రంగారెడ్డి

సైబరాబాద్ కమిషనరేట్‌లో ఓపెన్ హౌస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 20: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉపయోగించే ఆయుధాలను ప్రదర్శించారు. కమిషనర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. శాంతిభద్రతల కోసం తమ ప్రాణాలను త్యాగాలు చేసిన అమరులను స్మరించు కోవలసిన అవసరం ఉందని చెప్పారు.
సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న కమిషనరేట్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 8.15కి పోలీసుల అమరులకు వందన కార్యక్రమం నిర్వహిస్తామని, నివాళి అర్పిస్తామని చెప్పారు. పోలీసు అమరుల రివార్డులను కుటుంబ సభ్యులకు అందించి సన్మానం చేస్తామని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని వివిధ పాఠశాలు, కాలేజీల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించనున్నట్లు సిపి తెలిపారు. ఓపెన్ హౌస్ సందర్భంగా ఫైర్ సర్వీస్ విన్యాసాలు, బాంబ్ స్క్వాడ్ డిస్పోజల్, టాక్టికల్ వింగ్ డిఫెన్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓపెన్ హౌస్‌ను తిలకించేందుకు కమిషనరేట్ పరిధిలోని పలు పాఠశలలకు చెందిన విద్యార్థులు వచ్చారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్, క్రైం డిసిపి జానకి షర్మిలా, అడిషనల్ డిసిపి మాణిక్‌రాజ్, అడ్మిన్ ఎసిపి గాంధీ నారాయణ, సైబర్ క్రైం ఎసిపి జయరాం పాల్గొన్నారు.

ఎటిఎంలో చోరీకి విఫలయత్నం
హయత్‌నగర్, అక్టోబర్ 20: ఎటిఎంలో చోరీకి యత్నించగా విఫలమైన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ పరిధిలోని సిండికేట్ బ్యాంక్ ఎటిఎంలో గురువారం రాత్రి రెండు గంటల సమయంలో గుర్తుతెలియన వ్యిక్తి ముఖానికి ముసుగు ధరించి లోపలికి ప్రవేశించాడు. 10 నిమిషాల పాటు ఎటిఎంను పగులగొట్టే ప్రయత్నం చేయగా అది తెరవకపోవడంతో వెనుదిరిగాడు. బ్యాంక్ మేనేజర్ భల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.