రంగారెడ్డి

ఎన్నికల నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 15: జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల సందర్భంగా నియమ, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమ, నిబంధనలపై పోలీసు శాఖ, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి తొమ్మిదో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేది ఈనెల 20 అని, 21న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 15న ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసు, ఎన్నికల నిర్వహణ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా అమలుపర్చాలని అన్నారు. అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సమావేశాల కొరకు ముందస్తుగానే పోలీసుల అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధుల ప్రైవేటు కార్యక్రమాలకు హాజరుకాకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించకుండా డబ్బు, మద్యం పంపిణి నివారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
నిబంధనల సందర్భంగా ప్రారంభోత్సవాలు, నూతన పథకాల ప్రకటనలు చేయరాదని అన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ లతామాధురి, డిఆర్‌డివో సంధ్యారాణి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

భర్త వేధింపులు తాళలేక
గృహిణి ఆత్మహత్య
జీడిమెట్ల, ఫిబ్రవరి 15: భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళంకు చెందిన శివంగి నాగమణి (25), ఆనంద్ రావులకు 2011లో వివాహం జరిగింది. ఆరునెలలుగా వీరు షాపూర్‌నగర్, సంజయ్‌గాంధీనగర్‌లో అద్దెకు నివాసముంటున్నారు. ఆనంద్‌రావు మెగా ఇంజనీరింగ్ వర్క్‌షాపులో వెల్డర్‌గా పనిచేస్తుంటాడు. నాగమణి, ఆనంద్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. తరచూ ఆనంద్, భార్య నాగమణిల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులు తాళలేక నాగమణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ...
మహేశ్వరం, ఫిబ్రవరి 15: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడతూ ప్రమాదవశాత్తు విద్యుతాఘాతానికి గురై ఓ వ్యక్తి మరణించిన సంఘటన మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలం పరిధిలోని మొహబత్‌నగర్‌లో నివసిస్తున్న రామావత్ రాజు (35) బుధవారం ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షాక్ వచ్చి తీవ్రంగా గాయపడి మరణించినట్లు మృతుడి భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.