రంగారెడ్డి

అన్ని కులాలకు సేవచేసేది ఆర్యవైశ్యులు మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 3: ఎదుటివారు సంతోషంగా ఉండాలని కోరుకునేది ఆర్యవైశ్యుడని అంతర్జాతీయ వాసవి క్లబ్స్ మాజీ అధ్యక్షుడు రచయిత, సైకాలజిస్ట్ గంపా నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం రాత్రి స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన వికారాబాద్ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారానికి ప్రధానవక్తగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆర్య వైశ్య సంఘం మాత్రమే అన్ని కులాలకు సేవలందిస్తుందని చెప్పారు. వైశ్యుడిగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. అన్నదాన సత్రాలు నడుపుతూ ఆలయాల్లో దీపధూప నైవేద్యాలను ఏర్పాటు చేస్తూ హిందుత్వాన్ని బతికించేందుకు కారణమవుతున్నది ఆర్యవైశ్యులేనని స్పష్టం చేశారు. బంగారం కొనుగోలు దుకాణం మొదలు, హోటళ్లు, ఐమాక్స్ థియేటర్లు, విమానాల్లో తిరుగుతూ కనిపించే ఆర్యవైశ్యులు పిసినారులు కాదని పొదుపు చేసేవారని తెలిపారు. గత ఏడాది వాసవి క్లబ్ 60 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు అందించిందని, అందులో సేవలు పొందింది 90 శాతం వైశే్యతర కులస్తులేనని అన్నారు. ఎదుటివాడిని చంపాల్సిన శక్తి కంటే తను చచ్చేందుకు ఎక్కువ శక్తి కావాలని, అలాంటి శక్తితో ఆత్మార్పణ చేసుకున్న శ్రీవాసవీ మాత కులమే వైశ్యులదని వివరించారు. మొట్టమొదట సత్యాగ్రహం చేసింది వాసవీ మాత అని గుర్తుచేశారు. వాసవీ మాత అమ్మవారి చరిత్రను పిల్లలకు చెప్పాలని సూచించారు. వైశ్యులకు వేదిక కావాలనే ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రసేన గుప్త వాసవి క్లబ్‌ను ప్రారంభించారని, ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా 1674 వాసవి క్లబ్‌లు సేవలందిస్తున్నాయని, అందులో 62 వేల మంది సభ్యులున్నారని చెప్పారు. సంపాదించిన డబ్బును తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు ఖర్చు చేసినపుడే సంపాదనకు సార్థకత ఉంటుందని హితవు పలికారు.
తల్లిదండ్రులను చూసుకోకపోవడంతో వృద్ధాశ్రమాలు ఏర్పాటవుతున్నాయని అవి మంచిది కాదని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు ఏదైనా చేయాలని అన్నారు. కైలాసం వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు పాదసేవ చేయడం సాధ్యం కాదు కాబట్టే తల్లిదండ్రులు వారి రూపంలో వచ్చారని అన్నారు. పిల్లలకు ఆస్తుల కంటే అద్భుతమైన చదువులు ఇవ్వాలని సూచించారు. లక్ష్మితో పాటు సరస్వతీ దేవి ఆర్యవైశ్యులకు ప్రసన్నమవుతోందని దానికి నిదర్శనమే ఇటీవలే సాధించిన ర్యాంకులని పేర్కొన్నారు. కష్టపడే సమయలో కష్టపడి విలాసంగానూ గడపాలని, స్థోమతకు మించి దానం చేయరాదని సూచించారు. వైశ్యులు నాయకులుగా ఎదిగితే లంచగొండితనం ఉండబోదని చెప్పారు. విశిష్ట అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యానని ఏనాడూ పోజు కొట్టలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. వాసవిక్లబ్‌కు ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని తెలిపారు. అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసిన ఘనత ఆర్యవైశ్యులదేనని చెప్పారు. గిరిజన తండాలో గెలిచి ఆర్యవైశ్యుల ఆశీస్సులతో తాను చైర్మన్‌గా ఎన్నికయ్యానని పేర్కొన్నారు. వైశ్యులు పిరికివారు కాదని, ధైర్యసాహసాలు కలిగిన వారని అన్నారు. మంచినీటి సమస్య కోసం నిరంతరం శ్రమిస్తున్నామని వివరించారు. అన్ని కుల, మతాలను సమానంగా భావిస్తామని తెలిపారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ కె.జయదేవ్ మాట్లాడుతూ దినచర్యను పక్కనబెట్టి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ వాసవి క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మామిడి అరవింద్ మాట్లాడుతూ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయాలు త్రివేండ్రం, అనంతగిరిలో మాత్రమే ఉన్నాయని, అలాంటి ప్రసిద్ధ అనంతగిరిలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గవర్నర్ చందా శ్రీ్ధర్, గోల్డ్‌స్టార్‌లు నామా శ్రీనివాస్, ప్రకాష్, పూర్ణచందర్‌రావు, రాఘవేందర్, కొంపల్లి విద్యాసాగర్, వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దోమరాములు, ప్రధానకార్యదర్శి లగిశెట్టి అశోక్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు మామిడి జ్యోతి, ప్రధానకార్యదర్శి వి.వరలక్ష్మి, ఇండియన్ వైశ్య ఫెడరేషన్ మహిళా అధ్యక్షురాలు మామిడి అరుంధతి, ప్రధానకార్యదర్శి యాస్కి శ్రీదేవి, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు సింగారపు అరవింద్, ప్రధానకార్యదర్శి మోములరాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రధానకార్యదర్శిగా మ్యాడం శ్రీపాదదత్తు, కోశాధికారి మాలె శ్రీనివాస్‌లతో సహా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. వ్యాఖ్యాతగా అల్లెంకల వీరేశం వ్యవహరించారు. అంతుక ముందు శ్రీవాసవి మాత పూజ, ప్రతిజ్ఞ చేశారు.