రంగారెడ్డి

రైల్వే చక్రబంధంలో ఉన్న మల్కాజిగిరికి విముక్తి కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, జనవరి 25: రైల్వే చక్రబంధంలో ఉన్న మల్కాజిగిరి ప్రాంతానికి విముక్తి కల్పిస్తామని మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు. ప్రజలు నిత్యం రైల్వే గేట్లవల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడి సమస్యలపై ముఖ్యమంత్రికి విన్నవించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం శివార్లలోని మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని గౌతంనగర్ డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు. డివిజన్ అభ్యర్థి శిరీషా జితేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేటిఆర్ నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎఓసి రోడ్ల మూసివేతపై ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని ఇప్పటికే రక్షణ శాఖ మంత్రితో ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చిస్తున్నారని అన్నారు. ఇక్కడ ప్రత్యామ్నాయ రోడ్లు పూర్తయ్యే వరకు గేట్లు మూసి వేయకుండా చూస్తామని కేటిఆర్ హామీ ఇచ్చారు. మల్కాజిగిరి సర్కిల్‌లో 338 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మంచినీటి పథకానికి ముఖ్యమంత్రి శంఖుస్తాపన చేయటంతో మల్కాజిగిరి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ పనులవల్ల ప్రజలకు కాస్తా ఇబ్బందులు కలుగుతున్నా త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. జయగిరి లక్ష్మీ నర్సింహ్మస్వామి నగర్‌లో దేవాదాయశాఖకు సంబంధించిన భూముల్లో నివాసముంటున్న దాదాపు 500 వందల కుటుంబాలకు రెగ్యులరైజ్ చేసే విషయాన్ని సానుకూలంగా పలిశీలిస్తామని కేటిఆర్ పేర్కొన్నారు. రోడ్‌షోలో జిల్లా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన వికె.మహేష్ అభ్యర్థి శిరీషా జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.