రంగారెడ్డి

చీకటి వెలుగుల రంగేళి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 20: ఇంటింటా విరజిమ్మే కాంతులు.. దీపాల వెలుగులు.. ఆడపడుచుల ఉత్సాహం.. యువత కేరింతల నడుమ దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత టపాసులు పేలుస్తూ దీపావళి పండుగను శోభాయమానంగా జరుపుకొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే దీపావళి ఉత్సవాలను పురస్కరించుకొని సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్, బుద్వేల్, హైదర్‌గూడ, డైరీఫాం, అత్తాపూర్, ఉప్పర్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, అరాంఘర్, దుర్గానగర్, శివరాంపల్లి, బుద్వేల్ రైల్వేస్టేషన్ బస్తీ, కాటేదాన్, మధుబన్‌కాలనీ, టి ఎన్జీవో ఎస్‌కాలనీ, లక్ష్మిగూడ, మార్కండేయనగర్, బాబుల్‌రెడ్డినగర్‌లలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆయా దేవాలయాల్లో లక్ష్మీమాత, అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. అంతేకాకుండా దీపావళి అంటేనే వెలుగులు విరజిమ్మే పండుగ కావడంతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇళ్ల ముందు దీపాలు పెట్టడమే కాకుండా ఇల్లంతా దీపాలతో అలంకరించారు.
ఘనంగా సదర్ ఉత్సవాలు
రాజేంద్రనగర్ సర్కిల్లో దీపావళి ఉత్సవాలను పురస్కరించుకొని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని ప్రేమావతిపేట్‌లో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని దున్నపోతుల ఆటను తిలకించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాల్లో దున్నపోతుల ఆటలు ఎంతో ఉత్సాహపరుస్తాయని తెలిపారు. ఇలాంటి ఉత్సవాలు ప్రజల్లో సమైక్యత భావాన్ని పెంపొందిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు రఘుముదిరాజ్, నర్సింగ్, హరి, శివ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: దీపావళి పర్వదిన సంబరాలు ఘనంగా జరిగాయి. కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలలోప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు. వ్యాపారస్థులు సాయంత్రం వేళల్లో లక్ష్మిదేవి పూజను నిర్వహించారు. అమవాస్య గురువారం రాత్రి వరకు ఉండటంతో సాయంత్రం ఆరు గంటల నుంచే పురోహితుల ద్వారా పూజలు చేయించి భక్తిని చాటుకున్నారు. అంతకుముందు గృహాలు వ్యాపార సముదాయలను రంగుహంగులతో అలంకరించి మామిడి తోరణాలతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.
తాండూరు: ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా బాణసంచా విక్రేతలు ధరల దోపిడీతో జేబులు నింపుకున్నారు. అనుమతి లేకున్నా యథేచ్ఛగా విక్రయాలు చేపట్టారని ప్రజలు ఆరోపించారు. అక్రమంగా బాణాసంచా దుకాణాలు కుప్పలుతెప్పలుగా వెలిసినా సంబంధింత శాఖల అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. పట్టణంలో ఇద్దరు, ముగ్గురు విక్రేతలకే లైసెన్స్ ఉండగా వందల సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలిశాయి. పిల్లలు మారాం చేయటంతో బాణాసంచా కొనటం తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుంటున్న బాణాసంచా వ్యాపారులు దీపావళి రోజుల్లో లక్షలాది రూపాయలను గడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ. మామూళ్లు వసూలు చేసి సంబంధిత అధికారులు గుభనంగా ఉంటున్నారని ప్రజాసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
రీవాజుగా మారిన పేకాట..
తాండూరులో శ్రీమహాలక్ష్మీ పూజల సమయంలో రాత్రంతా అమ్మవారి వద్ద వెలిగించిన దీపాలు కొండెక్కకుండా ప్రతి ఇంటా, వ్యాపార, వాణిజ్య సంస్థల వద్ద రాత్రంతా జాగారణం చేయటం ఆనవాయితీగా వస్తుంది. దుకాణాలు, వ్యాపార సంస్థలలో పేకాట ఆడటం అనాది కాలంగా సరదాగా మారింది. మూడు నాలుగు దశాబ్దాలుగా పేకాట హద్దు మీరిపోయింది. దీపావళి అమావాస్య మొదలు, కార్తీక పౌర్ణమి వరకు పదిహేను రోజుల శ్రీమహాలక్ష్మీ పూజల సందర్భంగా పేకాట ఆడటం పట్టణ, డివిజన్‌లో జాడ్యంగా పరిణమించిందని పలువురు పెద్దలు, విద్యావంతులు వాపోతున్నారు. పోలీస్ అధికార యంత్రాంగం.. పేకట నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ మార్పు లేదని చెబుతున్నారు. పక్షం రోజులు రాత్రంతా పేకాటకు బానిసలై యువకులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. అన్నివర్గాల ప్రజలు జూదం ఆడుతూ ఆస్తులను పోగొట్టుకుంటున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీపావళి వేడుకలు తాండూరు డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు, శ్రీమహాలక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలకు నిదర్శనంగా జరుపుకునే దీపావళీ పండుగ సందర్భంగా వ్యాపార సంస్థలను శభ్రపరచి, రంగురంగుల పూలు, మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో అలంకరించారు.
బాణసంచా పేలుళ్లతో పట్టణం దద్దరిల్లింది. ఇంటింటా ప్రజలు శ్రీమహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.