రంగారెడ్డి

ఇంటర్ విద్యార్థిని సాయి ప్రజ్వల ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 20: పోలీసులను ఉరుకులు.. పరుగులు పెట్టించిన ఇంటర్ విద్యార్తిని సాయి ప్రజ్వల అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమె ఆచూకిని కనుగొన్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన శ్రీనివాస్ రెండో కూతురు సాయి ప్రజ్వల (16) ఇంటర్ చదివింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం నాగోల్ బండ్లగూడలోని నారాయణ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో చేర్పించారు. కొన్ని నెలలు మంచిగానే ఉన్న ఆమె దసరా సెలవుల్లో స్వగ్రామానికి వెళ్లి ఈనెల 9న తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. చెంగిచర్ల వెంకట సాయినగర్‌లో నివసిస్తున్న మేనమామ లక్ష్మణ్ ఇంట్లో ఉండి మరుసటి రోజు బయటకు వెళ్లి అదృశ్యమైంది. నారాయణ కళాశాల యాజమాన్యం వేధింపులతో చదువుకోలేక పోతున్నానని మరీ ఉత్తరం రాసి వెళ్లింది. రెండు రోజులు కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మేడిపల్లి పిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో గాలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రజ్వల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరో ఫోన్‌ను ఉపయోగిస్తుంది. సెల్ నెంబర్‌ను సంపాదించిన పోలీసులు కాల్ లిస్ట్ ఆధారంగా ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతుందో డేటా సేకరించి తద్వారా ఎక్కడో కాదు పిఎస్‌కు పక్కనే ఉన్న ఫీర్జాదిగూడలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నట్లు ఆచూకీని కనుగొన్నారు. అక్కడికి వెళ్లి చూడగా హాస్టల్‌లో క్షేమంగా ఉంది. ఆమెను ఇక్కడి నుంచి హోమ్‌కు తరలించి కౌనె్సలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు ఎసిపి గోనె సందీప్ తెలిపారు. చదువు ఇష్టం లేకనే హాస్టల్ నుంచి బయటకు వచ్చినట్లు విచారణలో చెప్పినట్లు పేర్కొన్నారు.

మూసాపేట్‌లో బాలుడి కిడ్నాప్.. మేడ్చల్‌లో కిడ్నాపర్ అరెస్టు

మేడ్చల్/కెపిహెచ్‌బికాలనీ, అక్టోబర్ 20: నగరంలోని కూకట్‌పల్లి పిఎస్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్‌ను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి పోలీసులు బాలుడి మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట్ ప్రాంతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి అఫ్రోజ్ అనే ఐదేళ్ల బాలుడిని గురువారం కిడ్నాప్ చేశాడు. గురువారం సాయంత్రం మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనివాస్‌ని బాలుడు అఫ్రోజ్‌ను గమనించిన మహ్మద్ ఖయ్యూం, బానోతు లింగం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. కిడ్నాప్‌కు గురైన బాలుడు అఫ్రోజ్ కేసులో సహకరించిన మహ్మద్ ఖయ్యూం, బానోతు లింగానికి మేడ్చల్, కూకట్‌పల్లి ఠాణాల సిఐలు నగదు రివార్డును అందజేశారు. కిడ్నాపర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసి అపహారణకు గురైన బాలుడు అఫ్రోజ్‌ను కూకట్‌పల్లి పోలీసుల సమక్షంలో తల్లితండ్రులకు అప్పగించినట్లు సిఐ వెంకట్ రెడ్డి తెలిపారు.