రంగారెడ్డి

రోడ్డెక్కిన గొట్టిముక్ల రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 3: వరి పంట సాగు చేసి నష్టపోయిన వికారాబాద్ మండలం గొట్టిముక్ల గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. మంగళవారం గొట్టిముక్ల గ్రామానికి చెందిన రైతులు పంట నష్టపోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుర్గుపల్లి బస్టాప్ వద్ద, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం సర్పంచ్ అరుణతో సహా జిల్లా కలెక్టర్ దివ్యను కలిసి వినతిపత్రం సమర్పించగా స్పందించిన కలెక్టర్ వరి పండకపోవడానికి కారణం విత్తనాలా లేక భూమి కారణమా అనే విషయాలను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరి పొలాల పరిస్థితిని పరిశీలించాలని అక్కడే ఉన్న సందీప్‌కుమార్‌కు ఆమె సూచించారు. గ్రామానికి చేరుకున్న సబ్‌కలెక్టర్ అప్పటికే చేరుకున్న జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, ఎడిఎ దివ్యజ్యోతి, మండల వ్యవసాయాధికారి వినె్సంట్ వినయ్‌కుమార్, ఏరువాక శాస్తవ్రేత్తలు సర్పన్‌పల్లి ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల కింద సాగు చేసిన 21 మంది రైతుల పొలాలను పరిశీలించారు. జూన్ తర్వాత పంట సాగు చేయడం, చలి తీవ్రత కారణంగా వరి పంట కాలేదని శాస్తవ్రేత్త రమేష్ స్పష్టం చేయడంతో రైతులు అక్కడే ఉన్న విత్తనాలు, ఎరువుల కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసల్ బీమా యోజన చేసి ఉంటే రైతులకు పరిహారం అందుతుందని, బీమా చేశారా అని అడిగిన సబ్‌కలెక్టర్ ప్రశ్నకు రైతుల నుంచి సమధానం రాకపోగా, అసలు పథకం గురించే తెలియదనే సమాధానం రావడంతో వ్యవసాయ శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 10వ తేదీలోపు బీమా చేయాలని సబ్‌కలెక్టర్ ఝా సూచించారు.

తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా

తాండూరు, జనవరి 3: తాండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. 2014 మున్సిపల్ ఎన్నికలలో ఎంఐఎం నుంచి సాజిద్‌అలీ గెలుపొందారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి కొట్రిక విజయలక్ష్మీ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించేలా రెండు పార్టీల అధికార భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నారు. రెండు పార్టీలు చెరో రెండున్నర ఏళ్ల పాటు చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ స్థానాలను పంచుకున్నారు.
వైస్ చైర్మన్‌గా రెండున్నర ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసినందుకు తమ రెండు పార్టీల భాగస్వామ్యం ఒప్పందం ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు సాజిద్ అలీ తెలిపారు. తాండూరు మున్సిపాలిటీలో మొదటిసారి అత్యధిక కౌన్సిలర్ స్థానాలు(10) గెలిచి అధికార టిఆర్‌ఎస్‌తో భాగస్వామ్య పార్టీగా చేసుకున్న ఒప్పందం మేరకు జనవరి 3నాటికి వచ్చే రెండున్నరేళ్లు తమపార్టీ చైర్‌పర్సన్ పాలన మొదలవుతుందని తాండూరు నియోజకవర్గం మజ్లిస్ పార్టీ ఇన్‌చార్జి ఎంఎ హాదీ షహారీ పేర్కొన్నారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీల అధికార భాగస్వామ్యం ప్రకారం తమ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ పదవి నుంచి వైదొలుగుతూ రాజీనామా సమర్పించారని గుర్తుచేశారు. రాబోయే రెండున్నరేళ్లు పట్టణ ప్రజలు విస్మయం చెందే విధంగా తమ మజ్లిస్ పార్టీ పాలన కొనసాగుతుందని తెలిపారు. ఎంఐఎం పట్ల అన్ని వర్గాల ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను రూపుమాపి మన్ననలు పొందేలా పాలన ఉంటుందని నిరూపిస్తామని హాదీ చెప్పారు.