రంగారెడ్డి

‘్భగీరథ’ పైపులను దొంగిలించిన ఏడుగురికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 20: ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగిరధ పథకానికి వినియోగించే లక్షలాది విలువ గల పైపులను దొంగిలించిన ఏడుగురి నిందితులను పోలీసులు సోమావారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ముని, ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ వివరాలు తెలిపారు. ఘట్‌కేసర్ మండలంలో చేపడుతున్న మిషన్ భగిరధ పథకం పనులకు కంట్రాక్టర్ చందన రామమోహనరావు 50 లక్షల రూపాయల విలువ గల హెచ్‌డిపిఇ సుధాకర్ బ్రాండ్ పైపులను అవుషాపూర్‌లోని న్యూ సిటి వెంచర్‌లో నిలువ ఉంచారు. ఈనెల 13న నిల్వ ఉంచిన పైపుల నుండి దాదాపు రూ.14 లక్షల విలువ గల పైపులు దొంగతనానికి గురైనట్లు గమనించి 14న ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన ఘట్‌కేసర్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన ఏడుగురి నిందితులతో పాటు నగరంలోని ముషిరాబాద్‌కు చెందిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కొండమడుగు గ్రామానికి చెందిన స్క్రాప్ దుకాణం నడుపుతున్న బాషగోని బాల్‌రాజు(36), డ్రైవర్‌గా పని చేస్తున్న మారగాని భూపాల్(30), చికెన్ దుకాణం నడుపుతున్న పొన్న హరిబాబు(23), కూలి పనులు చేస్తున్న కడిగల్ల బిక్షపతి(55), ఆటో డ్రైవర్ మారగాని భాస్కర్(25) ముఠాగా ఏర్పడి నగరంలోని ముషిరాబాద్‌లో ప్లాస్టిక్, స్క్రాప్ వ్యాపారం చేస్తున్న మహమ్మద్ ఫరిధ్(38)ని కలిసి రూ.13.90లక్షల విలువ గల పైపులను మూడు లక్షలకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. తీసుకున్న పైపులను ముడి సరుకుగా మార్చుకుంటు సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పారు. కొంత కాలంగా రోజు కొన్ని పైపులను చిన్నవిగా చేస్తు రాత్రి సమయంలో ముషిరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి బొలేరో వాహనంలో పైపులను తరలిస్తుండగా అవుటర్ రింగ్‌రోడ్డు సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలలో భాగంగా ప్రశ్నించారు. దీంతో పైపులు తరలిస్తున్న నిందితులు పొంతన లేని సమదానం చెప్పటంతో పాటు ఓ నిందితుడు వాహనం దిగి పారిపోవటంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకుని విచారించారు. దీంతో తీగ లాగితే డొంకంత కదిలినట్లు పోలీసులు తనదైన శైలీలో విచారించగా మొత్తం సమాచారం దొరికింది.
పక్కా సమాచారం సేకరించిన పోలీసులు ఆరుగురు నిందితులు, స్క్ఫ్రా వ్యాపారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించటంతో పాటు రూ.13.90లక్షల విలువైన పైపులు, మహింద్రా బొలేరో వాహనం, బజాజ్ పల్సర్ వాహనం, బజాజ్ చేతక్ వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితులను సకాలంలో పట్టుకుని కేసు చేదించిన క్రైం ఎస్‌ఐ వెంకటయ్య, కానిస్టెబుళ్లను ఇన్‌స్పెక్టర్లు అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మని తెలిపారు.

