రంగారెడ్డి

ఉద్యమంలా ఇంకుడు గుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 5: భూగర్భజలాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంకుడు గుంతల తవ్వకాలు ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో ఉద్యమంగా కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి, జడ్పిటిసి పొట్టి అయిలయ్య, ఎంపిడిఓ అనీల్‌కుమార్.. ఇంకుడు గుంతలను త్రవ్వించారు. మండల పరిధిలోని 18గ్రామంలో పది చొప్పున మొత్తంగా 193 ఇంకుడు గుంతలను తీశారు. మంచాల మండల వ్యాప్తంగా గ్రామానికి ఐదు చొప్పున గుంతలు తీయించారు. ఎంపిపి గుండెమోని జయమ్మ, జడ్పీటిసి మహిపాల్, వైస్ ఎంపిపి దనె్న బాషయ్య, ఎంపిడిఓ నాగమణి ఇంకుడు గుంతలు తీశారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్: ప్రతి నీటి చుక్కను కాపాడుకోవడానికి ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్యాట మల్లేశం అన్నారు. గురువారం పాఠశాల ఆవరణలో వర్షపు నీటిని నిలువ చేసేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో నీటి యుద్దాలు జరగకుండా ఉండటానికి ఇది మంచి ప్రయోగమని చెప్పారు. ప్రభుత్వ పరంగా ప్రతి ఇంటిలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు కోసం చట్టం తేవాలని అభిప్రాయపడ్డారు. భూగర్భ జలాలు లేకపోవడం మూలాన మానవ ప్రగతికి అవరోధం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు గుణవంత్‌రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశం, హుస్సేన్ పాల్గొన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేయాలని వికారాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలు ఎస్.్భగ్యలక్ష్మి అన్నారు. గురువారం కొంపల్లి, గిరిగెట్‌పల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ భవనాల వద్ద ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించారు. ప్రతి నీటిచుక్క చాలా విలువైనదని చెప్పారు. వర్షం కురిసినపుడు మురికినీటి కాలువల గుండా వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంపిడివో ఎం.సత్తయ్య మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆదేశం మేరకు ఇంకుడు గుంతల ఏర్పాట్లలో వికారాబాద్ మండలం ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. సర్పంచ్‌లు రేవతి, నర్సింలు, టియుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్, టిఆర్‌ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాధవరెడ్డి, ఉపాధ్యాయురాలు కరుణశ్రీ పాల్గొన్నారు.
మర్పల్లి
మర్పల్లి: ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంచుకోవచ్చని మర్పల్లి జడ్పీటిసి శోభారాణి అన్నారు. ఎంపిడివో, తహశీల్దార్, వెలుగు, ఉపాధిహామీ కార్యాలయాల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి సుమిత్రమ్మ, సహకార బ్యాంక్ చైర్మన్ ప్రభాకర్‌గుప్త పాల్గొన్నారు.
తాండూరులో..
తాండూరు: ఇంకుడు గుంతల నిర్మాణంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ కొట్రిక విజయలక్ష్మీ అన్నారు. గురువారం తాండూరులో ఇంకుడు గుంతల ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు. ఇందిరానగర్, గొల్లచెరువు, యశోదానగర్, మల్‌రెడ్డిపల్లి, సాయిపూర్, పాతతాండూరు, శాంతినగర్, పసారివార్డులో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. పట్టణంలోని 31వార్డుల్లో రూ.4లక్షల వ్యయంతో ఇంకుడు గుంతలను నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్, డిఇ సత్యనారాయణ, మేనేజర్ శ్రీహరి పాల్గొన్నారు.
టప్పాఛబుత్రా పోలీస్‌స్టేషన్‌లో..
