రంగారెడ్డి

వికారాబాద్ కలెక్టర్ దివ్య బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 16: వికారాబాద్ జిల్లా కలెక్టర్ డీ.దివ్య ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.రఘునందన్‌రావు వికారాబాద్ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. శనివారం రాత్రి దివ్యను ఆదిలాబాద్‌కు బదిలీ చేస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినపుడు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె 14 నెలలు ఇక్కడ విధులు నిర్వహించి జిల్లా ప్రజల మన్ననలు పొందారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కార మార్గం చూపడంలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహించి సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై వాకబు చేశారు. అంతే కాకుండా జిల్లా కేంద్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను మెరుగుపర్చడం, సిగ్నల్స్ ఏర్పాటు చేయించడం, డివైడర్ నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషించారు. వికారాబాద్, తాండూర్‌లలో సిగ్నల్స్ ఏర్పాటుకు కలెక్టర్ నిధుల నుండి కేటాయించారు. బదిలీ అయ్యే శనివారం సైతం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న భరోసా కేంద్రానికి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి భూమి కేటాయింపు, శంకుస్థాపన, నష్టపరిహారం, చురుకుగా నిర్మాణంపైనా ప్రత్యేక దృష్టి పెడుతూ వచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఆదివాసీలు, లంబాడీల ఘర్షణల కారణంగా ఆమెను ఆదిలాబాద్‌కు బదిలీ చేసి ఉండవచ్చని, గతంలో భద్రాచలం ఐటీడీఏ అధికారిగా పనిచేసి గిరిజనులు, ఆదివాసీల గురించి ఆమె అవగాహన కలిగి ఉండటం బదిలీకి కారణం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

నీటి సమస్య పరిష్కారానికి కృషి
హయత్‌నగర్, డిసెంబర్ 16: చంపాపేట్ డివిజన్‌లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేటర్ సామ రమణారెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో రూ. 15 లక్షలతో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు శనివారం కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ సాయినగర్ కాలనీలో పైప్‌లైన్ పనులతో నీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. అన్ని కాలనీలలో హడ్‌కో నిధులతో పైప్‌లైన్‌లు వేసి నీటి ఎద్దడిని నివారిస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీటిని అందిస్తామని వెల్లడించారు. బైరామల్‌గూడ చౌరస్తాలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ. 7.50 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జెల మధుసూధన్‌రెడ్డి, నాయకులు అమృతారెడ్డి, సూర్యప్రకాష్‌గుప్త, రాంరెడ్డి, నర్సింహ్మ, వార్డు, ఏరియా కమిటీ సభ్యులు కృష్ణవేణి, రాజిరెడ్డి, రఘు, గోపాల్ పాల్గొన్నారు.