రంగారెడ్డి

బస్సులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, జనవరి 1: కూకట్‌పల్లి ఐడిఎల్ వద్ద పార్క్ చేసి ఉన్న బస్సులో ఆగ్నిప్రమాదం సంభవించింది. ఆగిఉన్న బస్సులో మంటలు చెలరేగి బస్సులో వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు అగ్నికి ఆహుతైంది. కాగా ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం 3 గంట ల సమయంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
స్వచ్ఛ అవగాహన

ఉల్లాసంగా, ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు
వికారాబాద్, జనవరి 1: వికారాబాద్ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. 2016కు వీడ్కోలు పలుకుతూ 2017 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకల్లో పాలుపంచుకున్నారు. శనివారం అర్థరాత్రి వరకు ఇళ్లపైన డిజె సౌండ్‌తో పాటలు వింటూ, కేరింతలు కొడుతూ బంధువులు, మితృలతో ఆనందంగా గడిపారు. అర్థరాత్రి 12 గంటల వరకు చలినిసైతం లెక్కచేయకుండా గడిపిన యువత, చిన్నా పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అక్కడక్కడ టపాకాయలు కాల్చారు. పట్టణంలోని బేకరీలు రకరకాల కేక్‌ల అమ్మకాలకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ఆఫర్‌లు పెట్టి అమ్మారు.
అర్థరాత్రి వరకు వేడుకల్లో పాల్గొన్న జనం ఆదివారం ఆలస్యంగా బయటకు రాగా, జనం లేక రోడ్లు వెలవెలబోయాయి. ఆదివారం జనవరి ఒకటో తేదీ రావడంతో సంబరాలు జరుపుకోవడంలో మునిగి తేలారు. జిల్లాలోని పట్టణాలే కాకుండా గ్రామాల్లోనూ నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. మద్యం దుకాణాల వద్ద జనం కిక్కిరిసిపోయారు. నోట్ల రద్దు కారణంగా డబ్బు చేతిలో లేనివారు సైతం అప్పు చేసి అరువు పెట్టి వేడుకలను నిర్వహించారు.
మందిరాల్లో బారులు తీరిన భక్తులు
ఆదివారం నూతన సంవత్సరం మొదటి రోజు కావడంతో హిందువులు దేవాలయాలు, క్రిస్టియన్లు చర్చిలకు వెళ్లారు. నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. వికారాబాద్ పట్టణ సమీపంలోని సుప్రసిద్ధ దేవాలయమైన అనంతగిరి శ్రీఅనంత పద్మనాభస్వామిని జిల్లా నుండే కాకుండా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకున్నారు. అనంతగిరి ప్రాంగణం జాతర రోజులను తలపించింది.
బుగ్గ రామలింగేశ్వరాలయానికి సైతం భక్తులు క్యూ కట్టారు. పట్టణంలోని శ్రీమల్లిఖార్జున భవనం, శ్రీరామమందిరం, హనుమాన్ దేవాలయం, శ్రీవేంకటేశ్వరాలయం, శ్రీరాఘవేంద్ర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. అనంతగిరి అడవి అందాల మధ్య వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు వేడుకలను జరుపుకున్నారు.
ఉప్పల్‌లో..
ఉప్పల్: నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం ఉప్పల్ పరిసర ప్రాంతాలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చిల్కానగర్‌లోని శివాలయం, ఆదర్శనగర్‌లోని సాయిమందిరం, హబ్సిగూడలోని రామాలయం, వెలుగుట్టలోని శ్రీదుర్గామల్లీశ్వర మల్లిఖార్జున స్వామి ఆలయం, రామంతాపూర్ వెంకట్‌రెడ్డినగర్‌లోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీనివాసపురంలోని కోదండరామ స్వామి ఆలయం, ఇందిరానగర్‌లోని శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం, ఉప్పల్ స్వరూప్‌నగర్‌లోని కనిగిరి క్ష వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీరామచంద్ర స్వామి ఆలయం, రాఘవేంద్రకాలనీలోని వినాయక ఆలయం, విజయపురికాలనీలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, ధర్మపురికాలనీలోని సాయిబాబా ఆలయం, బోడుప్పల్‌లోని శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం, పీర్జాదిగూడలోని పద్మావతి గోదాదేవి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, కెనరానగర్‌లోని శివాలయం, మేడిపల్లిలోని శ్రీవీరాంజనేయ స్వామి ఆలయం, పర్వతాపూర్ శ్రీరమణపురంలోని శ్రీదుర్గామల్లిఖార్జున స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి ఆలయం, చెంగిచర్లలోని సాయిబాబ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మూన్ వాకర్ డ్యాన్స్ స్టూడియోలో..
