రంగారెడ్డి

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, డిసెంబర్ 16: సనత్‌నగర్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి గ్రౌండ్‌లో వేడుకలను జరిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధైవ సేవకుడు రెవరెండ్ డాక్టర్ జాన్ వెస్లీ హాజరై ప్రసంగించారు. ఏసుక్రీస్తు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని బోధించారని తెలిపారు. ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖఃశాంతులతో ఉంటుందని అన్నారు. గత 20 ఏళ్లుగా వీజే విలియమ్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మి బాల్‌రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలను తెలిపారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అన్ని మతాలకు ప్రభుత్వ ప్రాధాన్యం
కేపీహెచ్‌బీకాలనీ: తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల వారికి ప్రాధాన్యమిస్తూ కానుకలను అందజేస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందజేసిన దుస్తులను శనివారం హైదర్‌నగర్ డివిజన్‌లోని మైత్రిహిల్స్‌లో, వివేకానందనగర్ డివిజన్‌లో శుభోదయ కాలనీలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్లు జానకీరామారాజులు పాల్గొని క్రిస్టియన్ సోదరులకు దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను ఆదరిస్తూ వారి అభిమానాన్ని పొందుతుందన్నారు. ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కెసీఆర్ దుస్తులను పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్‌ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, మాధవరం రామారావు, చంద్రకాంత్‌నాయి, రాజుయాదవ్, గోపాల్‌రావు, కార్తీక్‌రావు, పవన్, రాములు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: క్రిస్టియన్‌లు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం స్వాగతించదగ్గ విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని సర్కిల్ పరిధిలోని బుద్వేల్ చర్చ్‌లో క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోరణి శ్రీలత, సర్కిల్ డిప్యూటి కమిషనర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
క్రిస్మస్ సంతోషంగా జరుపుకోవాలి
చేవెళ్ల: రాష్ట్రంలో అందరు సుఖఃసంతోషాలతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ బాల్‌రాజ్, మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డిలతో కలిసి క్రైస్తవులకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రెస్తవ సోదరులు పండుగలను అనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రం చేయలేని పనులను కేసీఆర్ చేసి చూపిస్తున్నారన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో మొత్తం వెయ్య దుస్తువులను క్రైస్తవ సోతరులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఈ దుస్తులను ప్రతి పేదవాడికి అందేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ప్రభుత్వం సరఫరా చేసే దుస్తులను క్రైస్తవ సోదరీమణులు తీసుకొని ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో వెంకటేశ్వర్లు. తహశీల్దార్ గోపిరామ్, నాయకులు ఐదు మండలాల పాస్టర్లు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.