంగా శిక్షణనిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. జిహెచ్‌ఎంసి నిర్వహిస్తోన్న సమ్మర్ కోచింగ్ క్యాంపుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విక్టరీ ప్లే గ్రౌండ్స్‌కు వచ్చిన జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి శుక్రవారం కోచ్‌లతో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ నగరానర్ని క్రీడా రాజధానికి తీర్చిదిద్దేందుకు సీనియర్ క్రీడాకారులు ఏ మాత్రం ఆర్థిక పరమైన లాభాలను ఆశించకుండా ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా ఉచిత సేవలు అందిస్తున్నారని తెల్సుకుని కమిషనర్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వీరిలో కలీముల్లాఖాన్ అనే కోచ్ విక్టరీ ప్లే గత యాభై ఏళ్ల నుంచి ఉచితంగా క్రికెట్‌లో శిక్షణనిస్తున్నాని తెల్సుకుని కమిషనర్ ఉద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా గౌలీపురా ప్లే గ్రౌండ్స్‌లో 1968 నుంచి టేబుల్ టెన్సీస్‌లో హరినారాయణ అనే కోచ్ కూడా ఉచితంగా శిక్షణనిస్తున్నట్లు గుర్తించి, వారిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
మరికొందరు ప్రముఖులు
ఆదాయపన్ను శాఖలో సీనియర్ అధికారిగా ప్రస్తుతం పనిచేస్తూ, జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన రాధాకృష్ణారెడ్డి కెపిహెచ్‌బి 7వ ఫేజ్ గ్రౌండ్స్‌లో వాలీబాల్ రంగంలో శిక్షణనిస్తున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ఇదే గ్రౌండ్స్‌లో ఎన్‌ఐఎస్ శిక్షణ పొందిన అంజయ్య బాస్కెట్‌బాల్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసు రిటైర్డు అయిన అశోక్‌రెడ్డి చందానగర్‌లో వాలీబాల్‌లో శిక్షణనిస్తూ వందలాది మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. సాప్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన 73 సంవత్సరాల ఫారూక్ అనే చో కూచే దరార్ జంగ్‌లో బాక్సింగ్‌లో బాక్సింగ్‌లో శిక్షణనిస్తున్నారు. ఎస్‌ఐఎస్‌లో శిక్షణ పొందిన వేణుగోపాల్ అనే కోచ్ అమీర్‌పేట స్పోర్ట్స్ కాంప్లెక్సులో దశాబ్దాలుగా బ్యాడ్మింటన్‌లో శిక్షణనిస్తున్నారు. వీరు ప్రస్తుతం వరల్డ్ నెంబర్ టూ క్రీడాకారిణి అయిన పి.వి.సింధుకు తొలినాళ్లలో ఇక్కడే శిక్షణ పొందారు. అలాగే జాతీయ స్థాయిలో 12సార్లు చాంపియన్‌గా నిలిచిన సద్గురు అనే క్రీడాకారుడు అంబర్‌పేట ప్లే గ్రౌండ్స్‌లో టెన్నీకాయిట్‌లో ఉచిత సేవలందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రైటైర్డు ఎస్‌బిహెచ్ అధికారిగా ఉన్న భీమ్‌సింగ్ చింతల్‌బస్తీలో అనేక మంది యువకులకు హాకీలో శిక్షణనిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో టికెటింగ్ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాధకృష్ణరాజు నెహ్రూనగర్ ప్లే గ్రౌండ్స్‌లో వాలీబాల్ కోచ్‌గా క్రీడాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. రైల్వే అధికారిగా ఉన్కన మరో క్రీడాకారుడు చోటేమియా లాలాపేటలో బాక్సింగ్‌లో శిక్షణనిస్తున్నారు. వీరే కాకుండా జీవనోపాధి అంతంతగా ఉన్నా పలువరు సీనియర్ క్రీడాకారులు కూడా ఏ మాత్రం ఆర్థికపరమైన లాభాపేక్ష లేకుండా కోచ్‌లుగా సేవలందిస్తుండటం విశేషం.