రంగారెడ్డి

నూతన సంవత్సరంలో సమస్యలులేని జిల్లాగా తీర్చిదిద్ధాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జనవరి 2: నూతన సంవత్సరంలో మేడ్చల్ జిల్లాను సమస్యలు లేని జిల్లాగా అధికారులు రూపుదిద్ధాలని కలెక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా అధికారులతో కలెక్టర్ కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు పలువురు అధికారులు పుష్పగుచ్ఛాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్న జిల్లాల వల్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని కోరారు. అధికారులకు శాఖా పరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని అన్నారు. అవసరమైనప్పుడు అధికారులు ఎక్కువ సమయం కేటాయించాలని పేర్కొన్నారు. జిల్లాలో ఆదర్శ గ్రామాలు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దానిని త్వరలోనే మేడ్చల్ జిల్లాలో అమలు చేస్తామని వివరించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే క్రీడల్లో అధికారులందరూ పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు పాల్గొన్నారు.
ప్రజావాణిలో 91 దరఖాస్తులు
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 91 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. జిల్లాలో హరితాహారం క్రింద తుమ్మచెట్లను నాటాలని కీసర మండల బిజెపి అధ్యక్షుడు రాజిరెడ్డి వినతి పత్రాన్ని అందజేసారు. గోధుమకుంట గ్రామంలో నిబంధనకు విరుద్ధంగా వెయ్యి గజాలలో చర్చి నిర్మాణాలు చేపడుతున్నారని, తక్షణమే పనులు నిలిపి వేయాలని గ్రామస్థులు ఫిర్యాదు చేసారు. శామీర్‌పేట్ మండలం లాల్‌గాడి మలక్‌పేట్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి నెల రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోలేదని, తక్షణమే దుండగులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విన్నవించారు. నాగారం గ్రామంలో చెత్తడంపింగ్ కోసం స్థలం కేటాయించాలని కోరారు. చీర్యాల గ్రామంలో సర్పంచ్ భర్త శ్రీనివాస్ రోడ్డును ఆక్రమించి నిర్మానాలు చేపడుతున్నాడని ఫిర్యాదు చేసారు. డబుల్ బెడ్‌రూం, వృద్దాప్య ఫింఛన్లు, రేషన్ కార్డుల కోసం పలువురు ఫిర్యాదు చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఓ సురేందర్‌రావు పాల్గొన్నారు.
మాజీ సైనికుడిని ఢీకొట్టిన కేసులో నిందితుడి అరెస్టు

గచ్చిబౌలి, జనవరి 2: మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ రోడ్డు దాటుతున్న మాజీ సైనికుడిని ఢీకొట్టిన కేసులో నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం సిఐ దుర్గప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేగుల దేవదానం(72) మాజీ సైనికుడు. రాయదుర్గంలో నివాసముంటు ఎన్‌సిడి సెక్యూరిటీ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. రాయదుర్గంలో ఆయనకు కొంత స్థలం ఉండడంతో ఇంటి నిర్మాణ చేసుకుంటున్నాడు. డ్యూటీ అనంతరం ఇంటి పని చూసికుని రాత్రి అక్కడే ఉండి ఉదయానే్న ప్రస్తుతం నివాసమేంటున్న ఇంటికి వచ్చి తిరిగి డ్యూటికి వెళ్తూంటాడు. గత నెల 10వ తేదీన ఉదయం 5గంటలకు భార్యకు ఫోన్ చేసి తను ఇంటికి వస్తున్నానని డ్యూటీకి వెళ్లాలని క్యారేజీ తయారు చేసి పెట్టామని చెప్పాడు. సమయం 6.30 అయినప్పటీ భర్త ఇంటికి రాకపోవడతో భార్య కరుణమ్మ ఫోన్ చేసింది. ఫోను మ్రోగుతున్నప్పటికి భర్త ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటికి బయలు దేరింది. మార్గ మధ్యలో దేవాదానం రోడ్డు పక్కన తీవ్రగాయలతో పడి ఉండడంతో 108కు ఫోన్ చేసింది. సిబ్బంది వచ్చి పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన ప్రదేశంలో పోర్డ్‌కారుకు చెందిన బంపర్ దొరికింది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్‌కు చెందిన ప్రశాంత్ కుమార్ (24) 9వ తేది రాత్రి స్నేహితులతో కలసి పబ్‌కు వెళ్లి ఉదయం స్నేహితులను గచ్చిబౌలిలో విడిచి వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతున్న దేవాదానాని ఢీకొట్టినట్లు పోలీసుల విచారణలో తెలింది. నిందితుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ తెలిపారు. కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటి నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని అభినందించారు.