రంగారెడ్డి

పట్టుకోండి చూద్దాం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 30: వరుస దొంగతనాలు చేస్తూ నా పేరు ఇదీ..నన్ను పట్టుకోవడం ఎవ్వరితరం కాదని పోలీసులకు సవాల్ విసురుతూ దొంగతనం చేసిన దుకాణంలోనే ఓ డైరీలో ఈ విషయాన్ని వ్రాసి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్లితే షాద్‌నగర్ పట్టణంలోని పరిగిరోడ్డులో పోచమ్మటెంపుల్ పక్కన ఉన్న మూడు దుకాణాలలో దొంగ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
గడిచిన నాలుగు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేసిన దుకాణాలల్లోనే తిరిగి చేస్తున్నాడు. గురువారం రాత్రి త్రినేత్ర సూపర్‌మార్కెట్, శాంభవి కంప్యూటర్స్, మహాలక్ష్మి ఎలక్ట్రికల్స్‌లలో పైకప్పులు తొలగించి దుకాణాల్లోకి చొరబడి సుమారు 20వేల నగదుతోపాటు 20వేలు విలువ చేసే పరికరాలను,కిరాణ సరుకులు దొంగిలించాడు. దొంగతనం జరిగిన దుకాణాలను షాద్‌నగర్ ఎస్సై దాస్ పరిశీలించారు. దుకాణాలలో ఫింగర్ ప్రింట్స్ సేకరించి, యజమానులతో దొంగతనం జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దొంగతనాలను అరికట్టేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్నా ఫలితం లేదని యజమానులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నారాయణసింగ్ దాస్ తెలిపారు.

ఫిబ్రవరిలో టిసిసి పరీక్ష
వికారాబాద్ డిఇవో దీపిక వెల్లడి

వికారాబాద్, డిసెంబర్ 30: టెక్నికల్ సర్ట్ఫికెట్ కోర్సు (టిసిసి) పరీక్ష వచ్చే ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నట్టు వికారాబాద్ జిల్లా విద్యాధికారి ఎం.దీపిక వెల్లడించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సుల పరీక్షలు రాయాలనుకునేవారు జనవరి ఐదులోగా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తులను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ రాసేవారు రూ.100, హయ్యర్ గ్రేడ్‌కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ పరీక్ష రాసేవారు రూ.150, హయ్యర్ గ్రేడ్ పరీక్ష రాసేవారు రూ.200 ఫీజుగా చెల్లించాలని పేర్కొన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 12 వరకు, రూ.75తో 19వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. పదో తరగతి పాసైన వారు లోయర్ గ్రేడ్ పరీక్ష రాయవచ్చని, లోయర్ గ్రేడ్ పరీక్ష పాసైనవారు హయ్యర్ గ్రేడ్ పరీక్ష రాయవచ్చని అన్నారు. దరఖాస్తు ఫారాలు డిఇవో కార్యాలయం లేదా వెబ్‌సైట్‌లో పొందవచ్చని చెప్పారు.