రంగారెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జనవరి 17: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలను తీసుకోవడంతో పాటు నిబంధనలను పాటించని వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. 28వ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఎల్బీనగర్ కామినేని చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ ఎల్బీనగర్ నుంచి ప్రధాన చౌరస్తాల మీదుగా నినాదాలు చేస్తూ చేపట్టారు. జాన్సన్ గ్రామర్ స్కూల్‌లోని ఆడిటోరియంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సిపి ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. మైనర్ యువకులు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడపడం తోపాటు అధిక శాతం మద్యం సేవించడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగున్నాయని తాము గుర్తించినట్లు చెప్పారు.
ఓఆర్‌ఆర్‌పై ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం మద్యం సేవించిన వారే ఉన్నారని, వాటిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారి పట్ల ఇప్పటి వరకు అనేక కౌన్సిలింగ్ లు ఇవ్వ డంతో పాటు జరిమానాలు విదించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించి తమ ప్రణాలను కాపాడుకోవాలని సిపి కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డిసిపి దివ్యచరణ్ రావు, ఎల్బీనగర్ ఏసిపి వేణుగోపాల్ రావు, ఇన్స్‌పెక్టర్ కాశీరెడ్డి పాల్గొన్నారు.

లేబర్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల ఏర్పాటు
అసెంబ్లీ సమావేశంలో
ఎమ్మెల్యే కెపి వివేక్ డిమాండ్

జీడిమెట్ల, జనవరి 17: కార్మికులను దృష్టిలో పెట్టుకుని లేబర్ అసిస్టెంట్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వివేక్ కార్మికుల సమస్యల పై ఆయన మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల నుండి బతుకు దెరువు నిమిత్తం వచ్చి జీడిమెట్ల పారిశ్రామిక వాడలలోని పరిశ్రమలలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బిల్డర్‌లు, కాంట్రాక్టర్‌లు కార్మికులకు ఎలాంటి పని చేపట్టినా వారికి సంబంధించిన వివరాలను వెంటనే లేబర్ కార్యాలయంలో మెంబర్‌షిప్ చేయిస్తే ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. కార్మికులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నూతనంగా ఏర్పాటైన 31 జిల్లాల్లో లేబర్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలను, జెడ్‌పి కమిషనర్ లేబర్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా కార్మికులను చైతన్య పరిచేందుకు ఉపయోగకరంగా ఉంటుందని వివేక్ చెప్పారు.
కార్మికులకు అవగాహన కల్పించేందుకు కార్మిక శాఖ కార్యాలయాలను తెరవాలని కోరారు. గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి వివేక్ ధన్యవాదాలు తెలిపారు. గొర్రెల కాపరులకు కూడా కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయాలని అన్నారు. దీనికి స్పందించిన మంత్రి పద్మారావు మాట్లాడుతూ సమస్యలన్నింటిని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు.
పెన్షన్ కార్యాలయంలో పెన్షనర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెండవ అంతస్థులోని కార్యాలయంలో లిఫ్ట్ కూడా పని చేయడం లేదని, పెన్షన్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే వివేక్ కోరారు. బయోమెట్రిక్ విధానం ద్వారా లైఫ్ సర్టిటఫికెట్లను ప్రాంతాల వారీగా ఇ-సేవాలు, పోలీస్‌స్టేషన్‌లలో ఏర్పాటు చేయడంతో వృద్ధులకు ఎంతో లబ్ది చేకూరుతుందని వివేక్ కోరారు. సంబంధిత మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ వివేక్ సూచనలు అభినందనీయమని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.