రంగారెడ్డి

ఆయుధాలను విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 20: వ్యాపారం కోసం ఒడిషాకు వెళ్లిన అతను నష్టం రావడంతో సులువుగా డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించి అక్రమ ఆయుధాలతో బెదిరింపులు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైనా నిందితుడిలో మార్పు రాలేదు. చత్తీస్‌గడ్ నుండి ఆయుధాలు తీసుకొచ్చి నగరంలో విక్రయంచేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ వెల్లడించారు. పోట్లూరి ఈశ్వర్ రెడ్డి (28) అలియాస్ అన్నాభాయి జీవనోపాధి కోసం ఒడిషాలోని బంటాలకు వెళ్లి పఫ్ రైస్ (మరమరాలు) వ్యాపారం చేశాడు. వ్యాపారంలో నష్టం రావడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు కొందరు యువకులతో కలసి ముఠా ఏర్పాటు చేశాడు. ఆయుధం కోసం చత్తీస్‌గఢ్‌లోని ఘర్‌గోడా నుండి .765, 9ఎ ంఎం పిస్టల్స్ రెండు కోనుగోలు చేసి దోపిడీలు, దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఒడిషా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న పిస్టల్స్‌ను పోలీసులకు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. జైలు నుండి విడుదలైన తరువాత ఒడిషా పోలీసులతో పాటు నక్సలెట్లు కూడా ఈశ్వర్‌రెడ్డిని టార్గెట్ చేయడంతో మకాం నగరానికి మార్చాడు. అతనితోపాటు తన గ్రామానికి చెందిన సునీల్ కుమార్ (29)తో కలసి తన వద్ద ఉన్న ఆయుధాలను విక్రయించడానికి ప్రయత్నించాడు. అదే క్రమంలో సరూర్‌నగర్‌లో ఆయుధాలను విక్రయించేందకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. రెండు పిస్టళ్లను ఎవరికి విక్రయించేందుకు తీసుకువచ్చారో తెలియాల్సి ఉందని సిపి చెప్పారు. విజయవాడకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చేందుకు మాట్లాడుకున్నట్లు తెలిసిందన్నారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని మహేష్ భగత్ తెలిపారు. గతంలో పలుమార్లు పాత నగరంలో పలువురిని కలసినట్లు తెలిసిందని ఆ సమయంలో ఎవరికైనా ఆయుధాలు విక్రయంచారా? తెలియాల్సి ఉందని చెప్పారు. 9 ఎంఎం పిస్టల్ ఇటలీలో తయారు చేసినట్లుందని ఫోరోనిక్స్ ల్యాబ్‌కు పంపించి వివరాలు తెలస్తాయని తెలిపారు. నిందితుల నుండి రెండు పిస్టళ్లు, ఒక రౌండ్ బుల్లెట్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి మహేష్ భగత్ తెలిపారు. నిందితులను పట్లుకున్న ఎస్‌ఓటి సిఐ నవీన్ కుమార్ బృందాని అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి సునీల్ జోషితో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

వార్డెన్ మందలింపు.. విద్యార్థిని అదృశ్యం
ఘట్‌కేసర్, అక్టోబర్ 20: సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్దని హస్టల్ వార్డెన్ మందలించి.. తండ్రికి సమాచారం ఇచ్చాడనే మనస్తాపంతో ఓ విద్యార్థిని అదృశ్యం అయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చౌదరిగూడ పంచాయతీ విజయపురి కాలనీలోని ప్రిన్నిటన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న నేహ (18) నాలుగు నెలల క్రితం క్యాంపస్ హస్టల్‌లో చేరింది. కొద్ది రోజులుగా హస్టల్‌లో సెల్‌ఫోన్ మాట్లాడుతుండటంతో హస్టల్ వార్డెన్ ఈనెల 17న నిజామాబాద్ జిల్లా భీమ్‌గళ్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్న విద్యార్థిని తండ్రి మహమ్మద్ రఫిక్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సెల్‌ఫోన్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలని, తాను ఈనెల 22న వస్తానని విద్యార్థిని తండ్రి వార్టెన్‌కు చెప్పటంతో విద్యార్థిని నుండి ఫోన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాను ఫోన్ వాడుతున్నట్లు తండ్రికి చెప్పటంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని నేహ ఈనెల 19న కళాశాల నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదని హాస్టల్ వార్డెన్ విద్యార్థిని తండ్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కూతురు ఆచూకీ కోసం బంధుమిత్రుల వద్ద వెదికినా పలితం లేకపోవటంతో శుక్రవారం ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదృశ్యం అయిన విద్యార్థిని తండ్రి రఫిక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.