ఎల్‌బినగర్: ఎల్‌బినగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ శ్రీవివేకానందనగర్(వివినగర్)లోని మూన్‌వాకర్ డ్యాన్స్ స్టూడియోలో నూతన సంవత్సరం-2017 వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టూడియో నిర్వాహకుడు, డ్యాన్స్ మాస్టర్ చక్రీజాక్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. చక్రీ జాక్సన్ నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. డ్యాన్స్ స్టూడియోను ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు గడిచిందని, స్టూడియో ఏర్పాటు నుండి ఎంతో మంది విద్యార్థులకు వెస్టర్న్, కాన్‌టెంపరరీ, హిప్-హప్, సాల్సా, సెమీక్లాసిక్, జుంబ ఎరోబిక్స్, బాలివుడ్ స్టైల్స్‌లలో నృత్యరీతులను నేర్పించి రియాలిటీషోలలో ప్రతిభకనబర్చే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు.
ఘట్‌కేసర్‌లో
ఘట్‌కేసర్: నూతన సంవత్సర వేడుకలు ఘట్‌కేసర్ మండలంలో శనివారం రాత్రి యువతి, యువకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీనిధి రిసార్ట్స్, చంద్రాస్ హోటల్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువతి, యువకులు సందడి చేశారు.
సంస్కృతి టౌన్‌షిప్ ఆవరణలోని క్రీడా మైదానంలో అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరిప్రసాద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2016వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2017వ సంవత్సరానికి స్వాగతం పలుకుతు యువతి, యువకులు కేరింతలు కొడుతు వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతు కేక్‌లు కట్ చేసి, బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. యువతి, యువకులతో పాటు వృద్ధులు మేము సైతం అంటు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కిటకిటలాడిన దేవాలయాలు
నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు అయా గ్రామాలలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయం నుంచి బారులు తీరి ప్రత్యేక పూజలు జరిపారు. పోచారంలోని శివాలయం, ఎదులాబాద్‌లోని శ్రీరంగనాయకస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. స్థానిక సర్పంచ్ మూసి శంకరన్న ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. సంస్కృతి టౌన్‌షిప్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరిప్రసాద్‌రావు ఆధ్వర్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కూకట్‌పల్లిలో..
కెపిహెచ్‌బికాలనీ: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కూకట్‌పల్లిలో సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాలు, యువత పెద్ద ఎత్తున నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్‌లు కట్‌చేసి, బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో అందరికి మంచి జరిగాలని ఆశీస్తూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు.
కెపిహెచ్‌బికాలనీలో..
కెపిహెచ్‌బికాలనీ 9వ ఫేజ్ టిడిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి కెపిహెచ్‌బికాలనీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై నూతన సంవత్సర కేక్‌ను కట్ చేశారు. డివిజన్ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియచేశారు. నూతన సంవత్సరంలో డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. జాస్తీ శ్రీ్ధర్, నారాయణరాజు, సర్వేశ్వర్‌రావు, పద్మాచౌదరి, భద్రం, హరిబాబు, గపూర్, సత్తార్, జిఎస్‌ఎన్ రాజు, మధు, మణి, లత, భారతి పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయంలో..
కూకట్‌పల్లి జిహెచ్‌ఎంసి సర్కిల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు. డిప్యూటీ కమిషనర్ నరేందర్‌గౌడ్, ఎఎంహెచ్‌ఓ సంపత్, శానిటరీ సూపర్‌వైజర్ సుధాకర్, వార్డు సభ్యులు అరుణ, ప్రభాకర్‌గౌడ్, పంచ గంగేశ్వర్, నారాయణరెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
ప్రముఖులకు ఆశీర్వచనాలు
కీసర: జిల్లాలోని ప్రముఖులకు కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆశీర్వచనాలను ఆదివారం పండితులు అందజేసారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాపరిషత్ చైర్మన్ పి.సునీతా మహేందర్‌రెడ్డికి, మల్కాజ్‌గిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి నివాసాలకు వెళ్లి కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆశీర్వచనాలు పండితులు అందజేసారు. స్వామి వారి శేష వస్త్రాన్ని కప్పి, స్వామివారి ప్రసాదాన్ని అందజేసారు. మల్లారెడ్డి, సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నూతన సంత్సరం అందరికి మంచి జరగాలని, అనుకున్నవన్నీ నెరవేరాలని ఆకాంక్షకించారు. ఆలయ చైర్మన్ టి.ఉమాపతిశర్మ, ధర్మకర్తలు రమేశ్‌శర్మ, వెంకటేశ్, పండితులు రవిశర్మ, ప్రణీత్‌శర్మ పాల్గొన్నారు.