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
తాండూరు, ఫిబ్రవరి 20: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ప్రజా సమస్యలపైట్ల అధికారులు బాధఋ౎యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ డి.దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని రూపొందిచినట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజాదర్బార్ వంటి పలు కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. భూసమస్యలు, రికార్డులు, రెవెన్యూ సమస్యలు నేటికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొటున్నట్లు చెప్పారు. గ్రామాలలో ప్రజలు సామూహికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజావాణిలో విన్నవించుకుంటున్న సమస్యలను అధికారులు తాత్సార ధోరణిలతో పెండింగ్ వేయడం సరైంది కాదని అన్నారు. ప్రజావాణి సమస్యల పట్ల స్థానిక జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదంటూ కలెక్టర్ సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్ నందు నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన అభివృద్ధి లక్ష్యాలను సాధించటంలో అధికారగణం అప్రమత్తంగా వ్యవహారించాలని అన్నారు. ప్రజలకు తగిన రీతిలో సంక్షేమ పథకాల ఫలితాలు అందుతున్నాయా, ప్రభుత్వ ప్రయోజనాలు ఏందుకు అందటం లేదు అన్న అంశాల పై అన్ని శాఖలు, విభాగాల అధికారులు దృష్టి సారించి పనిచేస్తే ప్రజల సమస్యలు వాటంతట అవే తీరిపోతాయని అధికారులకు సూచించారు.
తాండూరు ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 160 వరకు దరఖాస్తులు వచ్చినట్లు, అందులో 102 దరఖాస్తులు ప్రజావాణి ఆన్‌లైన్‌లో నమోదు కాగా మిగతా ఆర్జీలు కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పరిష్కారం కోసం నేరుగా ఇచ్చినట్లు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది వెల్లడించారు.
ఇసుక మైనింగ్ నిర్వహించొద్దు
తాండూరు కాగ్నా నది పరివాహక ప్రాంతంలోని యాలాల మండలం బెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోప్రభుత్వ పరంగా ఇసుక వేలం, ఇసుక మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదంటూ బెన్నూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు, యువజన సంఘాల నేతలు సోమవారం తాండూరు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇసుకను తరలిస్తే తమ గ్రామానికి తాగు, సాగు నీటి ఎద్దడి ఏర్పడుతుందని విన్నవించారు. బెన్నూరు సర్పంచ్ శమంతమ్మ కొందరు బోగస్ వ్యక్తులు, తాండూరు ఇసుక మాఫీయా గ్యాంగులతో కలిసి ఇసుక మైనింగ్‌కు పంచాయతీ తీర్మానం చేసి అనుమతి మంజూరు చేసినట్లు బోగస్ తీర్మానాలు చేశారని ఆరోపించారు. సర్పంచ్ శమంతమ్మ నిర్వాకంపై ఫిర్యాదు చేశారు. గత ఏడాది వరకు తాగునీరు, సాగు నీరు కోసం అవస్థ పడ్డామని వివరించారు. ఇసుక మైనింగ్‌కు అనుమతి ఇవ్వద్దని కోరారు.
రెవెన్యూ అధికారుపై ఫిర్యాదు
తాండూరు ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం తాండూరు డివిజన్‌కు చెందిన కురుమ సంఘాలు, గొర్రెలు, మేకల పెంపకందారులు జిల్లా కలెక్టర్ డి.దివ్యను కలిసి తాండూరు డివిజన్ రెవెన్యూ అధికారులు, కొడంగల్ మండల రెవెన్యూ అధికారులు, తహశీల్దార్‌పై ఫిర్యాదులు చేశారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వటంలో స్థానిక విలేజ్ రెవెన్యూ అధికారి మొదలు తహాశీల్దార్ వరకు వేధింపులకు గురిచేశారని ఆయా సంఘాల ప్రతినిధులు తాండూరు సంఘం డైరెక్టర్ వెంకటయ్య, నాగప్ప, ఫకీరప్ప, శ్రీనివాస్, విజయ్ శేఖర్, శంకరయ్య, హరిప్రసాద్, మహేష్, అనంతయ్య, మల్లప్ప వివరించారు. జివో 559/1996 ప్రకారం ఐదు ఎకరాల ఖాళీ స్థలం గొర్రెలు, మేకల పెంపకం కోసం కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.