కృష్ణ

24న గుడివాడకు సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 19: వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు ఈ నెల 24వతేదీన గుడివాడ రానుందని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజి మంత్రిత్వ శాఖ విక్రం శారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25, 26తేదీల్లో మూడు రోజుల పాటు గుడివాడ రైల్వే స్టేషన్‌లో ఈ రైలు అందుబాటులో ఉండనుంది. వాతావరణ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను ఈ రైలులో ఏర్పాటు చేశారు. మూడు రోజులు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి 17వతేదీన ప్రారంభమైన ఈ రైలు సెప్టెంబర్ 8వతేదీ వరకు 68 స్టేషన్లలో 19వేల కిలో మీటర్లు ప్రయాణించనుందన్నారు. 13 బోగీలు కలిగిన ఈ రైలులో ఒకొక్క బోగీలో ఒకొక్క అంశంపై సమగ్ర సమాచారంతో, లైవ్ ప్రాజెక్ట్ వివరణలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా ఈ రైలును సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీకాంతం విద్యా శాఖాధికారులను ఆదేశించారు.

ప్రజలకు మరింత చేరువ కావాలి
* సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ

మైలవరం, మే 19: నిత్యం ప్రజలలో ఉండి వారి సమస్యలను పరిష్కరించటం ద్వారా వారికి మరింత చేరువ కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ఇరిగేషన్ క్యార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలలో ఉండాలని, వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, గృహాలు, దీపం కనెక్షన్లు, రోడ్లు, డ్రైన్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర అంశాలపై సమగ్ర దృష్టి సారించాలన్నారు. మూడేళ్ళలో చేసిన ప్రగతిని గ్రామాలలో చెప్పాలన్నారు. ఇందుకు విధిగా రచ్చబండలను ఏర్పాటు చేయాలన్నారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలలో ఇళ్ళ స్థలాల పంపిణీ పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆయన సబ్ కలెక్టర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. గొల్లపూడిలో షాదిఖానా శంకుస్థాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్డిగూడెం మండలం రంగాపురం కస్తూరిభా గాంధీ విద్యాలయ పాఠశాలకు కాంపౌండ్ వాల్, వౌలిక వసతుల కల్పనకు మంజూరైన 26.03 లక్షల రూపాయల నిధులకు వెంటనే టెండర్ పిలిచి పనులు మొదలెట్టాలని సర్వశిక్షా అభియాన్ పీడిని ఆదేశించారు. పదవ తరగతిలో తక్కువగా నమోదైన ఫలితాలపై నివేదిక ఇవ్వాలని పిఓను ఆదేశించారు. నూజివీడు డీఎస్పీతో మాట్లాడి ఇటుక బట్టీలపై పూర్తి విచారణ చేసి పేదలకు అందుబాటులో ధరలు ఉంటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సమస్య ఉన్నచోట అవసరమైతే ట్యాంకర్లను ఏర్పాటు చేయాలన్నారు. మే 27,28,29 తేదీలలో విశాఖలో జరిగే మహానాడుకు ఏ విధంగా తరలి వెళ్ళాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈనెల 21న జిల్లా నూతన కమిటీ ఎన్నికలు, 22న అనుబంధ సంఘాల ఎన్నికలు జరుగుతాయని, 24న జిల్లా మినిమహానాడు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.