ముదిరాజ్‌లను బిసి-ఎకు మార్చేందుకు సమగ్ర నివేదికను పంపండి

జీడిమెట్ల, డిసెంబర్ 31: ముదిరాజ్‌లను బిసి- డి గ్రూపు నుండి బిసి-ఎ గ్రూపులోకి మార్చేందుకు బిసి కమిషన్ సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు పంపించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు చినంగి వెంకటేశం ముదిరాజ్ కోరారు.
శనివారం కుత్బుల్లాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కెపి వివేక్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ ముదిరాజ్‌లను బిసి-డి నుండి బిసి-ఎ గ్రూపు మార్పుపై సుప్రీంకోర్టు ఆదేశానుసారం తెలంగాణ బిసి కమిషన్ సమగ్ర నివేదికను కోర్టుకు పంపించాలని అన్నారు. 2009లో శ్రీ దవళ సుబ్రహ్మణ్యం, బిసి కమిషన్ ముదిరాజ్‌లను బిసి-ఎలో చేర్చడానికి అన్ని అర్హతలున్నాయని తెలిపిందని చెప్పారు.
అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన అప్పటి ప్రభుత్వం జీవో నంబరు 15 ద్వారా ముదిరాజ్‌లను బిసి-ఎ గ్రూపులోకి చేర్చి న్యాయం చేసిందని, అయితే బిసి కమిషన్ కాలపరిమితి పూర్తికావడంతో సుప్రీం కోర్టుకు సమగ్ర నివేదిక పంపించలేక పోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన బిసి కమిషన్ సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు పంపించాలని, ఈ విషయాలను ప్రభుత్వం బిసి కమీషన్ ద్వారా తక్షణమే సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుకు అందించాలని, దీని కోసం ఎమ్మెల్యే వివేక్ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారదిశగా పాటుపడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్ ముదిరాజ్, నరేందర్, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఎల్‌ఇడి బల్బులతో విద్యుత్ పొదుపు
* ఎమ్మెల్యే కెపి వివేక్
జీడిమెట్ల, డిసెంబర్ 31: ఎల్‌ఇడి బల్బులతో విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. గాజులరామారం డివిజన్ శ్రీవెన్ ఎన్‌క్లేవ్‌లో కేంద్రప్రభుత్వం నుండి సబ్సిడీతో రూ.150 బల్బును రూ.70లకే అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి వివేక్ బల్బులను కాలనీ వాసులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఎల్‌ఇడి బల్బులను వాడడం వలన విద్యుత్ ఉత్పత్తి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతిని పొందవచ్చని తెలిపారు. ఎల్‌ఇడి బల్బులను వాడడం మూలాన విద్యుత్ బిల్లు సైతం తక్కువగా వస్తుందని చెప్పారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఇడి బల్బులపై సబ్సిడీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు అంజన్‌గౌడ్, లాల్ మహ్మద్, మల్లేశ్, హనీషా, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
గాజులరామారం డివిజన్ హెచ్‌ఎఎల్ కాలనీలో రూ.10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్ శనివారం ప్రారంభించారు. అదేవిధంగా మెట్టుకానిగూడ, శ్రీవెన్ ఎన్‌క్లేవ్‌లలో మంచినీటి పైపులైన్ పనులను వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ బస్తీలలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన బాధ్యత అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు అంజన్‌గౌడ్, మసూద్, ముకేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి...
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. చింతల్, గణేశ్‌నగర్‌లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను వివేక్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా సురక్షిత చోటుకు తరలించి చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ఎడిఇ తులసీరామ్, ఎఇ మధుకర్, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.