నార్సింగి: భూగర్భ జలాలు తగ్గిపోకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలు ఎంతో దొహద పడతాయని టప్పాఛబుత్రా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బండారు రవీందర్ అన్నారు. పశ్చిమ మండల పరిధిలోని టప్పాఛబుత్రా పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఇంకుడు గుంతను తవ్వారు. ఇన్‌స్పెపెక్టర్ మాట్లాడుతూ రోజురోజుకు ఎండలు తీవ్రత్రరం అయ్యాయని దీంతో భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంకుడు గుంత నిర్మాణ పనులలో పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వర్‌రావు ప్రారంభించారు.
ఏసిపి కార్యాలయంలో..
ఖైరతాబాద్: నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పశ్చిమ మండల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు సిబ్బంది నడుం బిగించారు. గురువారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో, సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇంకుడు గుంతలు తవ్వారు. ఏసిపి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సర్వజీవులకు ప్రాణదారమైన నీటి వనరులు తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణపై దృష్టి సారించాలని వెంకటేశ్వర్లు అన్నారు. నీటి కోసం వేలాది అడుగుల బోర్లు వేసే వారు దాని కోసం అయ్యే ఖర్చులో ఐదోవంతు ఖర్చు చేస్తే ఇంట్లో ఇంకుడు గంతలు ఏర్పాటు చేసుకోవచ్చునని సూచించారు. సుమారు వంద మంది వరకు పనిచేసే పోలీస్‌స్టేషన్లలో నీటి వినియోగం అధికంగా ఉంటుందని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్: నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి అందుకోసం నడుంబిగించాలని మేడ్చల్ జడ్పీటిసి శైలజ పిలుపునిచ్చారు. మండలంలోని కండ్లకోయ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం సర్పంచ్ కందాడి నరేందర్‌రెడ్డితో కలిసి ఇంకుడు గుంత నిర్మాణానికి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. జలసిరిని ఓడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరు విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర కరవు నెలకొందని భవిష్యత్తులో దీనిని అధిగమించడానికి ఇంకుడు గుంతల నిర్మాణం ఎంతో అవశ్యకమని అన్నారు. వర్షం నీటిని ఓడిసి పట్టి ఇంకుడు గుంతలో ఇంకించడంతో భూగర్భ జలాలు పెంపొందించే వీలు కలుగుతుందని ఆమె అభిప్రాయమడ్డారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి తమతమ నివాసాల వద్ద వర్షం నీటిని ఓడిసి పట్టేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటేశ్, ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఇంకుడు గుంత నిర్మాణ పనులను ఎంపిటసిలు అమరం మోహన్‌రెడ్డి, ఉసిగారి శ్రీనివాస్‌లు ప్రారంభించారు. కార్యక్రమంలో రాఘవచారి, రామచారి పాల్గొన్నారు.
ధారూర్‌లో..
ధారూర్: అడుగంటిపోయిన భూగర్భ జలాలను రక్షించేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని తద్వార భూగర్భ జలాలు పెరుగుతాయని ఎంపిపి ఉమాపార్వతి రాజునాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని దోర్నాల్, స్టేషన్‌ధారూర్, ధారూర్ గ్రామాలలో ఇంకుడు గుంతల తవ్వకాలను ప్రారంభించారు. జిల్లాలో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని ధారూర్ మండలంలో ఎక్కువ సంఖ్యలో ఇంకుడు గుంతలు తవ్వేందుకు అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, యువజన సంఘాల సభ్యులు చొరవచూపాలని అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటేనే భావి తరాలకు తాగు, సాగు నీరు అందుతుందని చెప్పారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా తవ్వుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తవ్వుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలిపారు. గురువారం ఒక్కరోజే 186 ఇంకుడు గుంతలను తవ్వినట్లు మండల ఎపిఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఓ సబిత, ఈఓఆర్‌డి అనిత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ధారూర్ ఎస్‌ఐ షంషొద్దీన్ పాల్గొన్నారు.
మండల పరిధిలోని కుక్కింద ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో జడ్‌పిటిసి రాములు ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు తవ్వించారు. ఇంకుడు గుంతలు తవ్వుకుని ఆందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సర్పంచ్ మాణెమ్మ పాల్గొన్నారు.