రంగారెడ్డి

పండుగ వేళ.. విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, అక్టోబర్ 21: దీపావళి పండుగ రోజున టపాసులు కాలుస్తుండగా ఆపశ్రుతి చోటుచేసుకుంది. కొంతమందికి కంట్లో నేరుగా నిప్పురవ్వలు పడి తీవ్రగాయాలు కాగా.. వారికి ఆసుపత్రిలో శస్తచ్రికిత్సలు జరిగాయి. నగరంలో కాకుండా వివిధ జిల్లాలను నుంచి కూడా సరోజినిదేవి కంటి ఆసుపత్రికి వచ్చి చికిత్సలు నిర్వహించుకున్నారు. దీపావళి పండుగ పురస్కరించుకుని టపాసులు కాల్చడంతో ప్రమాదవశాత్తు కంటికి గాయాలైన వారికి సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో వైద్య బృందాలు చికిత్సలు నిర్వహించారు. గురువారం రాత్రి టపాసులు కాల్చుతుండగా ప్రమాదవ శాత్తు పేలి కొందరికి గాయాయ్యాయ. కాగా, టపాసులు కాల్చుతుండగా దారిలో వెళతున్న వారి కళ్లల్లో కూడా నిప్పురవ్వలు పడి గాయాలయ్యాయ. బాణసంచా కాల్చుతున్న వ్యక్తుల కంట్లో నిప్పు రవ్వలు దూసుకవచ్చి కంటి చూపుకు దూరం అయ్యారు. కంటి గాయాలతో మెహిదీపట్నం సరోజిని దేవి కంటి ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యులు కంటి వైద్యం నిర్వహించారు. గురువారం రాత్రి 35మంది, శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మరో 20మంది వచ్చి కంటికి వైద్యం నిర్వహించుకున్నారని డాక్టర్లు తెలిపారు. ఇందులో చిన్నారులతో పాటు యువకులు, మహిళాలు కూడా ఉన్నారు. వీరులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బిటెక్ చుదువుతున్న స్వప్న పక్కనే రాకెట్ కొందరు యువకులు కాల్చుతుండగా నేరుగా వచ్చి స్వప్న కంటోక్లి దూసుకుపోయింది. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తీసుకవచ్చారు. అయితే, స్వప్నకు మొదటగా గురువారం రాత్రి ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాకుండా మరో ఆపరేషన్ చేస్తే గాని చూపు వచ్చే అవకాశాలు లేవని డాక్టర్లు పేర్కొన్నారు. ఈరకంగా చింగారి వీరమణికి కూడా తీవ్ర గాయాలైయ్యాయి. కాగా బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన సలీం కుమారుడు అధిల్ (12), పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బాలేష్ కుమారుడు సుషాంత్ (11), నకిరేకల్ చెర్వుఅన్నారం ప్రాంతానికి చెందిన రాములు కుమారుడు విగ్నేష్ (11), సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన రాంబాబు కుమారుడు చరణ్‌కుమార్ (13), చార్మినార్ ప్రాంతానికి చెందిన శివకుమార్ కుమారుడు సురజ్ (7) వీరికి కూడా నిప్పు రవ్వలు పడి కంట్లో గాయాలు అయ్యాయి. వీరందరికీ ఆపరేషన్లు చేశారు. కాగా స్వప్నతో పాటు వీరమణికి కూడా చూపు విషయంలో రెండు మూడు రోజులు అయితేగాని పరిస్థితి చెప్పలేమన్నారు వైద్యులు. 12 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని ఇన్‌చార్జి సూపరింటెంటెండ్ రవీందర్‌గౌడ్ తెలిపారు. కంటికి గాయమైన వారు ఆసుపత్రికి వచ్చి చికిత్సలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. దీపావళి పండుగలో టపాకాయలు కాల్చి కంటికి గాయాలైన వారికోసం ప్రత్యేక డాక్టర్లు బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వల్పంగా గాయాలైన వారికి చిన్నా పాటి చికిత్స చేసి అప్పటికప్పుడే ఇంటికి పంపించినట్లు తెలిపారు. చికిత్స కోసం వచ్చిన వారిలో ఎక్కువ మందిలో చిన్నారులు కూడా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. టపాసులను చిన్నారులు కాల్చినప్పుడు పెద్దలు దగ్గర ఉండాలని డాక్టర్లు తెలిపారు. ఆజాగ్రత్త వల్ల కంటి చూపుపోయే ప్రమాదం ఉందని.. ఇప్పటికైనా చిన్నారుల దగ్గర ఉండి వారి తల్లిదండ్రులు టపాసులు కాల్పించాలని డాక్టర్లు చెబుతున్నారు.